India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగు నాగార్జునకు మద్దతుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు వాలంటీర్లు ఆదివారం తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదనే ఎన్నికల కమిషన్ చెప్పడంతో వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడానికి తాము రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే తమ రాజీనామాలను ఎంపీడీవోకు అందజేయకుండా నాగార్జునకు అందజేయడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ ప్రమాదంలో చిక్కుకున్న మాట ఎవరు అవునన్నా, కాదన్నా వాస్తవమేనని మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా టీడీపీ ముఖ్య నేతలు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడమే దీనికి కారణమన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఆయనకు సీటు ఇవ్వడం తగదన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఇటీవల విష్ణుతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. ఇవాళ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. విష్ణు మాత్రం పోటీలో ఉంటానంటూ ప్రచారంలో దూసుకెళుతున్నారు.
కుప్పం నియోజవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ శాంతిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ టీ దుకాణంలో టీ చేసి ప్రజలకు అందించి వినూత్న రీతిలో ప్రచారం చేశారు. భరత్ టీ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా అందుబాటులో ఉండే తనకు రాబోయే ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
1952 నాటి నుంచి 2019 వరకు ఎస్.కోట నియోజకవర్గంలో17 సార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇద్దరు మహిళలు మాత్రమే గెలుపొందారు. 1999లో టీడీపీ నుంచి తొలిసారిగా శోభా హైమావతి కాంగ్రెస్ అభ్యర్థి గంగాధర స్వామి శెట్టిపై విజయం సాధించారు. టీడీపీ నుంచి కోళ్ల లలిత కుమారి 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ఏ.జోగినాయుడు, 2014లో వైసీపీ అభ్యర్థి రొంగలి జగన్నాథంపై విజయం సాధించారు.
అనకాపల్లి ఎంపీగా 1989లో కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. ఈ స్థానానికి 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఈ మెజార్టీనే అత్యల్పం. కొణతాల ప్రస్తుతం అనకాపల్లి జనసేన MLA అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వెంకట సత్యవతి 89,829 ఓట్ల మెజార్టీతో గెటిచారు. ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేశ్ బరిలో ఉండగా.. వైసీపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.
ఉమ్మడి తూ.గో జిల్లా రంపచోడవరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిరియాల శిరీష బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమె తల్లి కృష్ణవేణి ప్రస్తుతం రాజవొమ్మంగి మండలం గింజర్తిలో వార్డు మెంబర్‌గా ఉన్నారు. 3ఏళ్లుగా ఈ పదవిలో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. కోయదొర సామాజిక వర్గం(ఎస్టీ)కు చెందిన శిరీష నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. శిరీష వయసు 30ఏళ్లు మాత్రమే. TDP అభ్యర్థుల్లో ఈమె పిన్న వయస్కురాలు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ మలి విడత యాత్ర ప్రారంభం కానుంది. మంగళవారం పోలవరం, చింతలపూడి.. బుధవారం తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, గన్నవరం.. గురువారం నూజివీడు, పెనమలూరు, గుడివాడలో ఆమె పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సమయంలో (SEP) మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి ఈ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
నల్లమాడ మండల పరిధిలోని కుటాలపల్లిలో టీడీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని తోట వద్ద నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టగా నడింపల్లి గ్రామానికి చెందిన లగమ వెంకటసుబ్బారెడ్డి అలియాస్ గోపాల్ రెడ్డి, ఆదెన రామచంద్రారెడ్డి మృతి చెందారు. ఒంటిమిట్ట నుంచి నడింపల్లికి బైక్‌పై వెళ్తుండగా, కడప నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటసుబ్బారెడ్డి ఘటనా స్థలంలో మృతి చెందగా, రామచంద్రారెడ్డి మార్గమధ్యలో చనిపోయారు.
Sorry, no posts matched your criteria.