Andhra Pradesh

News March 25, 2024

పలమనేరు: ఏడుగురు జూదరుల అరెస్ట్

image

పట్టణంలోని శ్రీనగరాకాలనీ సమీపంలో ఒక ప్రైవేటు ఐటిఐ సమీపంలో జూదమాడుతున్న ఏడుగురిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఆకస్మికంగా దాడి చేసి అరెస్టు చేశారు. వారిలో పట్టణానికి చెందిన హోంగార్డు మహేష్ ఉన్నారు. అతనితో పాటు పట్టణానికి చెందిన చిన్న, మురుగ, చందు ప్రకాష్, మధుకర్, మారిముత్తు, సామిదొరై, అరెస్టు చేసి వారి నుంచి రూ.5000, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.

News March 25, 2024

ఏప్రిల్ నెలాఖరులో నిసార్ ఉపగ్రహ ప్రయోగం

image

ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహ ప్రయోగం ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెలలోనే ఈ ప్రయోగం చేపట్టాల్సివుంది . అయితే ఉపగ్రహ రాడార్ యాంటెన్నా రిఫ్లెక్టర్ కు అదనపు పూత అవసరమని శాస్త్రవేత్తలు భావించడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఆ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రయోగం ఏప్రిల్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది.

News March 25, 2024

తాడిపత్రి: పెళ్లి రద్దు కావడంతో యువకుడి ఆత్మహత్య

image

తాడిపత్రి మండలంలోని గంగాదేవిపల్లికి నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగరాజు ఐచర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవల నంద్యాలలో పెళ్లి సంబంధం కుదిరింది. కొన్ని కారణాలతో ఆ సంబంధం ఆగిపోయింది. దీంతో యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై తెల్లవారుజామున ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.

News March 25, 2024

ఏడు రోజుల లక్ష్యం రూ.75.74 కోట్లు

image

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో ఏడు రోజుల్లో రూ.75.74 కోట్ల వసూలు లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది మొత్తం వసూళ్ల లక్ష్యం రూ.130.02 కోట్లు కాగా ఇప్పటికి రూ.54.,28 కోట్లు వసూలు చేశారు. పన్నులు చెల్లించాలని కోరుతూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు.

News March 25, 2024

ప్రత్తిపాడు: ప్రధాన పార్టీల్లో ముదిరిన వర్గపోరు

image

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలను వర్గపోరు వెంటాడుతోంది. ఇప్పటికే వైసీపీ రెబల్ అభ్యర్థిగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుకు వ్యతిరేకంగా పూనాటి రమేశ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయటంతో నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. వర్గపోరును తట్టుకొని ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.

News March 25, 2024

అవనిగడ్డ: జనసేన అభ్యర్థిపై వీడని టెన్షన్

image

జనసేన పార్టీ ప్రకటించాల్సిన పెండింగ్ స్థానాల్లో ఒకటైన అవనిగడ్డలో అభ్యర్థి ఎవరనే టెన్షన్ కొనసాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తుది పరిశీలనలో పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, కాంట్రాక్టర్ విక్కుర్తి శ్రీనివాస్ పేర్లు ఉన్నాయి. అయితే బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరిని అవనిగడ్డ MLA అభ్యర్థిగా బరిలో దింపి, MP అభ్యర్థిగా బండారు నరసింహారావును పోటీకి పెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

News March 25, 2024

చిత్తూరు: ఎన్నికల బరిలో మాజీ ముఖ్య మంత్రులు

image

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు పోటీలో ఉన్నారు. కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ సీఎం చంద్రబాబు (TDP) పోటీ చేస్తుండగా, రాజంపేట పార్లమెంట్ స్థానానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ (BJP) బరిలో ఉన్నారు. చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్, ప్రస్తుత MP మిథున్ (YCP)తో పోటీ పడటానికి ఎటువంటి వ్యూహాలు రచిస్తారు అనేది వేచి చూడాలి.

News March 25, 2024

విజయనగరం: ఎస్ కోటలో త్రిముఖ పోటీ తప్పదా?

image

ఎస్‌కోట నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. YCP ఎమ్మెల్యే అభ్యర్థిగా కడుబండి శ్రీనివాసరావు పోటీలో ఉండగా, TDP నుంచి కోళ్ల లలిత కుమారి బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే TDP నుండి టికెట్ ఆశించి భంగపడిన గొంపకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తూ అభిమానులు, నాయకులు ఆదేశిస్తే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆదివారం జరిగిన బహిరంగసభలో ప్రకటించడంతో ఎస్‌కోటలో త్రిముఖ పోటీ ఖాయమని స్థానికులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 25, 2024

శ్రీకాకుళం నుంచి ఆరుసార్లు గెలిచారు

image

ప్రస్తుత రాజకీయాల్లో హ్యాట్రిక్ కొట్టడమే గగనంగా మారిపోయింది. అలాంటిది శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి బొడ్డేపల్లి రాజగోపాలరావు 1952 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా కాంగ్రెస్ అభ్యర్థి పి.ఎల్.ఎన్.రాజును పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 1957-84 ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. ఆయనది ఆమదాలవలస మండలం అక్కులపేట.

News March 25, 2024

విశాఖలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు జంక్షన్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆటోను టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా,  కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చికిత్స నిమిత్తం క్షత్రగాత్రులను కేజీహెచ్‌కు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

error: Content is protected !!