India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు 1972లో కాంగ్రెస్, 1983, 85లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కృష్ణప్రసాద్ 2019(మైలవరం)లో వైసీపీ తరఫున గెలిచారు. తాజాగా ఆయన టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వసంత మరోసారి గెలిస్తే రెండు వేర్వేరు పార్టీల తరఫున విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన తండ్రీకుమారులుగా రికార్డెలకెక్కనున్నారు.
గుండెపోటుతో బొబ్బిలిలో హోం గార్డు కెంగువ మహేష్ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మూడురోజులు క్రితం తమ్ముడు రామారావు మృతి చెందడంతో ఒత్తిడికి గురై తీవ్ర అస్వస్థత గురయ్యారు. కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా.. మూడు రోజులు వ్యవధిలో అన్నదమ్ములు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ గండి బాబ్జి భేటీ అయ్యారు. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తానని బాబ్జికి లోకేశ్ హామీ ఇచ్చారు. దీంతో పార్టీకి చేసిన రాజీనామాను బాబ్జి వెనక్కి తీసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానన్నారు.
గోనెగండ్లలోని లక్ష్మీపేటలో జరిగే ఒక పెళ్లికి ఎమ్మిగనూరు మండలం మల్కాపురానికి చెందిన ఎల్లారెడ్డి కుటుంబంతో పాటు వారి కుమారుడు అరుణ్ కుమార్(6) వచ్చాడు. పెళ్లి సందడిలో ఉండగా అరుణ్ కుమార్ కొంతమంది పిల్లలతో కలిసి సమీపంలోని ఎల్‌ఎల్‌సీ కాలువలో ఈతకు వెళ్లాడు. ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. స్థానికులు బాలుడిని వెలికితీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు సోదరుడు వెంకట కృష్ణారావు మృతి చెందాడు. చీమకుర్తి మండలంలోని రామతీర్థం పుణ్య క్షేత్రంలోని ఆర్యవైశ్య సత్రం వద్ద ఉన్న బావిలో వెంకట కృష్ణారావు మృతదేహం లభ్యమైంది. అతనిది ఆత్మహత్యా, బావిలో కాలు జారిపడ్డాడా అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని సొంత గ్రామమైన చీమకుర్తికి తీసుకువచ్చారు.
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొన్న ఐదుగురు వాలంటీర్లపై వేటు పడింది. రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొన్న గరివిడి మండలం చుక్కవలసకు చెందిన
వాలంటీరు దబ్బాక వెంకటలక్ష్మిని తొలగించారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విజయనగరంలో అద్దేపల్లివారి వీధికి చెందిన గురజాపు చంద్రశేఖర్, గంగి మురళి, కుప్ప గురుమూర్తి, బసవ రాజుపై కూడా వేటుపడింది.
తాడిపత్రిలోని 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ప్రేమించి మోసం చేశాడని ఆరోపించిన అనూషపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణ పేర్కొన్నారు. కౌన్సిలర్ మల్లికార్జున తల్లి సావిత్రి, చెల్లెలు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపి అనూషపై 18న సీఐ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
విజయవాడలో శుక్రవారం భారీగా నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద రెండు కేజీల బంగారం, కిలోన్నర వెండి, కోటిన్నర నగదు పట్టుబడింది.ఎన్నికల నిబంధన మేరకు ఒక మనిషి రూ.50,000 మాత్రమే తీసుకొని వెళ్లాల్సి ఉంది. ఇది నగరంలోని ఓ బంగారు షాపుకు చెందినదిగా భావిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో పోలీసులు వెల్లడించనున్నారు.
కదిరి మండలం కాళసముద్రంలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు అనంతపురం డిపోకు చెందినదిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. మొత్తం 29,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,358 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 1036 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.