India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనలో జిల్లావాసి మృతి చెందారు. రాచర్ల మండలం కాలవపల్లి గ్రామానికి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి మిలిటరీలో పనిచేస్తున్నారు. నీటిలో ఆర్మీ విన్యాసాలు చేస్తుండగా మొత్తం ఐదుగురు కొట్టుకుపోయారు. వారిలో ఒకరు రామకృష్ణారెడ్డిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గన్నవరం విమానాశ్రయంలో రేపటి నుంచి కార్గో సేవలు పునఃప్రారంభం కానున్నట్లు విమానశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈ సేవలకు ముందడుగు పడినప్పటికీ కరోనా వల్ల నిలిచిపోయిందన్నారు. తాజాగా కార్గో సేవలను ఒమెగా ఎంటర్ ప్రైజెస్ దక్కించుకుంది. చేప, రొయ్యలతో పాటు, పాలు, పూలు, పండ్లు, మిర్చి, తదితరాలను దేశంలోని ఏప్రాంతానికైనా గంటల వ్యవధిలో చేర్చేందుకు ఈ సర్వీస్ ఉపయోగపడుతుందన్నారు.

దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామానికి చెందిన నక్కెళ్ల గోపి(40) పురుగుమందు తాగి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతను వేడుకలకు వంటలు చేస్తూ జీవించేవాడు. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శరీరంపై పలుచోట్ల ఉన్న గాయాలు ఇంకా బాధిస్తుండడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గోపి పురుగుమందు తాగాడు. మృతుడికి భార్య శ్రీదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాయలసీమ విశ్వవిద్యాలయంలో పీజీ-4వ సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ఆచార్య వెంకటసుందరానంద్ పుచ్చ తెలిపారు. వర్సిటీ కళాశాలతో పాటు మరో ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రెగ్యులర్ 468 మంది, సప్లిమెంటరీ 103 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

డా.బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ ప్రథమ, బీటెక్ ఎనిమిదో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఎస్.ఉదయ్‌భాస్కర్ శనివారం విడుదల చేశారు. బీపీఈడీ ప్రథమ సెమిస్టర్‌లో 250 మంది, డీపీఈడీలో 46 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. బీటెక్ కోర్సులో సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్ ఎనిమిదో సెమిస్టర్‌లో 196 ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్‌లో చూసుకోవచ్చు.

వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలోని కెకె లైన్‌లో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సువోమోయ్ మిత్ర భద్రతా పరమైన తనిఖీలను శనివారం నిర్వహించారు. దంతేవాడ-కములూర్ సెక్షన్‌లో డబ్లింగ్ పనులు పరిశీలించారు. మోటార్ ట్రాలీపై వెళ్లి పట్టాలు, కొత్త సిగ్నలింగ్ వ్యవస్థలు, వంతెనలను పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. వేగానికి సంబంధించి ట్రైల్ రన్ నిర్వహించారు. దంతెవాడ-కిరండోల్ మార్గంలో డబ్లింగ్ పనులు పూర్తయినట్లు తెలిపారు.

చిత్తూరు జడ్పీ పూర్వ సీఈవో ప్రభాకరరెడ్డిని సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ కన్నబాబు ఇటీవల ఉత్తర్వలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఆర్డర్స్‌ను అందజేసేందుకు జడ్పీ ఉద్యోగులు చిత్తూరు నగరంలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. అలాగే ఆయన వాట్సాప్, బైరెడ్డిపల్లె ఎంపీడీవో కార్యాలయానికి సస్పెన్షన్ ఉత్తర్వులను అందజేశారు.

ఎస్కేయూ యూనివర్సిటీలో జులై 8 నుంచి తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ కృష్ణకుమారి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మే 15 నుంచి యూనివర్సిటీలో వేసవి సెలవులు ఇచ్చామన్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా యూనివర్సిటీలో తాగునీటి సమస్య కారణంగా తరగతులు ప్రారంభించలేదు. జులై 8 నుంచి యూనివర్సిటీలో తరగతులతో పాటు వసతిగృహాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. సూళ్లూరుపేట శ్రీచెంగాల పరమేశ్వరి ఆలయ మాజీ ఛైర్మన్ దువ్వూరు బాల చంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్‌ను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

మండలంలోని తుర్లపాడులో శనివారం తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడి చేశాడు. SI ధర్మరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యానందం, సత్యంబాబులు ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరికీ తల్లికి గృహనిర్మాణ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో తమ్ముడు అన్నపై చేయి చేసుకోగా అన్న గొడ్డలితో తమ్ముడిపై మెడపై నరికాడు. పోలీసులు సత్యానందాన్ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. క్షతగాత్రుడు విజయవాడలో చికిత్సపొందులతున్నాడు.
Sorry, no posts matched your criteria.