India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనసేన పార్టీ ప్రకటించాల్సిన పెండింగ్ స్థానాల్లో ఒకటైన అవనిగడ్డలో అభ్యర్థి ఎవరనే టెన్షన్ కొనసాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తుది పరిశీలనలో పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, కాంట్రాక్టర్ విక్కుర్తి శ్రీనివాస్ పేర్లు ఉన్నాయి. అయితే బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరిని అవనిగడ్డ MLA అభ్యర్థిగా బరిలో దింపి, MP అభ్యర్థిగా బండారు నరసింహారావును పోటీకి పెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు పోటీలో ఉన్నారు. కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ సీఎం చంద్రబాబు (TDP) పోటీ చేస్తుండగా, రాజంపేట పార్లమెంట్ స్థానానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ (BJP) బరిలో ఉన్నారు. చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్, ప్రస్తుత MP మిథున్ (YCP)తో పోటీ పడటానికి ఎటువంటి వ్యూహాలు రచిస్తారు అనేది వేచి చూడాలి.
ఎస్‌కోట నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. YCP ఎమ్మెల్యే అభ్యర్థిగా కడుబండి శ్రీనివాసరావు పోటీలో ఉండగా, TDP నుంచి కోళ్ల లలిత కుమారి బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే TDP నుండి టికెట్ ఆశించి భంగపడిన గొంపకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తూ అభిమానులు, నాయకులు ఆదేశిస్తే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆదివారం జరిగిన బహిరంగసభలో ప్రకటించడంతో ఎస్‌కోటలో త్రిముఖ పోటీ ఖాయమని స్థానికులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
ప్రస్తుత రాజకీయాల్లో హ్యాట్రిక్ కొట్టడమే గగనంగా మారిపోయింది. అలాంటిది శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి బొడ్డేపల్లి రాజగోపాలరావు 1952 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా కాంగ్రెస్ అభ్యర్థి పి.ఎల్.ఎన్.రాజును పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 1957-84 ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. ఆయనది ఆమదాలవలస మండలం అక్కులపేట.
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు జంక్షన్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆటోను టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చికిత్స నిమిత్తం క్షత్రగాత్రులను కేజీహెచ్‌కు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
విద్యాహక్కుచట్టం-2009 ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లలో ఉచితంగా ప్రవేశం పొందటానికి ఆన్లైన్ దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈనెల 31 వరకు పొడిగించినట్లు డీఈవో శైలజ ఆదివారం తెలిపారు. అధిక సంఖ్యలో విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువును పొడిగించిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రమాదవశాత్తు రైలు కింద పడి పుత్తూరుకు చెందిన పురోహిత్ మూర్తి మృతి చెందిన ఘటన ఆదివారం చెన్నైలో జరిగింది. పుత్తూరులోని శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరాలయ ఆవరణలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ అర్చకుడు మూర్తి(58) ఆదివారం ఓ పూజ నిమిత్తం సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లారు. చెన్నై పరిధిలోని ఆంబూరు రైల్వేస్టేషన్లో రైలు దిగి కదులుతున్న మరో రైలు ఎక్కేక్రమంలో అదే రైలు కిందపడి మృతి చెందాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై వ్యక్తి బెదిరించి లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన కొప్పరపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. కొప్పరపాలెంలో ఓ వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన వల్లెపు నాగేశ్వరరావు కత్తితో బెదిరించి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ఎదురు తిరిగి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చేసరికి పారిపోయాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
కర్నూలుకు చెందిన లతీఫ్ అనే వ్యక్తిపై 2టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భార్యతో పాటు 8మంది ఆడ సంతానం కలిగిన ఇతను ఈనెల 1న 16 ఏళ్ల బాలికను నమ్మించి హైదరాబాద్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. దీంతో తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు విషయం తెలిసి ఈనెల 21న బాలికను తిరిగి కర్నూలుకు తీసుకువచ్చాడు.
కాకినాడ పట్టణ పోలీసులు ఆదివారం ఓ వ్యభిచార గృహంపై దాడిచేసి యువతి, నలుగురు వ్యక్తులతో పాటు నిర్వాహకులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జె.రామారావుపేటలోని జెండాసెంటర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. విటులు, ఓ యువతి, నిర్వాహకులను అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రూ.6,735 నగదు, 7 ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.