India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈవీఎం యూనిట్స్‌ను స్ట్రాంగ్ రూమ్‌లలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎంల గోడౌన్ సందర్శించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవిఎమ్ గోడౌన్ పరిశీలించినట్లు తెలిపారు.

జూలై 1న ఉదయం 6 గంటల నుంచే సామాజిక పెన్షన్ల పంపిణీ మొదలు కావాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ, రేషన్ పంపిణీపై జేసీ కేతన్ గార్గ్, తదితరులతో సమీక్ష నిర్వహించి పింఛన్ల పంపిణి సజావుగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు మంత్రి నారా లోకేష్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లాలోని రాజకీయ పరిస్థితులను వివరించారు.

అతిసార వ్యాధి నిర్మూలనకు పరిశుభ్రత, నాణ్యమైన నీటి సరఫరాలే కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం అతిసార వ్యాధి నిర్మూలన ప్రచార కార్యక్రమం- 2024 పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, విద్య, ఐసిడిఎస్, మునిసిపల్ అధికారులు ఉన్నారు.

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లత్కర్ తెలిపారు. జులై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన తెలిపారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివానం మాట్లాడారు. ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

నంద్యాల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వివిధ కేటగిరీలకు చెందిన పెన్షన్ లబ్ధిదారులందరికీ జులై 1న 100% పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డా. కే.శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

చిత్తూరు రైతు బజారులో నాణ్యమైన కందిపప్పు కేజీ రూ.165కే విక్రయించే కౌంటర్ జులై 2న ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ మేరకు ధరల నియంత్రణ కమిటీతో చర్చించారు. పెనుమూరు, కార్వేటినగరం, జీడీ నెల్లూరు, నగరి మండలాల్లో ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా తక్కువ ధరకు టమాటా విక్రయించడానికి చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శంకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద పెరిగిన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందించేందుకు పటిష్ఠ ప్రణాళికతో, సమన్వయంతో కృషిచేయాలని జిల్లా కలెక్టర్ సృజన అధికారులను శనివారం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 1వ తేదీ ఉదయం 6గంటలకు పెన్షన్ పంపిణీని ప్రారంభించి లబ్ధిదారులందరికీ పెన్షన్ మొత్తం అందించేందుకు కృషిచేయాలన్నారు.

ప్రజలకు అత్యంత ప్రాధాన్యతైలైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన సమగ్ర ప్రతిపాదనలను అందజేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వానికి సామాజిక బాధ్యతగా సహకారం అందించేందుకు ఎన్‌పీసీఐఎల్ భాగస్వామ్యంతో ప్రజలకు అత్యంత మేలు జరిగే మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ముందుకు వచ్చిందన్నారు. జిల్లా పరిధిలోని ఆయా ప్రాధాన్యతలను గుర్తించి వెంటనే ప్రతిపాదనలను పంపించాలన్నారు.

కల్కి 2898 AD చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వాహనం అయిన బుజ్జి రేపు విజయవాడ రానుంది. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విజయవాడ ట్రెండ్‌సెట్ మాల్ వద్ద బుజ్జి అందుబాటులో ఉంటుందని తెలిపింది.
Sorry, no posts matched your criteria.