India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రొద్దుటూరులో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీటెక్ సీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నవ్య అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్ కు గురువారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి చెందిన నవ్య ఇక్కడ చదువుతోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.
టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అనంతపురం ఎంపీ సీట్లు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ టీడీపీ నాయకులలో నెలకొంది. హిందూపురం అభ్యర్థిగా బీకే పార్థసారథి, అనంతపురం అభ్యర్థిగా జేసీ పవన్ కుమార్ రెడ్డి పేర్లు ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధికారిక ప్రకటనలో వారి పేర్లు ఉంటాయా..? లేదా ఎవరికి ఇచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి.
ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక పోలింగ్ కేంద్రంలో పూర్తిగా విభిన్న ప్రతిభావంతులనే నియమించాలని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఉన్నాయని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులైన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల విధులు కేటాయిస్తామన్నారు. ఉద్యోగుల వివరాలు ఎన్ఐసీ పోర్టల్లో నమోదు చేసిన అనంతరం అధికారులు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు.
జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను మే 16 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు సెట్ ఛైర్మన్, ఉప కులపతి జీవీఆర్ ప్రసాద్ రాజు గురువారం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాత షెడ్యూల్ ను సవరించినట్లు పేర్కొన్నారు. సెట్ కు సంబంధించి సందేహాలు ఉంటే 0884 2359599, 0884 2342499 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను https://vizianagaram.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ఐసీడీఎస్ పీడీ బి. శాంతకుమారి తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే శుక్రవారం సాయంత్రంలోగా లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలో 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా TDP ఆరుసార్లు గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ధర్మానప్రసాద్ రావు.. టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై విజయం సాధించారు. ఈసారి YCP తరఫున ధర్మానకే టిక్కెట్ ప్రకటించారు. పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. ఉమ్మడి అభ్యర్థిగా ఎవరుంటే ధర్మానకు పోటీగా నిలిస్తారని మీరు భావిస్తున్నారు?
అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 703 లైసెన్స్ హోల్డర్లు ఉండగా, 654 లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేయించామని ఎస్పీ అన్బురాజన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. లైసెన్స్ ఉన్నప్పటికీ ఎన్నికలు ప్రక్రియ ముగిసే వరకు ఆయుధాలు పోలీస్ శాఖ వద్ద డిపాజిట్ చేయాలని సూచించారు.
మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. కామన్ వెరైటీ సగటు ధర రూ.500, స్పెషల్ వెరైటీ సగటు ధర రూ.1,000 మేరకు పెరిగింది. రైతులు గురువారం 1,06,381 బస్తాలు యార్డుకు తరలించారు. 1,04,332 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 81,360 బస్తాలు నిల్వ ఉన్నాయి. నాన్ ఏసీ కామన్ వెరైటీలో 334, 273రకాల ధరలు పెరిగాయని అధికారులు తెలిపారు.
అనంతపురం జిల్లాలో పాఠశాల, జూనియర్ కళాశాల విద్యా ప్రిన్సిపల్
సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఈ నెల 23వ తేదీన పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం పంపించారు. జిల్లాలోని పలు పాఠశాలలను ఆయన తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై ఆయన అక్కడికక్కడే చర్యలు తీసుకొంటామన్నారు.
కర్నూలు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని ఎన్నికల అధికారి, కలెక్టర్ సృజన తెలిపారు. కోడ్ వచ్చినప్పటి నుంచి 20వ తేదీ వరకు పబ్లిక్ ప్రాపర్టీస్ మీద ఉన్న 15,115, ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఉన్న 5,649 గోడ రాతలు, పోస్టర్లు, బ్యానర్లు, తదితరాలను తొలగించామన్నారు. కోడ్ ఉల్లంఘించిన 12మంది వాలంటీర్లను ఉద్యోగం నుంచి తొలగించామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
Sorry, no posts matched your criteria.