India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నవ యువతరం ఫౌండేషన్ సేవాసంస్థ అధినేత, ఫౌండర్ చిగుళ్ల సుమలతను పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అభినందించారు. సేవా సంస్థ ద్వారా సమాజానికి అందించిన సేవలకు, వివిధ రంగాలలో కనపరిచిన ప్రతిభను చూసి ఆమెకు ఉమెన్స్ వరల్డ్ రికార్డ్సు అండ్ అవార్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉత్తరప్రదేశ్ ఉమెన్ ఐకాన్-2024 అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మెరుగైన సేవలు ఇంకా సమాజానికి అందించాలని కలెక్టర్ అన్నారు.
నెల్లూరు పట్టణం వీఆర్‌సీ మైదానంలో హోలీ పండుగ సంబరాలు జరిగాయి. పట్టణంలోని యువతీ యువకులు రంగులు చల్లుకుని ఉత్సాహంగా డాన్స్‌లు వేశారు. నీటి పైపుల ద్వారా నీటిని ఆకాశంలోకి వర్షంలా వెదజల్లి డాన్స్ లు చేశారు. యువత కేరింతలతో మైదానం దద్దరిల్లింది. మంచి నీటి ఏర్పాటు, రంగుల ఏర్పాట్లు ముందుగా సిద్ధం చేసుకొని హోలీ జరుపుకున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజయ కృష్ణ రంగారావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మతో పాటు మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పవన్‌తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను ఘనంగా సత్కరించి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామానికి చెందిన దొప్పలపూడి రాజేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. దొప్పలపూడి రాజేష్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తన మృతికి ఐదుగురు వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోటు రాసి మరణించాడు.
బత్తలపల్లి మండలం కోడకండ్లకు చెందిన పూర్ణ వర్ధిని(17) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్ణ వర్ధిని మదనపల్లి MJR పాలిటెక్నిక్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. 3 నెలల క్రితం ఆరోగ్యం సరిగా లేదని చెప్పి కాలేజీ నుంచి ఇంటికి వచ్చి చికిత్స పొందుతోంది.
పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన షేక్ మహమ్మద్ ఆలీని రాష్ట్ర వైసీపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి మహమ్మద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
జిల్లాలోని పోలీసు అధికారులందరూ ఎన్నికల సంఘం నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆయన ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చెక్పోస్టుల్లో నగదు, అక్రమ మద్యం, గంజాయి రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు.
జిల్లాలోని బి.మఠం మండలం గుండాపురానికి చెందిన వ్యక్తి కువైట్‌లో మరణించాడు. గుండాపురానికి చెందిన బిజివేముల రామచంద్రారెడ్డి(47) బతుకు తెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. కాగా గతనెల 16న భవన నిర్మాణ పనిచేస్తూ ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ ఈనెల 21న మరణించాడు. ఆదివారం తన స్వగ్రామానికి బంధుమిత్రుల సహాయంతో మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. వర్మను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ నాయకులు సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జూన్ నెల రూ.300 ప్రత్యేక దర్శన కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు.
Sorry, no posts matched your criteria.