India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్యను గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ మర్యాదపూర్వకంగా కలిసారు. మంత్రి అమర్నాథ్ సోమవారం చింతలపూడి ఇంటికి వెళ్లి ఈ ఎన్నికలలో సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై ఇరువురు చర్చించుకున్నారు. తన విజయానికి కృషి చేస్తానని చింతలపూడి హామీ అమర్నాథ్ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమానస్పద ఆర్థిక లావాదేవీలు అక్రమంగా డబ్బు తరలింపును కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగము బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం తన ఛాంబర్ లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనుమానస్పద లావాదేవీలు అంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పక పాటించాలని, సువిధ యాప్‌లో అనుమతులు తప్పక తీసుకోవాలని కడప ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్ అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, సువిధ యాప్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ECI గైడ్ లైన్స్ ప్రకారం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తప్పక పాటించాలని కోరారు.
తల్లితండ్రులను నిరాదరణకు గురిచేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ద్వారకాతిరుమల తహసీల్దార్‌ను ఆదేశించారు. ఏలూరులో కలెక్టర్‌ను ద్వారకాతిరుమల మండలం పి.కన్నాపురానికి చెందిన చిట్టెమ్మ కలిసి తన బాధను తెలిపి, న్యాయం చేయాలని కోరింది. తన కుమారుడు నిరాదరణకు గురిచేస్తున్నాడని, ఎటువంటి ఆధారం లేదని, న్యాయం చేయాలని కోరింది.
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైనట్లు క్యాంపు ఆఫీసర్, ఆర్ఐఓ ఎస్విఎస్ గురువయ్య శెట్టి వెల్లడించారు. సోమవారం కర్నూలులోని టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో మూల్యాంకనం జరిగిందన్నారు. ప్రతిరోజు మూల్యాంకనానికి హాజరయ్యే అధ్యాపకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా క్యాంపులో ఉండాలన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 15, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు.
అనంతపురంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లో ఉన్న ఈవీఎం గోడౌన్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమి తనిఖీ చేశారు. జిల్లా స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
సైబర్ భద్రతపై యువతీ యువకులకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో 3 రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు ఆన్లైన్లో జరిగే ఈ శిక్షణకు ఆసక్తి కలిగిన వారు https://skilluniverse.apssdc.in/ అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని APSSDC అధికారులు ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
జీజీహెచ్‌లో ప్రతి రోజూ గుండె జబ్బుల ఓపీ సేవలను ఈ నెల 20వ తేదీ నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. సోమవారం ఆసుపత్రిలోని క్షయ నియంత్రణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. గుండె జబ్బుల ఓపీ సేవలు వారంలో 3 రోజులు మాత్రమే ఉన్నాయని, గుండె జబ్బుతో బాధపడే రోగులు రోజుకు 200 మంది వస్తుండటం వల్ల ప్రత్యేక ఓపీ సేవలు కేటాయించామన్నారు.
జిల్లా సరిహద్దుగా ఉన్న కంచిలి మండలంలో గాటి ముకుందపురం, ఇచ్ఛాపురం మండలంలో పురుషోత్తపురం అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక, అదనపు ఎస్పీ జి.ప్రేమ కాజల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల రాకపోకలు, తనిఖీలను కాసేపు పరిశీలించి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెక్ పోస్టు సిబ్బంది ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి ప్రాథమిక హైస్కూలులో సోమవారం కలెక్టర్ అరుణ్ బాబు పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను తనిఖీ చేశారు. సత్యసాయి జిల్లాలో మొదటి రోజు తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్డిఓ భాగ్యరేఖ, డిఇఓ మీనాక్షి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.