Andhra Pradesh

News March 20, 2024

విశాఖ: ‘అసలు ఎవరి పక్కన ఉన్నారో త్వరలో తెలుస్తుంది’

image

రాష్ట్ర ప్రజలు ఎవరి పక్కన ఉన్నారో త్వరలో తెలుస్తుందని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖలో మాట్లాడుతూ.. అనకాపల్లి ఎంపీ సీటు ప్రకటించేందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఈనెల 27 నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నమ్మినవారు తమ పార్టీలోకి వస్తున్నట్లు తెలిపారు.

News March 20, 2024

నెల్లూరు జిల్లాలో హత్య

image

కుమారుడే తండ్రిని హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో బుధవారం ఉదయం వెలుగు చూసింది. ఇందుకూరుపేట మండలం డేవిస్ పేటలో కుటుంబ కలహాలతో భార్య వెంకట రమణమ్మపై భర్త ప్రసాద్ గడ్డపారతో దాడి చేశాడు. ఈక్రమంలో భార్య కోమాలోకి వెళ్లింది. ఇది గమనించిన వాళ్ల పెద్ద కుమారుడు మహేశ్ గడ్డపారతో తండ్రిని పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు  నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News March 20, 2024

అనంత: కర్ణాటక మద్యం తరలిస్తున్న వాలంటీర్ అరెస్ట్..

image

గుమ్మగట్ట మండలం పూలుకుంట గ్రామం వాలంటీర్ హనుమంతు కర్ణాటక నుంచి 380 టెట్రా మద్యం ప్యాకెట్లు బైక్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా సరిహద్దు ప్రాంతంలో పట్టుకున్నట్టు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.9,800 నగదుతో పాటు బైక్, కర్ణాటక మద్యం సీజ్ చేసి అతడిని అరెస్టు చేశారు. అతడిని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు .

News March 20, 2024

కృష్ణా: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున వర్సిటీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్(ANUEET)-2024 రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పూర్తి చేసిన వారికి బీటెక్‌లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను మే నెలలో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు ఏప్రిల్ 7లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం https://www.nagarjunauniversity.ac.in/ చూడవచ్చని చెప్పారు.

News March 20, 2024

రైల్వే కోడూరు అసెంబ్లీ బరిలో జనసేన అభ్యర్థి..?

image

రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి గురించి ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా మంగళవారం నుంచి నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. పొత్తులో భాగంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించే అవకాశం వుండడంతో పవన్ కల్యాణ్ వాయిస్‌‌తో ‘రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా మద్దెల సుబ్బరాయుడుకు ఓటు వేస్తారా లేక నోటాకు వేస్తారా’ అంటూ సర్వే జరుగుతోంది. ఈయన ఇది వరకు జర్నలిస్ట్‌గా పని చేశారు.

News March 20, 2024

ప.గో: ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు యాప్

image

రాబోయే ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా ఓటింగ్ జరగాలని స్వీప్ నోడల్ ఆఫీసర్ తూతిక విశ్వనాథ్ అన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సి.విజిల్ యాప్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లోనే అధికారుల నుంచి స్పందన వస్తుందని అన్నారు. జిల్లా యంత్రంగం ఈ యాప్‌లో వచ్చిన ఫిర్యాదులకు సకాలంలో స్పందించి పరిష్కారం చూపుతారన్నారు.

News March 20, 2024

గుంటూరు పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ ఏర్పాటు

image

సుప్రీమ్ కోర్ట్ 2006లో ప్రకాష్ సింగ్ కేసు తీర్పులో జారీ చేసిన మార్గదర్శక సూత్రాలననుసరించి, పోలీస్‌లపై వచ్చే ఫిర్యాదులను విచారించడానికి “పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థలను” రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన కార్యాలయాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేసినట్లు మంగళవారం అధికారి తెలిపారు.

News March 20, 2024

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఇచ్చాపురం బుడతడికి చోటు

image

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఇచ్చాపురానికి చెందిన ఏడేళ్ల బాలుడు పడాల పార్థివ్‌కు చోటు దక్కింది. గతంలో 1 నుంచి 50 వరకు క్యూబ్స్‌ను 1 నిమిషం 36 సెకన్లలో రాసి చోటు దక్కించుకున్నట్లు తండ్రి అప్పలనాయుడు, తల్లి లక్ష్మి పేర్కొన్నారు. అయితే ఇప్పుడు 1 నుంచి 100 వరకు క్యూబ్స్‌ను 4 నిమిషాల 24 సెకన్‌లలో చెప్పినందుకు ఈ గౌరవం దక్కిందని అన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.

News March 20, 2024

బైండోవర్ కేసుల నమోదుకు పోలీసుల సన్నద్ధం: ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ కేసులు నమోదు చేసేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నాయకులు, కార్యకర్తలు, అనుమానిత వ్యక్తులు, నేరచరిత్రుల గుర్తించేందుకు పోలీసు అధికారులు కసరత్తు చేపట్టారు. సదరు వ్యక్తులను గుర్తించి ఐపీసీ106, 107, 108, 109, 110 కింద కేసు నమోదు చేసిన తర్వాత తహశీల్దారు ఎదుట హాజరుపరచనున్నారు.

News March 20, 2024

పవన్‌ను నేను కలవలేదు: పిఠాపురం వర్మ

image

పవన్ కళ్యాణ్‌ను ఇటీవల తాను కలిసినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని వర్మ పేర్కొన్నారు. ‘పవన్‌తో నేను రెండు మూడు సార్లు ఫొటో దిగాను. 2014లో పవన్‌ను కలిసిన ఫొటోను అప్పుడప్పుడు జనసేన నేతలు వాడుతున్నారు. గతంలో పవన్‌ను కలిసినప్పుడు విజయానికి సీక్రెట్ ఏంటని నన్ను అడిగారు. ఎప్పుడూ కష్టపడుతూ ఉంటానని చెప్పా. అప్పుడు పవనే పిలిచి ఫొటో తీసుకుందామని అడిగారు’ అని ఆయన జ్ఞాపకాలను వర్మ గుర్తు చేసుకున్నారు.