India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రెండేళ్ల కిందటి బిల్లులు ఇంకా ఇవ్వకుంటే ఎలా అని స్థానిక సంస్థల MLC తూమాటి మాధవరావు RWS ఎస్ఈ మర్దన్ అలీని ప్రశ్నించారు. ఒంగోలులో ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ బిల్లులను ఆపాలని అధికారులపై ఒత్తిడి పెరుగుతుందని, కొత్త అధికారులు రాకముందే బిల్లులు చెల్లించే విధంగా చూడాలన్నారు. బిల్లుల విషయంలో కలెక్టర్‌ను కలుస్తామని, అవసరమైతే కోర్టుకు వెళ్తాం అన్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్‌లో 1,530 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. వాటిలో 154 సివిల్ కేసులు, 129 వాహన ప్రమాద బీమా కేసులు, 1,247 క్రిమినల్ కేసులు, 102 ఫ్రీ లిటిగేషన్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

విశాఖ రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీ పోలీసులు శనివారం 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం కొరాపుట్ ప్రాంతానికి చెందిన శివ పాత్రో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతని వద్ద తనిఖీ చేయగా 21 కిలోల గంజాయి లభించింది. దీనిని విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిందితుడు వెల్లడించినట్లు జీఆర్‌పీ ఏఎస్ఐ మనోహర్ తెలిపారు.

రైలు నుంచి జారిపడి యువకుడు మృతిచెందిన ఘటనపై శనివారం జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై మృతదేహం ఉంది. జీఆర్‌పీ సిబ్బంది వెళ్లి పరిశీలించారు. రైలు నుంచి జారి పడటంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు జీఆర్‌పీ పోలీసులను సంప్రదించాలని అన్నారు.

సోంపేట మండలం మామిడిపల్లి పంచాయతీ చిన్న మామిడిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బొడ్డు దొరబాబు వీరత్వం ప్రదర్శించారు. JK బరాముల్లా జిల్లా, ఆదిపురా గ్రామంలో నిర్వహించిన 32 రాష్ట్రీయరైఫిల్ ఆపరేషన్‌లో పాల్గొని, డ్రోన్ సహాయంతో ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతమొందించారు. ఇంతటి సాహసం చూపిన దొరబాబు ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి మెడల్ అందుకున్నారు.

హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శనివారం విశాఖపట్నం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కే.మయూర్ అశోక్ కు అందజేసినట్లు మీడియాకు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అరకు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హుకుంపేట జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు.

తమకు భద్రత పెంచాలంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై భారత చైతన్య యువజన పార్టీ(BCY) స్పందించింది. ‘పిరికి తండ్రి.. పిరికి పుత్రుడు. పుంగనూరులో ఇక అడుగుపెట్టలేరు’ అని ట్వీట్ చేసింది. కాగా పెద్దిరెడ్డికి మంత్రి హోదాలో గతంలో 5+5 భద్రత ఉండగా.. ప్రస్తుతం 1+1 సెక్యూరిటీ కల్పిస్తున్నారు. విచారణ జులై 8కి వాయిదా పడింది.

కడప నగరంలోని శారదా నిలయం సమీపంలో శుక్రవారం రాత్రి నబీ రసూల్ తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న నబీ రసూల్ మామ చాన్, అతని కుమారుడు జంక్సాన్ వలి ఎందుకు మద్యం తాగుతూ అల్లరి చేస్తున్నారని వారిని ప్రశ్నించారు. దీంతో నబీ రసూల్ వారిపై కత్తితో దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తన పేరు చెప్పి ఓ వ్యక్తి మాయమాటలతో రాజకీయ ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ MP చేగొండి హరిరామజోగయ్య DGP ద్వారకా తిరుమలరావుకు శనివారం లేఖ రాశారు. నిందితుడి మాటలు నమ్మి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నాయకులు అతడికి డబ్బులు ఇస్తున్నారని, 6 నెలలు కిందట దీనిపై పాలకొల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

కాకినాడలోని గాంధీనగర్‌కు చెందిన 14ఏళ్ల విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. ఆ బాలిక ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందని ఆమె సోదరుడు మందలించడంతో మనస్తాపం చెంది ఇంట్లో శనివారం ఉరి వేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు 2 టౌన్ SI చినబాబు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.