India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జూలై 1న కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్, డివిజన్ కార్యాలయాల్లో సంబంధింత అధికారులు ప్రజా ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

నాటుకోడి, రాగి సంగటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీమ ప్రజలు ఆస్వాదిస్తూ తినే వంటకం ఇది. ఇటీవల AI సృష్టించిన వినూత్న ఫొటోలు నెట్టింట వైరలవుతున్న విషయం తెలిసిందే. అలాగే చట్ని, రాగి ముద్ద, నెయ్యితోనూ AI ఓ ఫొటో తయారు చేసింది. దీన్ని ఓ నెటిజన్ నెట్టింట పోస్ట్ చేయడంతో ‘సీమరుచులను ఇంకా ప్రాచుర్యంలోకి తేవాలి’ అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

అనంతపురంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,254 కేసులకు న్యాయమూర్తులు పరిష్కారం చూపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 27 బెంచ్‌లు నిర్వహించారు. రాజీ పడదగిన 707 క్రిమినల్ కేసులు, 69 సివిల్ కేసులు, 26 మోటారు వాహనాల పరిహారం కేసులు, 3,254 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయి. లోక్ అదాలత్ నిర్వహణను జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు సత్యవాణి పర్యవేక్షించారు.

కనిగిరిని 13వ శతాబ్దంలో కాటంరాజు ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కనిగిరి దుర్గాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించాడు. నాడు ఈ ప్రాంతాన్ని బంగారుకొండ అని కూడా పిలిచేవారు. ఆయన ఏలుబడిలో కడప, కర్నూల్ ప్రాంతాలు కూడా ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆయన పాలనలో కనిగిరి ప్రాంతంలో కరవు ఏర్పడటంతో నెల్లూరు పాలకుడైన మనుమసిద్ధి రాజుతో ఓప్పందం కుదుర్చుకున్నారని చరిత్ర.

నంద్యాలలోని ఆర్&బీ అతిథి గృహంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూక్ శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి, JC టీ.రాహుల్ కుమార్ రెడ్డి, MLAలతో సమీక్షించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు బీసీ, ఫరూక్ దిశా నిర్దేశం చేశారు. MLAలు కోట్ల, గౌరు, బుడ్డా, భూమా, జయసూర్య పాల్గొన్నారు.

దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బాధ్యతలను సీనియర్ శాస్త్రవేత్త డా.జీ.రమేష్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కేవీకే బోధన బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రకాశం జిల్లా రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందిస్తానని భరోసా కల్పించారు. ఈయన గతంలో పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రంలో సమన్వయకర్తగా విధులను నిర్వహించారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలోని ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. కొండ దిగువన ప్రసాదం విక్రయకేంద్రం వద్ద రాత్రివేళ ఏర్పాటుచేసిన లైట్ల వద్దకు పురుగులు రావడంతో ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. కనీసం లైట్లు కూడా ఆపట్లేదని వాపోతున్నారు. కౌంటర్ నుంచి ప్రసాదం ప్యాకెట్లు తీసుకునే సమయంలో పురుగుల కారణంగా అసౌకర్యానికి గురవతున్నామని చెబుతున్నారు.

జులై ఒకటో తేదీన తాడేపల్లి మండలం పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న సందర్భంగా.. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. శనివారం రాత్రి ఆమె తన కార్యాలయంలో సీఎం పర్యటనపై ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

భారతీయ నూతన చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త చట్టాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని VSKP సిటీ డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ ఎం.శైలజా, జిల్లా ఎస్పీ జీ.ఆర్ రాధిక ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి పోలీసు అధికారులకు సూచనలు అందజేసి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఆమె వెంట ఏఎస్పీ జి.ప్రేమ్ కాజల, డీఎస్పీలు వై శ్రుతి, శివా రామి రెడ్డి ఉన్నారు.

జూలై 1 ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. పెన్షన్ల పంపిణీపై శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పెన్షన్ల పంపిణీకి చేసిన ఏర్పాట్లను వివరించారు.
Sorry, no posts matched your criteria.