Andhra Pradesh

News March 24, 2024

రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

image

రాజంపేట పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అదిష్టానం ప్రకటించింది. తాజాగా దేశవ్యాప్తంగా వెలువడిన బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో రాజంపేట అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రకటిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన విజయం కోసం మూడు పార్టీల నేతలు పనిచేయాలన్నారు.

News March 24, 2024

విశాఖ: ‘ఒక రివాల్వర్, పిస్టల్ స్వాధీనం’

image

విశాఖ నగరం రామ టాకీస్ సమీపంలో ట్రావెల్ కార్యాలయంలో ఒక పిస్టల్, ఒక రివాల్వర్, రెండు బుల్లెట్స్‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. శివాజీపాలెంకు చెందిన వి.శివనాగరాజు వీటిని దాచి ఉంచడంతో అతనిని అరెస్టు చేశామన్నారు. వీటిని వదిలి పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు.

News March 24, 2024

NDA కూటమిలో కొలిక్కిరాని విజయవాడ పశ్చిమ పంచాయితీ

image

విజయవాడ పశ్చిమ నుంచి పోటీచేసే NDA కూటమి అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. జనసేన నేత మహేష్‌కు ఇవ్వాలని JSP క్యాడర్ బలంగా కోరుతుండగా, పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో గత కొద్దిరోజులుగా విజయవాడ నగరంలో మహేష్ అనుచరులు తమ విజ్ఞప్తిని పరిశీలించాలని జనసేన అధిష్ఠానానికి పలు రీతుల్లో నిరసన తెలుపుతున్నారు.

News March 24, 2024

విజయనగరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

బొండపల్లి మండలంలోని గ్రహపతి అగ్రహారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు బొండపల్లి ఎస్.ఐ కె.లక్ష్మణరావు ఆదివారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. గ్రామానికి చెందిన నమ్మి గౌరి నాయుడు బహిర్భూమికి రోడ్డుపై రాగా రెల్లిపేటకు చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తూ ఢీకొట్టాడు. 108 వాహనం వచ్చేసరికి గౌరినాయుడు మృతి చెందినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News March 24, 2024

గుడ్లూరు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

image

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుడ్లూరులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడ్లూరు మండలం నర్సాపురం గ్రామంలో పళ్లెం రాజేష్ అనే వ్యక్తి తెల్లవారుజామున గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు పక్కనున్న ట్రాన్స్‌ఫార్మర్ తీగలు తగులుకొని రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 24, 2024

విశాఖ: ‘డాక్యుమెంట్లు లేని రూ.2లక్షలు స్వాధీనం’

image

నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విజయ్ కుమార్ తెలిపారు. గాజువాక కణిత రోడ్‌కు చెందిన గంగుమల్ల ప్రమోద్ పాయకరావుపేట నుంచి యలమంచిలి వైపు ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా నగదు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. 

News March 24, 2024

YSRTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజేశ్ కుమార్

image

వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడూరుకు చెందిన మండ్ల రాజేశ్ కుమార్ నియమితులయ్యారు. ఆదివారం వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఆ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పీ.గౌతంరెడ్డిని సన్మానించారు. అనంతరం రాజేశ్ కుమార్‌కు నియామక పత్రం అందించారు. వైసీపీ ట్రేడ్ యూనియన్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

News March 24, 2024

విజయనగరం: ఆ రెండు స్థానాల్లో వీడని ఉత్కంఠ..!

image

విజయనగరం ఎంపీ, చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత ఎంపీ టికెట్ బీజేపీకి వెళ్తుందనే ప్రచారం సాగింది. తాజాగా విజయనగరం సీటు టీడీపీకి కేటాయిస్తారని వార్తలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఒకరైన మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఇప్పటికే చంద్రబాబు వద్దకు వెళ్లినట్లు సమాచారం.

News March 24, 2024

ఎమ్మిగనూరులో 29న సీఎం జగన్ ‘మేము సిద్ధం’ సభ

image

ఎమ్మిగనూరులో ఈనెల 29న సీఎం జగన్ పర్యటిస్తున్నట్లు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, MLC మధుసూదన్, కర్నూలు ఎంపీ అభ్యర్థి రామయ్య, ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టా రేణుక తెలిపారు. YWCS గ్రౌండ్‌లో సాయంత్రం మేము సిద్ధం భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

News March 24, 2024

ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు పాటించాలి:కలెక్టర్

image

సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలక్టరేట్‌లో ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కో ఆర్డినేషన్ సెక్షన్, లీగల్ సెల్, మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ విభాగం, సువిధ పోర్టల్ విభాగాన్ని అందుబాటులో ఉంచారు. జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం పరిశీలించి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల విధులు గురించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

error: Content is protected !!