Andhra Pradesh

News March 21, 2024

గుంటూరులో విషాదం.. లిఫ్ట్ గుంతలో పడి చిన్నారి మృతి

image

గుంటూరు రూరల్ మండలం పెద్దపలకలూరు గ్రామపంచాయతీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ కోసం తీసిన గుంతలో పడి చిన్నారి మృతిచెందింది. ఓ ప్రైవేట్ కాలేజీ సమీపంలోని అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ఆరేళ్ల కుమార్తె గుంతలో పడి చనిపోగా, నల్లపాడు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న వారు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబానిది పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఓ గ్రామం. 

News March 21, 2024

కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డికి నోటీసులు

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్.మాధవిరెడ్డికి గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కడప రెవెన్యూ డివిజన్ అధికారి & రిటర్నింగ్ అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. బుధవారం మాధవిరెడ్డి సోషల్ మీడియాలో ఎంసీసీని ఉల్లంఘిస్తూ అభ్యంతరకరమైన పోస్టును విడుదల చేయడంపై షోకాజ్ నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు.

News March 21, 2024

కాకినాడ: భానుగుడి సెంటర్లో వ్యభిచారం

image

కాకినాడ భానుగుడి సెంటర్లో కోటగిరి సిటీ కాంప్లెక్స్‌లోని ఈసా స్పా సెంటర్లో బాడీ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని కాకినాడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కత్తాకు చెందిన ఒక మహిళతో పాటు ఇద్దరు విటులను, ఇద్దరు స్పా సెంటర్ నిర్వాహకులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. వారిని కోర్టుకు తరలించగా 14 రోజులు రిమాండ్ విధించారని టౌన్ సీఐ నాయక్ తెలిపారు.

News March 21, 2024

YVU కాన్వకేషన్ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

image

కడప: యోగి వేమన విశ్వవిద్యాలయం ఏప్రిల్ మాసంలో జరప తలపెట్టిన స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పి.హెచ్.డి పట్టాలు పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు పొడిగిస్తూ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు గడువు పొడిగిస్తున్నట్లు వీసీ వెల్లడించారు. ఇప్పటిదాకా వివిధ డిగ్రీల పట్టాల కోసం 8,898 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

News March 21, 2024

కోటబొమ్మాళి: విశ్వనాథపురం కొండ సమీపంలో అస్థిపంజరం

image

కోటబొమ్మాళి మండలం విశ్వనాధపురం గ్రామంలోని ఓ కొండ సమీపంలో గురువారం గుర్తుతెలియని అస్థిపంజరం గ్రామస్థుల కంటపడింది. దీంతో గ్రామస్థులు స్థానిక వీఆర్వో పైల దాలప్పకు సమాచారం ఇవ్వటంతో ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దీంతో గ్రామస్థులు భయాందోళనలు గురయ్యారు.

News March 21, 2024

తాడిపత్రిలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

image

తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని జయనగర్ కాలనీకి చెందిన రమాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు వెంటనే తాడిపత్రి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 21, 2024

తవణంపల్లి: డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి

image

బైక్ డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన తవణంపల్లిలో చోటుచేసుకుంది.  SI సుధాకర్ రెడ్డి వివరాల మేరకు.. చిత్తూరులోని కట్టమంచి కంది కాలమ్మ గుడి వీధికి చెందిన రామన్ (60) బైక్‌‌పై వెళ్తుండగా కె. పట్నం ఫ్లైఓవర్ వద్ద అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొని తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. అతని భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.

News March 21, 2024

రాజమండ్రి: 23 మంది వాలంటీర్లు సస్పెన్షన్

image

రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో మార్గదర్శకాలు ఉల్లంఘించిన 23 మంది వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు రాజమండ్రి అర్బన్ రిటర్నింగ్ అధికారి/మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగులు కచ్చితంగా ఎన్నికల నియమావళిని అనుసరించాలని తెలిపారు. స్థానిక 44వ వార్డు పరిధిలోని సచివాలయం 76, 77లకు చెందిన వాలంటీర్లు సస్పెన్షన్ కు గురయ్యారు.

News March 21, 2024

అనకాపల్లి: నీళ్ల తొట్టిలో పడి బాలుడు మృతి

image

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు పంచాయితీలోని కోడాపల్లిలో ఘోరం జరిగింది. గ్రామానికి చెరుకు చంద్రరావు, జానకి దంపతుల ఏడాదిన్నర కుమారుడు గణేష్ ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడి మృతి చెందాడు. తొట్టిలో పడిన బాలుడిని దేవరాపల్లి పీహెచ్సీకి చికిత్స నిమిత్తం తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News March 21, 2024

ఎన్నికల్లో వీరికి పోస్టల్ బ్యాలెట్లు

image

పోలింగ్ జరిగే మే 13న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. విద్యుత్, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, AIR, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, హెల్త్, ఫుడ్ కార్పొరేషన్, RTC, అగ్నిమాపక, పోలీసులు, అంబులెన్స్, షిప్పింగ్, సమాచార, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, కవరేజీ కోసం లెటర్లు పొందిన జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది.

error: Content is protected !!