India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
30న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుత్తికి రానున్నట్లు వైసీపీ గుత్తి పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా ఆదివారం తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి 30వ తేదీన గుత్తికి రానున్నారు. గుత్తిలో బస్సు యాత్ర ముగిసిన తర్వాత కడప జిల్లా పులివెందులకు తరలి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా తాంబరం (తమిళనాడు), సత్రాగచ్చి (పశ్చిమ బెంగాల్) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 26, ఏప్రిల్ 2వ తేదీల్లో తాంబరం- సత్రాగచ్చి (నెం.06079), ఈ నెల 27, ఏప్రిల్ 3వ తేదీన సత్రాగచ్చి- తాంబరం (నెం.06080) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, విజయనగరం, ఒంగోలుతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని స్పష్టం చేశారు.
కుటుంబ కలహాల కారణంగా కుమారుడితో కలిసి రైలు కింద పడబోయిన మహిళను రైల్వే పోలీసులు కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా తునిలోని ఓ కాలనీకి చెందిన మహిళ.. తన 4ఏళ్ల కుమారుడిని తీసుకెళ్లి రైలు పట్టాలపై నిలబడింది. కానిస్టేబుల్స్ శ్రీనివాస్, మోహనరావు గమనించి వారిని రక్షించారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి.. భర్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఇంటికి పంపినట్లు ఎస్సై తెలిపారు.
నరసన్నపేటలో పోటీ చేసిన, విజయం సాధించిన ఏకైక మహిళగా బి.సరోజమ్మ నిలిచారు. ఈవిడ 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి సిమ్మ జగన్నాదంపై 2,454 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. కాగా ఇప్పటివరకు నరసన్నపేట నియోజకవర్గంలో జరిగిన 16 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక మహిళ ఈవిడే కావడం విశేషం.
నంద్యాలకు చెందిన రాజశేఖర్ శర్మ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడప జిల్లాలో రెండు చేతులు బ్లేడుతో కోసుకుని శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇతను గోనెగండ్లలో పని చేసేవారు. ఇటీవల ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. మనస్తాపానికి గురైన ఆయన ఇంటికి వెళ్లకుండా ప్రొద్దుటూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో అద్దెకు దిగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ ను గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
భారత్, అమెరికా దేశాల సైనిక సంబంధాలు
బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో
విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్ ట్రయంప్’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరొందిన ‘యూఎస్ సోమర్సెట్’ విశాఖ
తీరానికి చేరుకుంది. ఇది ఉభయచర
యుద్ధ నౌకగా ఖ్యాతిగాంచింది.
చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో ఏప్రిల్ 2 నుంచి శ్రీ ముత్యాలమ్మ జాతర జరగనుంది. మొదటి రోజు శ్రీపోలేరమ్మ నిలుపు అనంతరం ఉదయం 5 గంటలకు అమ్మవారికి దిష్టి తీసిన తర్వాత బంగారు చీరతో అలంకరిస్తారు. ఆ రోజు రాత్రి సింహవాహన సేవ జరుగుతుంది. 3న యార, గొల్లల ఉత్సవం 4న గురునాథ స్వామి గ్రామోత్సవం నిర్వహిస్తారు. 5 పోలేరమ్మను సాగనంపుతారు. లక్షల మంది భక్తుల రాక నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లే కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తం ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల లోపు వారే దాదాపు 50 శాతంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 20 నుంచి 29 ఏళ్ల లోపు వాళ్లు 6,90,703 మంది ఉండగా 30 నుంచి 39 ఏళ్ల వాళ్లు 9,63,220 మంది ఉన్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నాయకుల భవితను నిర్ణయించేందుకు వీళ్లు సిద్ధంగా ఉన్నారు.
ఉమ్మడి ప.గో జిల్లాలోని 15 నియోజకవర్గాల అభ్యర్థులెవరో తేలింది. ఇక ప్రచారపర్వం ఊపందుకోనుంది. అయితే.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈసారి ఏలూరు స్థానంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ బరిలో ఉండగా.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌కు TDP టికెట్ ఇచ్చింది. వీరిద్దరిదీ బీసీ సామాజికవర్గమే. మరి వీరిలో ఎవరూ సత్తా చాటేనో చూడాలి.
నరసన్నపేట నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే అత్యధికంగా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ , TDP అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై 19,025 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం 2024 ఎన్నికల బరిలో కూడా YCP, TDP నుంచి వీరే ప్రత్యర్థులుగా ఉన్నారు. మరి ఈసారైనా TDPని విజయం వరిస్తుందా..లేదా..2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ కానున్నాయా? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.