India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒక లైట్, ఒక ఫ్యాన్ వాడుతున్న ఇంటికి వేలల్లో కరెంట్ బిల్లు వచ్చిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. రామభద్రపురం మండలం కొట్టక్కికి చెందిన ఇష్టం వెంకమ్మ అనే ఒంటరి మహిళ తన కుమారుడుతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం విద్యుత్ సిబ్బంది వచ్చి రీడింగ్ తియ్యగా రూ.37,484 బిల్లు వచ్చింది. దీంతో 1092 ఫిర్యాదు చెయ్యగా సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈనేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేశారు. రాత్రికి వచ్చి నగదు ఇస్తామని చెబుతున్నారట. మరికొన్ని చోట్ల ఓటర్ల జాబితా ఆధారంగా ఇప్పటికే తాయిళాల పంపిణీ పూర్తి చేసినట్లు సమాచారం. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.
ఈ నెల 13న జరగబోయే ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎక్కడైనా అల్లర్లకు పాల్పడినా, ఈవిఎం మిషన్లను తాకినా తాట తీస్తామని కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కు మూడంచెల భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలటరీ సిబ్బంది, కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
తపాల శాఖలో బీమా ఏజెంట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని.. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తపాలా సీనియర్ సూపరింటెండెంట్ జేఎన్ వసంత ఓ ప్రకటనలో కోరారు. ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తులను తిరుపతిలోని కార్యాలయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటలలోపు అందించాలన్నారు. ఈనెల 22వ తేదీన దరఖాస్తులను పరిశీలించనున్నట్లు చెప్పారు.
సంక్షేమ పథకాల పంపిణీకి హైకోర్టు అనుమతి ఇవ్వడం హర్షణీయమని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. హైకోర్టు తీర్పుతో కూటమి పార్టీలకు షాక్ ఇచ్చినట్లు అయిందని పేర్కొన్నారు. టీడీపీ ఫిర్యాదుతో సంక్షేమ పథకాలు పంపిణీ జరగకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పథకాలు కొత్తవి కాదని.. ఎప్పటి నుంచో అమలవుతున్నాయని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.
ప.గో జిల్లా భీమవరం మండలం లోసరి చెక్‌పోస్ట్ వద్ద ఉదయం రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రూ.1.87 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు రెండున్నర కిలోల బంగారం, ఐదున్నర కిలోల వెండిని సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో వాటిని సీజ్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీలోనే పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ ఇక్కడ పోటీ చేస్తుండగా.. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి ఓడిపోయారు. అదే రిజల్ట్ ఈసారి పిఠాపురంలోనూ రిపీట్ చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌కు మద్దతుగా సినీ ప్రముఖులు ప్రచారం చేస్తుండగా.. సీఎం జగన్ తన ప్రచారాన్ని పిఠాపురంలో ముగించనున్నట్లు సమాచారం. సీఎం ఫిన్షింగ్ టచ్ ఇస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందనే భావనలో ఉన్నారట.
చిత్తూరు నగరంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు వేసిన వాంటెడ్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ మంగళం శ్రీను ఫొటోను కొందరు ఎడిట్ చేశారు. సునీల్ ఫేస్ బదులు వైసీపీ చిత్తూరు MLA అభ్యర్థి విజయానంద రెడ్డిని అందులో ప్రింట్ చేశారు. దీనిపై వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
మంగళగిరిలోని ప్రధాన రోడ్డుపై ఉన్న ఓ వస్త్ర వ్యాపారి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు జరుగుతున్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ నివాసం నుంచి ఎవరినీ బయటకు రానివ్వకుండా అధికారులు విచారిస్తున్నారు. సుమారు రూ.10 కోట్ల వరకు నగదు, రూ. 25 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, ఎఫ్‌డీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 101.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా ఉరవకొండలో 23.6 మి.మీటర్లు, యాడికి 18.4, రాయదుర్గం 16.2, విడపనకల్లు 15.2, బెలుగుప్ప 13.6, కళ్యాణదుర్గం 11.6, గుమ్మగట్ట 4.8, కంబదూరు 4.6, కనేకల్ 2.0, పెద్దపప్పూరు 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.