Andhra Pradesh

News June 29, 2024

పాడేరు: ఎన్నికల ఖర్చును రెండు రోజుల్లో సమర్పించాలి

image

సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు, ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో చేసిన ఖర్చులను సంబంధిత రికార్డులలో నమోదు చేసి నియోజకవర్గం వ్యయ పరిశీలకులతో రికన్సిలేషన్ చేసి సమర్పించాలన్నారు. వాటిని ఎలక్షన్ కమిషన్‌కు పంపిస్తామన్నారు.

News June 29, 2024

విశాఖ: ఏపీఎల్-3 ట్రోఫీ ఆవిష్కరణ

image

విశాఖ వైయస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈనెల 30 నుంచి ఏపీఎల్-3 సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో శనివారం ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. స్టేడియంలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నట్లు స్టేడియంలో మొత్తం 19 మ్యాచులు జరగనున్నట్లు తెలిపారు. జూలై 13 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయన్నారు.

News June 29, 2024

మిస్ రాజమండ్రి ఆడిషన్స్‌.. 90 మంది యువతులు

image

‘రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్’ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మిస్ రాజమండ్రి ఆడిషన్స్‌కు యువత ఉత్సాహంగా తరలివచ్చారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన ఆడిషన్స్ ప్రోగ్రాంలో 90 మంది యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారని క్లబ్ అధ్యక్షుడు రాజా పేర్కొన్నారు. నగరంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా ‘మిస్ రాజమండ్రి’ కార్యక్రమం చేపట్టి యువతలలో ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

News June 29, 2024

ప.గో. కలెక్టర్‌ను కలిసిన SP

image

పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాగరాణిని ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూలకుండీ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని లాండ్ ఆర్డర్‌పై వివరించారు.

News June 29, 2024

విశాఖపట్నంలో బొబ్బిలి వాసి దుర్మరణం

image

బొబ్బిలి పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ బాబు కుమారుడు హేమంత్ విశాఖలో జరిగిన ఓ ప్రమాదంలో శనివారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాఖలోని పీఎం పాలెంలో నాలుగు అంతస్తుల భవనం పై ఏసీ బిగిస్తుండగా.. ప్రమాదవశాత్తు జారిపడి హేమంత్ మృతిచెందాడు. దీంతో బొబ్బిలిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

News June 29, 2024

అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం: కడప ఎంపీ

image

‘అధైర్యపడవద్దు, అందరికీ అండగా ఉంటాం’ అని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. శనివారం వేములలోని మండలంలోని కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొందర్లోనే మళ్లీ అధికారంలోకి వస్తామని, ఈ ఐదేళ్లు ఐదు రోజుల్లా గడిచిపోతాయని ఆయన వారికి ధైర్యం చెప్పారు. ప్రజా తీర్పును మనం గౌరవించాలని ఆయన కోరారు. అలాగే మండలంలోని పలు సమస్యలపై వారితో మాట్లాడారు.

News June 29, 2024

పుంగనూరుకు పోవడం కూడా కష్టమే: లాయర్

image

తన భద్రత విషయమై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డికి 5+5 భద్రత ఉండేది. ఇప్పుడు 2+2 కూడా ఇవ్వడం లేదు. భద్రత ఉపసంహరణపై పోలీసులు కారణాలు చెప్పడం లేదు. ఆయన MLAగా పుంగనూరుకు కూడా వెళ్లలేకున్నారు’ అని కోర్టులో వాదించారు. విచారణ జులై 8కి వాయిదా పడింది.

News June 29, 2024

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఇలా

image

జులై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 1వ తేదీన గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశం కానున్నారు. 2వ తేదీ ఉదయం కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్ష, సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. 3వ తేదీన ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

News June 29, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి చిన్నారి ముస్కాన్ ఎంపిక

image

తాడిపత్రికి చెందిన చిన్నారి ముస్కాన్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైంది. అనంతపురంలో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో అండర్-13 సింగిల్స్, డబుల్స్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ధ్రువీకరిస్తూ చిన్నారి ముస్కాన్‌కు సర్టిఫికెట్ జారీ చేశారు.

News June 29, 2024

SKLM: పెన్షన్ పంపిణీకి ప్రత్యేక కార్యాచరణ అమలు

image

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌కు తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ఏపీ సచివాలయం నుంచి శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై ఆయన దిశానిర్దేశం చేశారు.