India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బేతంచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన గోరంట్ల మహేశ్ అనే యువకుడు గురువారం పెళ్లి చేసుకుంటానని కిడ్నాప్ చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివ శంకర్ నాయక్ తెలిపారు. గోరంట్ల మహేశ్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18 చెక్ పోస్టులను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. నగదు, మద్యంతో పాటు ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ఈ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆయా చెక్ పోస్టుల్లో తనిఖీల పర్వం ప్రారంభమైంది.
మార్చి 25 తేది సోమవారం పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వరస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉదయం 5 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణ సేవాసమితి అధ్యక్షులు అనుమోలు వెంకటచౌదరి మాట్లాడుతూ.. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఘాట్ రోడ్డు వద్ద విజయ గణపతి దేవాలయం వద్ద అల్పాహారం, మార్గమధ్యంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశామన్నారు.
అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి 10 వరకు పది స్పాట్ ప్రారంభం కానుంది. నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాటు సిద్ధం చేస్తోంది. అప్పుడే జవాబు పత్రాలు రావడం ప్రారంభ మయ్యాయి. ఇవన్నీ స్ట్రాంగ్ రూములో భద్రపరుస్తున్నారు. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. జవాబు పత్రాలు దిద్దేందుకు ఒక్కో పేపర్‌కు ₹6.60 నుంచి ₹10కి పెంచారు.
ప.గో జిల్లా వ్యాప్తంగా 127 కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్షకు 96శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఆర్.వెంకటరమణ తెలిపారు. 21,527 మంది విద్యార్థులకు 20,734 మంది హాజరయ్యారన్నారు. ఎస్‌ఎస్‌సీ (ఏపీఓఎస్‌ఎస్) పరీక్షకు 830 మందికి 729 మంది.. ఇంటర్ (ఏపీఓఎస్‌ఎస్) పరీక్షకు 810 మందికి 738 మంది హాజరయ్యారని తెలిపారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అన్నారు.
నెల్లూరు జిల్లాలోని ప్రధాన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ 8 రోజులుగా ఈసీలు మంజూరు కావడం లేదు. ఈసీ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసే క్రమంలో సర్టిఫికెట్లు ఇవ్వడం నిలిపివేశారు. ఈ మేరకు సంబంధింత అధికారులు శుక్రవారం వెల్లడించారు.
…
.
అనంతపురం JNTU బీఫార్మసీ ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఎవాల్యుయేషన్ కేశవరెడ్డి, సీఈ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరిలో బీఫార్మసీ తృతీయ సంవత్సరం ప్రథమ సెమిస్టర్ (ఆర్19)రెగ్యులర్, సప్లమెంటరీతో పాటు(ఆర్15) సప్లమెంటరీ పరీక్షలు జరిగాయన్నారు. అదేవిధంగా ద్వితీయ సెమిస్టర్(ఆర్19,15) సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయన్నారు. విద్యార్థులు ఆ ఫలితాల కోసం www.jntua.ac.in వెబ్‌సైట్ సంప్రదించాలన్నారు.
కడపలో ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. కమలాపురంలో వరుసగా 4 సార్లు ఓడిపోయిన నరసింహారెడ్డిని కాదని తనయుడు చైతన్యరెడ్డికి టికెట్ ఇచ్చింది. అటు వైసీపీలో రెండు సార్లు గెలిచిన రవీంద్రనాథ్ రెడ్డే మరోసారి బరిలో నిలుస్తూ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. మరి తండ్రి గెలవలేకపోయిన చోట తనయుడు గెలిచి చరిత్ర సృస్టిస్తారని అనుకుంటున్నారా.?
ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. పాలకోడేరు ఎస్‌ఐ నాళం శ్రీనివాసరావు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఈ నెల 20న పాలకోడేరు మండలంలో శివరామరాజు సుమారు 30 వాహనాలతో ఊరేగింపు నిర్వహించారని, అందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని ఎస్సై తెలిపారు. దీనిపై ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన సమాచారం మేరకు పాలకోడేరు తహశీల్దార్ నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడి కల్ కళాశాలలో జరగనున్న జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంపికైన సాయి చైతన్య, హర్షిత, కె.హితలను ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, కోచ్‌లు అనిల్ కుమార్ శర్మ, సతీష్ కుమార్, పి.అప్పలరాజు అభినందించారు.
Sorry, no posts matched your criteria.