Andhra Pradesh

News March 23, 2024

అనంతపురం జిల్లా వ్యాప్తంగా రిటర్నింగ్ అధికారుల నియామకం

image

అనంతపురం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గౌతమి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి అనంతపురం అర్బన్‌కి వెంకటేష్, రాప్తాడుకి వసంతబాబు, ఉరవకొండకి కేతన్ గార్గ్, రాయదుర్గానికి కరుణకుమారి, శింగనమలకి వెన్నెల శ్రీను, తాడిపత్రికి రాంభూపాల్ రెడ్డి, కళ్యాణదుర్గంకి రాణి సుష్మిత, గుంతకల్లుకి శ్రీనివాసులు రెడ్డిలను నియమించారు.

News March 23, 2024

ఆదోని సబ్ కలెక్టర్ వాహనాన్ని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

image

అదోని మండలం విరూపాపురం గ్రామానికి చెందిన పింజరి కాశీం అనే వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గత నెల 26వ ఆదోని సబ్ కలెక్టర్ శివ నారాయణశర్మ వాహనాన్ని కాశీం బైక్ వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

News March 23, 2024

వేసవిలో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి: కడప కలెక్టర్

image

వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టామని కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. విజయవాడ నుంచి చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనుల లేబర్ కాంపోనెంట్ పెంపుతో పాటు, కూలీలకు కొరత లేకుండా తాగునీటి సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News March 23, 2024

కురుపాం: సరిహద్దులో నిరంతరం పటిష్ఠ నిఘా: కలెక్టర్

image

రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతర పటిష్ఠ నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. శనివారం కురుపాం మండలం మంత్ర జోల సమీపంలోని మూలిగూడ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎన్ని కేసులు, వాహనాలు సీజ్ చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News March 23, 2024

విశాఖ: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

image

నగర పరిధిలోని చినగదిలి వద్ద గల ఈవీఎం గోదాములను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున శనివారం తనిఖీ చేశారు. ప్రతి మూడు మాసాలకు చేసే తనిఖీలో భాగంగా గోదాములను సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. వివిధ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదాముల లోపల గల వీవీ ప్యాట్లను, ఇతర సామగ్రిని స్వయంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును గమనించిన ఆయన సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

News March 23, 2024

నేను గెలవగానే కేసులు ఎత్తివేయిస్తా: పులపర్తి

image

వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో భీమవరం నియోజవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గెలవగానే జన సైనికుల మీద మత్స్యపురి అల్లర్లలో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ కొటికలపూడి గోవిందరావు, జడ్పిటిసి గూండా జయప్రకాశ్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

News March 23, 2024

తిరుపతి ఐఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్

image

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2024 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ విభాగాల్లో ఎంటెక్(M.Tech), మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ(MPP) కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 19.

News March 23, 2024

పులివర్తి నాని కారుకు ప్రమాదం

image

చంద్రబాబు ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్తున్న టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కారు ప్రమాదానికి గురైంది. గుంటూరు వద్ద కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులివర్తి నానితో పాటు కారులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఏమి కాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

News March 23, 2024

మార్కాపురం: 7 మంది వాలంటీర్లు రాజీనామా

image

మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయలలో పనిచేసే 7 మంది వాలంటీర్లు శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు మేరకు 2024లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కి అందచేశారు.

News March 23, 2024

సోషల్ మీడియా ట్రోలింగ్స్‌పై నిఘా: ఎస్పీ రాధిక 

image

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్స్, తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జి.ఆర్ రాధిక హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన జారీ చేశారు. అలాంటి వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచామని, అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

error: Content is protected !!