India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పెంచిన పింఛన్లను ప్రభుత్వం జులై నుంచి పంపిణీ చేస్తున్నందున పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టర్ వెబెక్స్ ద్వారా పింఛన్ పంపిణీ ఏర్పాట్లపై ఆయన ఎంపీడీఓలతో సమీక్షించారు. 1వ తేది ఉదయం 6 గంటలకే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు. మొదటిరోజు 90 శాతం పంపిణీ పూర్తి కావాలన్నారు.

ఆన్‌లైన్‌లో మోసపోయిన పలువురు ద్రాక్షారామం పోలీసులకు ఫిర్యాదుచేశారు. వివరాలు..కోనసీమ జిల్లా రామచంద్రపురం, అంబాజీపేట, అమలాపురం తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు బుక్కూరి ఆనంద్, మద్దాల వినయ్, మోటుపల్లి కిరణ్ GMR యాప్‌ను పరిచయం చేశారు. యాప్‌లో డబ్బులు పెడితే రెట్టింపు వస్తాయని నమ్మించారు. చాలామందికి నగదు వచ్చాయి. కొద్దిరోజులుగా నగదు రాకపోగా పోలీసులకు ఫిర్యాదుచేశారు. 1000 మంది వరకు లక్షల్లో మోసపోయారు.

వర్థమాన దర్శకుడు ప్రేమ్ సుప్రీమ్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘సిక్కోలు సిత్రాలు’కు మంచి ఆదరణ వస్తోంది. తాజా ఎపిసోడ్‌లో నటించడానికి కొత్త నటీనటుల కోసం అరసవల్లి ఆఫీసులో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ శనివారం తెలిపారు. 6 నుంచి 60 ఏళ్లలోపువారు నటనపై ఆసక్తి, అంకితభావం ఉన్న ఎవ్వరైనా ఈ ఆడిషన్లలో పాల్గొనవచ్చన్నారు.

దిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ విమానాశ్రయం నుంచి మంత్రి రామ్మోహన్ నాయుడు రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలను కలవడానికి, వారి సమస్యలు తెలుసుకోవడానికి జిల్లాకు వస్తున్నట్లు సమాచారం.

వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ప్రాతిపదికన నియామకాలు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలపతిరావు తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తామన్నారు. అభ్యర్థులు జులై మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కళాశాల ప్రిన్సిపల్‌కు అందజేయాలని ఆయన తెలిపారు.

నెల్లూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని నెల్లూరులో పెట్టనివ్వబోమన్నారు. ఈ మేరకు నాయకులు కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో లవన్నను కలిశారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. హిందువుల మాన ప్రాణాలు తీసిన దుర్మార్గుడు టిప్పు సుల్తాన్ అన్నారు. నమామి గంగే నేత మిడతల రమేశ్ తదితరులు ఉన్నారు.

జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పక్కపక్కనే కూర్చుని, ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందినవారైనప్పటికీ పక్కపక్కనే కూర్చుని ఆత్మీయంగా పలకరించుకోవడంతో సమావేశం సజావుగా సాగిందని అధికారులు తెలిపారు.

ఈవీఎం, వీవీప్యాట్ గోదాము భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సృజన తెలిపారు. గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును సీఈవో ముకేశ్ కుమార్ మీనా, కలెక్టర్ సృజన, సమన్వయ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు.

ఇండియా – సౌత్ ఆఫ్రికా ఆడుతున్న టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లైవ్ స్క్రీనింగ్ రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్య మైదానంలో లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రజలు మైదానానికి తరలివచ్చి టీమ్ ఇండియాకి మద్దతు తెలపాలని కోరారు.

నాటు కోడి, రాగి సంగటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీమ ప్రజలు ఆస్వాదిస్తూ తినే వంటకం ఇది. అయితే ఇటీవల ఏఐ సృష్టించిన వినూత్న ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే ఏఐ సృష్టించిన రాగి ముద్ద ఫొటోను ఓ నెటిజన్ నెట్టింట పోస్ట్ చేశారు. చట్ని, రాగి ముద్ద, నెయ్యితో ఉన్న ఆ చిత్రం అందరికీ నోరూరిస్తోంది. దీనికి ‘సీమరుచులను ఇంకా ప్రాచుర్యంలోకి తేవాలి’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.