Andhra Pradesh

News March 22, 2024

కర్నూలు: హత్యాయత్నం కేసులో..ఐదేళ్ల జైలు

image

రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురానికి చెందిన దండు గోపాలకృష్ణ అనే వ్యక్తికి హత్యాయత్నం కేసులో 5ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా కోర్టు విధించినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. 2017లో అదే గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తిపై డబ్బుల విషయంలో హత్యాయత్నానికి పాల్పడడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. కేసు విచారణ అనంతరం జడ్జి జైలు శిక్ష జరిమాన విధిస్తూ తీర్పనిచ్చారు

News March 22, 2024

అనంత: దోపిడి ముఠాను అరెస్ట్

image

అనంతపురంలోని రిలయన్స్ మార్ట్‌లో దోపిడీ చేసేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపిన మేరకు.. గుజ్జల రుస్యింగులు, రాగిరి శ్రీనివాసులు, గొల్ల చంటి పట్టణంలోని రిలయన్స్ మార్ట్‌తో పాటు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వర్తకుడు ఇంట్లో చోరీ చేయాలని కుట్ర పన్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు.

News March 22, 2024

VZM: భార్యపై కత్తితో దాడిచేసిన భర్త

image

భర్త భార్యను హతమార్చిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
జియ్యమ్మవలస మండలం సింగనాపురం గ్రామానికి చెందిన గంటా ముసలి నాయుడు భార్య అప్పలనరసమ్మపై కత్తితో దాడిచేయగా, ఆమె కడుపులో కత్తి దిగింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. ముసలి నాయుడు పరారిలో ఉండడంతో కేసు నమోదుచేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

News March 22, 2024

చింతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగ్గయ్యపేట వాసి మృతి

image

చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారకొండ నుంచి నర్సీపట్నం వైపు వెళుతున్న ఓ లారీ లంబసింగి ఘాట్‌లో తులబాడగెడ్డ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో జగ్గయ్యపేటకు చెందిన డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన క్లీనర్‌ను డౌనూరు పీహెచ్‌సీకి తరలించామని చెప్పారు.

News March 22, 2024

27న పలమనేరులో చంద్రబాబు ప్రచారం

image

మాజీ సీఎం చంద్రబాబు
ఈనెల 27 నుంచి 31 వరకు రోడ్ షోలు నిర్వహించనున్నారు. సంబంధత పర్యటన వివరాలను టీడీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈనెల 27న పలమనేరు, నగరి, మదనపల్లెలో ఎన్నికల ప్రచారం చేస్తారు. 28న అనంతపురం, శ్రీసత్యసాయి, 29న కర్నూలు, నంద్యాల, 30న కడప, తిరుపతిలో, 31న నెల్లూరు, ఒంగోలులో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News March 22, 2024

ప్రకాశం: పెండింగ్‌లో రెండు సీట్లు

image

ఇవాళ టీడీపీ మూడో జాబితాలో చీరాల టికెట్‌ను కొండయ్యకు కేటాయించింది. ఇక దర్శి ఎమ్మెల్యే, ఒంగోలు ఎంపీ స్థానాలు పెండింగ్‌లో ఉంచాయి. దర్శి టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గరికపాటి వెంకట్‌కు కేటాయిస్తారని వార్తా కథనాలు వెలువడ్డాయి. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డికి టీడీపీ నుంచి ఇస్తారని టాక్.

News March 22, 2024

విశాఖ: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఒక వ్యక్తి గురువారం అర్ధరాత్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ ప్రాంతానికి చెందిన ఆర్.ఎస్.నాయుడు బాబు విశాఖ పోర్ట్ అథారిటీలో దినసరి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. జీతం సరిపోక కుటుంబ పోషణ కష్టమవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. చేసిన అప్పులు తీర్చమని ఒత్తిళ్లు పెరగడంతో గురువారం అర్ధరాత్రి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 22, 2024

పాలకొల్లులో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడి హౌస్‌అరెస్ట్

image

అంబేడ్కర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ పెనుగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన 20 మంది దళిత యువకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరే క్రమంలో శుక్రవారం పాలకొల్లులోని ఆయన ఇంటికి యలమంచిలి సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వెళ్లి హౌస్ అరెస్టు చేశారు.

News March 22, 2024

KNL: బైరెడ్డి శబరి రాజకీయ ప్రస్థానం ఇదే

image

ఉమ్మడి కర్నూలు రాజకీయాల్లో బైరెడ్డి కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా నంద్యాల TDP MP అభ్యర్థిగా బైరెడ్డి శబరి ఖరారయ్యారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆమె నందికొట్కూరు మాజీ MLA బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె. మరోవైపు మాజీ మంత్రి బైరెడ్డి శేష శయనారెడ్డి, మాజీ MLA నరసింహరెడ్డికి మనవరాలు. కాగా ఆమె ఇటీవలే BJPకి గుడ్ బై చెప్పి, TDP చీఫ్ చంద్రబాబు సమక్షంలో TDPలో చేరారు.

News March 22, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఆ రెండు నియోజకవర్గాలపై వీడని ఉత్కంఠ

image

టీడీపీ మూడు జాబితాల్లో గొండు శంకర్-శ్రీకాకుళం, కింజారపు అచ్చెన్నాయుడు-టెక్కలి, బెందాళం అశోక్ కుమార్-ఇచ్ఛాపురం, కూన రవికుమార్-ఆమదాలవలస, బగ్గు రమణమూర్తి-నరసస్నపేట, కొండ్రు మురళీ మోహన్- రాజాం, పలాస-గౌతు శిరీషాను ఖరారు చేసింది. అయితే పాతపట్నం నుంచి మాజీ ఎమ్మెల్యే కలమట, మామిడి గోవింద రావుకు మధ్య పోటీ జరగగా గోవింద వైపు అధిష్ఠానం మొగ్గు చూపింది. ఎచ్చెర్ల, పాలకొండ అభ్యర్థులు ఎవరో తెలియాల్సి ఉంది.

error: Content is protected !!