India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు దిగడం హేయమని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ పరిధిలోని సచివాలయాలను ఆయన శనివారం సందర్శించారు. క్షక సాధింపు చర్యలో భాగంగానే సచివాలయాలపై ఉన్న జగన్ ఫొటోలు, పేర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను టీడీపీ నాయకులు ధ్వంసం చేస్తున్నారని చెప్పారు.

విజయవాడ, భద్రాచలం రోడ్ మధ్య ప్రయాణించే మెము ఎక్స్‌ప్రెస్‌లను ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు జూలై 1 నుంచి 31 వరకు నం.07278 భద్రాచలం రోడ్-విజయవాడ, నం.07279 విజయవాడ- భద్రాచలం రోడ్ మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఆయా రైళ్ల రద్దు ప్రకటనను గమనించాలని సూచించారు.

భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ఫైలు పైనే తన తొలి సంతకం చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవననిర్మాణ కార్మికసంఘం ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వ బృందం శనివారం మంత్రిని కలిసి సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందని హామీ ఇచ్చారు.

గత రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు నగదు బకాయిలు చెల్లించాలని CM చంద్రబాబును నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కోరారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధాన్యం బకాయిల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని అన్నారు. స్పందించిన సీఎం త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

కనగానపల్లి మండలం కొండపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పవన్ కుమార్(31) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పవన్ కుమార్ కంబదూరు మండలం తిప్పేపల్లికి చెందిన వ్యక్తి అని, వ్యక్తిగత పనిమీద బైకులో వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడ్డాడని కనగానపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

YVU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వెంకటసుబ్బయ్య రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ రాజీనామాకు VC ఆమోదం తెలిపారు. అనంతరం YVU వీసీ ఆచార్య సుధాకర్ శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఈ సమాచారాన్ని ఉన్నత విద్యా మండలి కార్యదర్శికి పంపారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా YVU ప్రిన్సిపల్ రఘునాథరెడ్డికి వారు నియామక పత్రం అందజేశారు.

రాజీయే రాజమార్గం అనే నినాదంతో ఉమ్మడి జిల్లాలో వివిధ కోర్టుల పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 1863 కేసులకు పరిష్కారం లభించింది. విజయనగరం(1136), పార్వతీపురం(138), బొబ్బిలి(160), సాలూరు(151), ఎస్ కోట(65), గజపతినగరం(91), చీపురుపల్లి(50), కొత్తవలస(53), కురుపాం(19ల)లో కేసుల చొప్పున పరిష్కరించారు. ఈ ఒక్క రోజే సుమారు రూ.15 కోట్ల మొత్తాన్ని కక్షిదారులకు చెల్లించారు.

కారాగార సంస్కరణలు, చట్టపరమైన హక్కులు, కౌన్సిలింగ్, వయోజన విద్య మొదలైన సేవల్లో పేరుపొంది, సామాజిక సేవలతో కలిసి పనిచేసే సిబ్బంది ఎంపికకు ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. జిల్లాలో ఆసక్తి, అనుభవం ఉన్నవారు తమ విద్యార్హతలతో జులై 5లోపు కలెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కమిటీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. జులై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో అర్హులైన 2,70,966 మందికి రూ.184.70 కోట్లు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. జిల్లాలోని 54 సచివాలయాల్లో 4,349 మంది సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు.

నంద్యాల జిల్లా పరిధిలోని కొలిమిగుండ్ల, కొత్తపల్లి మండలాల ఎంపీడీవోల తీరుపై జిల్లా కలెక్టర్ డా.కే.శ్రీనివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీ అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరు కావడం, ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లడాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ఇద్దరు ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జడ్పీ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.