Andhra Pradesh

News March 25, 2024

వ్యక్తిగత కారణాలవల్లే అమర్నాథ్ రెడ్డి హత్య: డీఎస్పీ

image

నల్లమాడ మండలం కొట్టాలపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డిని కేవలం వ్యక్తిగత కారణాలతోనే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైందని డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ వాసుదేవన్ మాట్లాడుతూ.. హత్యలో ఎటువంటి రాజకీయ కోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే చంపి ఉండవచ్చన్నారు.

News March 25, 2024

కమలాపురం: తేనెటీగల దాడిలో ఉపాధి కూలి మృతి 

image

తేనెటీగల దాడిలో ఉపాధి కూలి మృతి చెందినట్లు ఏపీవో సారధి తెలిపారు. ఏపీవో వివరాల మేరకు.. కమలాపురం మండలం గొల్లపల్లెకు చెందిన గురివిరెడ్డిగారి గంగిరెడ్డి కాల్వ పనులు చేస్తుండగా అక్కడే ఉన్న తేనెటీగలు ముక్కుమ్మడిగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు 108 ద్వారా హాస్పిటల్ కు తరలించారు. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని ఆయన తెలిపారు.

News March 25, 2024

అన్నం పెట్టిన ఇంటికే సున్నం.. రూ.7.50 లక్షల చోరీ?

image

ప.గో జిల్లా ఆకివీడులోని మందపాడుకి చెందిన దుర్గాప్రసాద్ ఇంట్లోంచి రూ.7.50 లక్షలు చోరీ అయ్యాయి. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 20న ఓ కుర్రాడు తమ వద్దకు వచ్చి అనాథనని, ఆకలేస్తుందని చెప్పాడని, అన్నం పెట్టి తమ వద్దే ఉంచుకున్నట్లు తెలిపారు. ఇంటికి తాళం వేసి బయటకెళ్లి తిరిగొచ్చేసరికి తాళాలు పగలగొట్టి బీరువాలోని
నగదు కాజేశారని, అప్పటి నుంచే ఆ బాలుడూ కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News March 25, 2024

గుంటూరు: రైలు కింద పడి యువకుడి మృతి

image

రైలు కిందపడి యువకుడు మృతిచెందిన ఘటనపై సోమవారం గుంటూరు GRP పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంబూరు నుంచి రెడ్డిపాలెం వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై యువకుడి మృతదేహం ఉందని సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేశ్ వెళ్లి పరిశీలించారు. యువకుడి పేరు, వివరాలు తెలియలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వివరాలు తెలిసిన వాళ్లు GRP పోలీసులను సంప్రదించాలన్నారు.

News March 25, 2024

నేడు విజయవాడ రానున్న “ఓం భీం బుష్” మూవీ టీం

image

“ఓం భీం బుష్” మూవీ టీం నేడు విజయవాడ రానుంది. ఈ మేరకు ఆ సినిమా ప్రొడక్షన్ బృందం తాజాగా ట్వీట్ చేసింది. “ఓం భీం బుష్” చిత్రం విజయవంతమైనందున చిత్రబృందం తలపెట్టిన వీర విజయ యాత్రలో భాగంగా.. ఈ రోజు రాత్రి 11.15 గంటలకు విజయవాడ శైలజ థియేటర్‌కు ఆ చిత్ర తారాగణం వస్తారని “ఓం భీం బుష్” సినిమా ప్రొడక్షన్ విభాగం తెలిపింది.

News March 25, 2024

బొబ్బిలి ఎమ్మెల్యేపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు 

image

బొబ్బిలి MLAపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదయ్యింది. అనుమతులు లేకుండా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుతో పాటు మరికొంత మంది వైసీపీ నాయకులపై ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిత్రకోట, బొడ్డవలస పంచాయతీలోని ఎంసీసీ కోడ్‌కు వ్యతిరేకంగా పార్టీ ప్రచారం చేస్తున్నారన్న అభియోగంపై ఏఆర్‌ఓ, RDO సాయి శ్రీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు S.I తెలిపారు.

News March 25, 2024

కడప: బీజేపీలో చేరిన టీడీపీ నేత బొజ్జా రోషన్న

image

కడప జిల్లా బద్వేలు టీడీపీ నేత బొజ్జ రోషన్న భారతీయ జనతా పార్టీలో చేరారు. టీడీపీ తరఫున బద్వేలు ఎమ్మెల్యే సీటును ఆశించడంతో ఆ సీటును కూటమి కుదుపులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో రోషన్న తన అనుచరులతో చర్చించి ఈరోజు కాషాయ కండువా కప్పుకున్నారు. కడప బీజేపీ కార్యాలయంలో ఆయనకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

News March 25, 2024

ఐటీ శిక్షణ ఇప్పిస్తానని.. అఘాయిత్యం

image

కరీంనగర్‌కు చెందిన ఓ వివాహిత హైదరాబాద్ KPHPపరిధిలోని ఓ ఇనిస్టిట్యూట్‌‌లో సాఫ్ట్‌వేర్ ఆన్‌లైన్ శిక్షణలో చేరింది. శిక్షకుడు నరేంద్రకుమార్ ధ్రువపత్రాల తనిఖీ కోసం ఆమెను పిలిచి శారీరకంగా లోబరచుకున్నాడు. విషయాన్నిఆ మహిళ శిక్షణ తరగతుల సహచరుడు కృష్ణా జిల్లా వాసి సంతోష్‌‌కి తెలపడంతో అతను ఆమెను వేధింపసాగాడు. అది తట్టుకోలేక మహిళ నిద్రమాత్రలు మింగింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

News March 25, 2024

కోటవాని చెరువులో యువకుడి డెడ్‌బాడీ

image

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట పరిధిలోని కోటవాని చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు. నిడమర్రు మండలం చిననిండ్రకొలనుకు చెందిన సాయి రమేష్ కొంతకాలంగా ఉంగుటూరు మండలం సీతారాంపురంలో ఉంటున్నారు. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నాడు. చెరువులో మృతదేహం తేలగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

News March 25, 2024

పాలకొండ: కట్టె జనుము సాగుతో రైతులకు అపార నష్టం

image

కట్టె జనము సాగుతో రైతులకు అపారనష్టం వాటిలిందని పాలకొండ అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు సోమవారం తెలిపారు. సుమారు 50 శాతం మంది రైతులు అపరాల పంటలకు బదులుగా కట్టె జనుము సాగు చేశారని అన్నారు. గొంగళి పురుగు ఆశించడంతో కాయలు నాశనం అయ్యాయని పేర్కొన్నారు. జిల్లా పునర్విభజన అనంతరం రైతులకు సలహాలు సూచనలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల నుంచి దూరమయ్యాయని వాపోయారు.

error: Content is protected !!