Andhra Pradesh

News May 11, 2024

తెనాలిలో తండ్రీ, కూతురు, మనవరాలు గెలుపు

image

గుంటూరు జిల్లా రాజకీయాల్లో తెనాలికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో తెనాలి రాజకీయాల్లో ఒక కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోయింది. 1952, 55, 62లో ఆలపాటి వెంకట రామయ్య ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఆయన బాటలోనే ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిరా 1967, 72, 78 ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం 1999లో ఆయన మనవరాలు గోగినేని ఉమా ఎమ్మెల్యేగా గెలుపొంది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబంగా చరిత్ర సృష్టించారు.

News May 11, 2024

NTR: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి జైలు శిక్ష ఖరారు

image

విజయవాడలోని ఓ కళాశాలలో చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో తానికొండ పవన్ అనే యువకుడికి న్యాయస్థానం శుక్రవారం 10ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధించింది. సదరు బాలిక(16)ను 2016లో నిందితుడు పవన్(19) అత్యాచారం చేయగా సూర్యారావుపేట PSలో కేసు నమోదు కాగా, కేసు విచారించిన పోక్సో కోర్ట్ జడ్జి తిరుమల వెంకటేశ్వర్లు శుక్రవారం నిందితుడు పవన్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.

News May 11, 2024

పార్వతీపురం: కుక్కలదాడిలో వృద్ధురాలు మృతి

image

జియ్యమ్మవలస మండలం వెంకటరాజుపురం గ్రామానికి చెందిన బంటు లక్ష్మి(70)బహిర్భూమికి వెళ్ళగా అకస్మాత్తుగా కుక్కలు గుంపు వచ్చి ఆమెపై దాడి చేశాయి. శరీరమంతా ముక్కలుగా కొరకటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ గ్రామంలో కొద్ది రోజులుగా కుక్కలు చాలామందిని గాయపరుస్తున్నాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. 

News May 11, 2024

కర్నూలు: ఓటుకు రూ.5 వేలు?

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చరిత్రలో ఎప్పుడూ లేని ఖరీదైన ఎన్నికలు ఈసారి జరగనున్నాయి. ప్రచార ఘట్టం ముగుస్తుండటంతో డబ్బు పంపిణీపై నేతలు దృష్టి పెట్టారు. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బనగానపల్లెలో ఓ పార్టీ నేతలు రూ.2 వేలు పంపిణీ చేయగా.. మరో రూ.వెయ్యి కూడా పంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ, పత్తికొండ, కర్నూలులో వెయ్యి నుంచి రూ.2 వేలు పంచుతున్నట్లు సమాచారం.

News May 11, 2024

వైభవంగా అప్పన్న సహస్ర ఘట్టాభిషేకం

image

చందనోత్సవం సందర్భంగా సింహాచలం వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి శుక్రవారం రాత్రి వైభవంగా సహస్త్ర ఘట్టాభిషేకం నిర్వహించారు. సాంప్రదాయ బద్దంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధర నుంచి పవిత్ర జనాలు తీసుకువచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు. సుమారు 500 మంది రుత్వికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News May 11, 2024

సాయంత్రం 6 గంటలకు ప్రచారాలు ఆపివేయాలి: బాపట్ల కలెక్టర్

image

11వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు రాజకీయ అభ్యర్థులు ప్రచారాలు నిలిపివేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 11వ తేదీ ప్రచారాలకు ఆఖరి రోజు అన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను రాజకీయ అభ్యర్థులు పాటించాలని కోరారు.

News May 11, 2024

నెల్లూరు: ‘సెలవు ఇవ్వకపోతే కాల్ చేయండి’

image

దుకాణాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసినట్లు కార్మిక శాఖ గుంటూరు జోన్ సంయుక్త కమిషనర్ శ్రీనివాస కుమార్ తెలిపారు. ఈ విషయంలో కార్మికులతో పాటు యజమానులకు ఏమైనా సమస్యలు ఉంటే 94925 55145 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.

News May 11, 2024

గుంటూరు: యార్డులో 60,876 బస్తాల మిర్చి విక్రయం

image

మార్కెట్ యార్డుకు శుక్రవారం 51,030 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 60,876 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్-5, 273, 341, 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ.17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 20,000 వరకు లభించింది.

News May 11, 2024

పార్వతిపురం: నేటితో ప్రచారానికి తెర

image

ఓటింగుకు 48 గంటలు మాత్రమే ఉండడంతో ప్రచార కార్యక్రమాలు శనివారం సాయంత్రం 6 గంటలతో ముగియనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమయం తర్వాత అభ్యర్థులు, వారి పక్షాన ఎవరైనా ప్రచారం చేస్తే నిబంధనలకు విరుద్ధం అవుతుందన్నారు. సాయంత్రం తర్వాత నుంచి ర్యాలీలు, సభలు, సమావేశాలు విందులు, లౌడ్ స్పీకర్లను నిషేధం విధించినట్లు కలెక్టర్ చెప్పారు.

News May 11, 2024

తిరుపతి: ఉద్యోగం పేరిట ఛీటింగ్

image

ఉద్యోగం పేరుతో నమ్మించి మోసగించిన సైబర్ నేరగాడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ డీఎస్పీ పద్మలత మాట్లాడుతూ పుత్తూరుకు చెందిన గుణశేఖర్(37)తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని రవి అనే పేరుతో టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. తాను సాఫ్ట్వేర్ ఉద్యోగినంటూ పరిచయాలు పెంచుకుని, వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. బాధితుడు సురేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామన్నారు.