India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా నదిలో మునిగి పదో తరగతి విద్యార్థి మృతిచెందిన ఘటన అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కర్లపూడి గ్రామానికి చెందిన అభిషేక్ (17) పదో తరగతి చదివి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. అభిషేక్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్నానానికి వైకుంఠపురం పుష్కరఘాట్‌కు వచ్చి నీట మునిగి చనిపోయాడు.
ఎలుకల మందు తిని ఓ మహిళ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. మద్దిపాడులోని బీసీ కాలనీకి చెందిన అన్నపరెడ్డి వెంకటలక్ష్మి(26) ఏడాదికాలంగా మానసికంగా ఆందోళన చెందుతుంది. ఈ క్రమంలో ఈనెల 17న ఎలుకల మందు తిని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కుటుంబసభ్యులు గమనించి ఒంగోలు రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తూ.గో జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఈ నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి.జగదీశ్ హెచ్చరించారు. ట్రోలింగ్, ఆన్‌లైన్ వేధింపులు, తప్పుడు వార్తల ప్రచారాలపై ప్రత్యేక నిఘా ఉందని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే ఆయా వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూప్స్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. SHARE IT..
రామభద్రపురం మండలం రొంపిల్లికి చెందిన ఓ యువతిపై ముదిలి కృష్ణ అనే వ్యక్తి 2017లో అత్యాచారం కేసు నమోదయ్యింది. 11 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ విజయనగరం మహిళా సెషన్ కోర్టు న్యాయమూర్తి పద్మావతి బుధవారం తీర్పు వెలువరించినట్లు స్థానిక ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ తెలిపారు. 2017లో స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. వాదనలు పూర్తైన పిదప న్యాయమూర్తి బుధవారం తుది తీర్పు వెల్లడించారు.
బి కొత్తకోటలో విషం తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం.. స్థానిక రంగసముద్రం రోడ్డులో ఉంటున్న దంపతులు బాలాజీ, అశ్వినికి 9 ఏళ్లగా పిల్లలు కలగలేదు. దీంతో వారు బుధవారం గొడవపడ్డారు. మనస్థాపం చెందిన అశ్విని పురుగుమందు తాగడంతో గమనించిన భర్త ఆవెంటనే పురుగు మందుతాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బాధితులను కుటుంబీకులు చికిత్సకోసం వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఎన్నికల ప్రచార అనుమతులకు కోసం సింగిల్ విండో ద్వారా “ఫస్ట్ ఇన్ – ఫస్ట్ ఔట్” ద్వారా దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ డా.జి.సృజన రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎంసీసీ అమలును జడ్పీ సీఈఓ, హౌసింగ్ పీడీ పర్యవేక్షిస్తున్నారని, ఇందుకు సంబంధించి జడ్పీ కార్యాలయంలో ఒక కమాండ్, కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.
కాపు సంఘం రాష్ట్ర నేత వంగవీటి నరేంద్ర బుధవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నరేంద్ర ఇప్పటి వరకు బీజేపీలో పని చేశారు. ఈయన వంగవీటి రాధాకృష్ణకు సోదరుడు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్‌రెడ్డి, కాపు సంఘం నేతలు పాల్గొన్నారు.
తనకు ఇవే చివరి ఎన్నికలని.. గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవ్వాలంటూ నర్సీపట్నం నియోజకవర్గ TDP అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రజలను కోరారు. బుధవారం రామన్నపాలెం పంచాయతీ శివారు వెంకయ్యపాలెంలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో 66 కేంద్రాలలో నేడు నిర్వహించిన పదవ తరగతి మూడవ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాధికారి జి.పగడాలమ్మ తెలిపారు. జిల్లాలో 10,554 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 10,470 మంది హాజరు అయ్యారని, 84 మంది గైర్హాజరు అయ్యారని ఆమె అన్నారు. జిల్లాలో 24 కేంద్రాలలో స్క్యాడ్లు, డీఈఓ 6 పరీక్ష కేంద్రాలలో తనిఖీలు చేశారు. జిల్లాలో 99.20 శాతం హాజరు నమోదయింది.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారని ఇద్దరు ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. పుట్టపర్తి రూరల్ మండలంలోని కంబాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రామాంజనేయులు, కదిరి పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారని, వారిని సస్పెండ్ చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.