Andhra Pradesh

News March 25, 2024

ఒంటిమిట్ట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టగా నడింపల్లి గ్రామానికి చెందిన లగమ వెంకటసుబ్బారెడ్డి అలియాస్ గోపాల్ రెడ్డి, ఆదెన రామచంద్రారెడ్డి మృతి చెందారు. ఒంటిమిట్ట నుంచి నడింపల్లికి బైక్‌పై వెళ్తుండగా, కడప నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటసుబ్బారెడ్డి ఘటనా స్థలంలో మృతి చెందగా, రామచంద్రారెడ్డి మార్గమధ్యలో చనిపోయారు.

News March 25, 2024

అనిల్.. ఆ సెంటిమెంట్‌ను కొనసాగించేనా?

image

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ నరసరావుపేట లోక్‌సభ వైసీపీ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈయనే కాదు, నెల్లూరు నేతలు పలు ప్రాంతాల్లో పోటీ చేసి గెలిచారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నరసరావుపేట, విశాఖ, బాపట్ల MPగా, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒంగోలు, నరసరావుపేట MPగా, పనబాక లక్ష్మి బాపట్ల MPగా విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో అనిల్ అదృష్టం ఎలా ఉందో వేచి చూడాలి.

News March 25, 2024

ప్రకాశం: సముద్ర స్నానానికి వచ్చి వ్యక్తి దుర్మరణం

image

సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు లోపలకు కొట్టుకుపోయి వ్యక్తి దుర్మరణం పాలయిన సంఘటన వాడరేవులో ఆదివారం చోటు చేసుకుంది. మెరైన్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. కారంచేడు మండలం తిమిడిదపాడు గ్రామానికి చెందిన రాజేశ్ దావీదు (25) ఆదివారం కుటుంబ సభ్యులతో సముద్ర స్నానానికి వెళ్లారు. రాజేశ్ కాళ్లు కడుక్కుని వస్తానని చెప్పి లోపలికి వెళ్లాడే. అలల తాకిడికి ఆయన లోపలకు కొట్టుకుపోయి మృతి చెందాడు.

News March 25, 2024

గన్నవరం: జాతీయస్థాయి లాక్రోస్ పోటీలకు ఎంపికైన హరికుమార్

image

జాతీయ స్థాయి సీనియర్ లాక్రోస్ పోటీలకు గన్నవరం క్రీడాకారుడు హరికుమార్ ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి నాగరాజు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల29 నుంచి 31వ తేదీ వరకు ఆగ్రాలో జరుగనున్న జాతీయ స్థాయి సీనియర్ లాక్రోస్ పోటీలలో హరి పాల్గొనున్నట్లు చెప్పారు. అనంతరం హరి క్రీడలో ప్రతిభ కనపరిచి బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు.

News March 25, 2024

కర్నూలు: ఈ రోజు మగవాళ్లు అడవాళ్లు అవుతారు.. ఎక్కడో తెలుసా?

image

ఆదోని మండలం సంతేకుడ్లూరులో విచిత్ర ఆచారంతో హోలీ పండుగను జరుపుకుంటారు. 2 రోజుల పాటు సాగే ఈ వేడుకకు ఓ ప్రత్యేకత ఉంది. పురుషులంతా మహిళా వేషధారణలో రతీ మన్మధులను పూజిస్తారు. ఇలా పూజ చెయ్యటం వల్ల అంతా మంచి జరుగుతుందని వారి నమ్మకం. స్త్రీల మాదిరిగా పురుషులంతా చీరలు కట్టుకొని, ఆభరణాలను చక్కగా అలంకరించుకుంటారు. గ్రామం సుభిక్షంగా ఉండడానికి, పంటలు బాగా పండడానికి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని చెప్తున్నారు.

News March 25, 2024

విజయనగరం: పెళ్లి కార్డుపై ఆరు గ్యారంటీలు

image

టీడీపీ మీద ఉన్న అభిమానన్ని ఓ వ్యక్తి కొత్తగా పంచుకున్నారు. బలిజపేట మండలానికి బసన్నారాయువలస గ్రామానికి కృష్ణారావు వివాహం మార్చి 24 ఆదివారం జరిగింది. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల వివరాలను పెళ్లి కార్డుపై ముద్రించి బంధువులకు అందించారు. పథకాలతో పాటు చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ బొబ్బిలి, పార్వతీపురం తెదేపా అభ్యర్థుల చిత్రాలను ముద్రించారు. ప్రస్తుతం ఈ పత్రిక వైరల్‌గా మారింది.

News March 25, 2024

గుమ్మనూరు జయరామ్‌కు మూడో జాబితాలో మొండిచేయి

image

టీడీపీ అధిష్ఠానం ప్రకటించిన మూడో జాబితాలో గుమ్మనూరు జయరామ్‌కు చోటు దక్కలేదు. గుంతకల్లు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆయనకు ఐవీఆర్ఎస్ సర్వేలో అనుకూలత లేదని సీటు నిరాకరించినట్లు సమాచారం. ఇప్పటికే గుంతకల్లులో పార్టీ కార్యాలయం స్థాపించి గుమ్మనూరు సోదరులు ప్రచారాలు సైతం నిర్వహించారు. అయితే అక్కడి స్థానిక నేతల నుంచి వ్యతిరేకత, ఐవీఆర్ఎస్ సర్వేల ఆధారంగా గుమ్మనూరుకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.

News March 25, 2024

ఏర్పేడు : JRFకు దరఖాస్తులు ఆహ్వానం

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ/ జనరల్ కెమిస్ట్రీ/ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, గేట్, నెట్ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 10.

News March 25, 2024

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

image

1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.  2004లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత సొంత పార్టీ పరాజయాల అనంతరం బీజేపీలో చేరారు.

News March 25, 2024

ఏలూరులో ట్రావెల్స్ బస్సు- లారీ ఢీ

image

ఏలూరులోని రామచంద్ర కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం యాక్సిడెంట్ జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- లారీ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో స్థానిక ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!