Andhra Pradesh

News May 10, 2024

రాజంపేటలో ఉద్యోగి మృతి

image

రాజంపేట పట్టణంలోని ఎంజీ ఆర్ షాపింగ్ మాల్ వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌పై పొరుగుసేవల ఉద్యోగి ఏనుగుల హరీష్ కుమార్ పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో ట్రాన్స్ ఫార్మర్ పైనే వాలిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, అతనిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందారు. జగన్ సిద్ధం సభ కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ వైర్లు తొలగించారు. పునరుద్ధరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

News May 10, 2024

రేపు చిలకలూరిపేటకు సీఎం జగన్ సభ

image

చిలకలూరిపేటలో శనివారం సీఎం జగన్ పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. స్థానిక కళామందిర్ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు జరిగే సభలో ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని సీఎం కోరనున్నారు. గత ఎన్నికల్లో కళామందిర్ సెంటర్‌లో సభ విజయవంతమై విడదల రజిని ఎమ్మెల్యేగా గెలవడంతో సెంటిమెంట్‌గా అదే సెంటర్‌లో సభ నిర్వహించనున్నారు.

News May 10, 2024

విశాఖ: కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి

image

అచ్యుతాపురం మండలం పూడిమడకలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎజ్జల సోమునాయుడు, మైలిపల్లి రాజు చేపల చెరువు వద్ద ప్రమాదవశాస్తు కరెంట్ షాక్‌తో చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. సోమునాయుడు అవివాహితుడు కాగా.. రాజుకు పెళ్లై ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.  

News May 10, 2024

తిరుపతి: ఎన్నికల రోజు కార్మికులకు సెలవు

image

వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వేతనాలతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు ఉప కార్మిక కమిషనర్ ఎం.బాలునాయక్ ఓ ప్రకటనలో పేర్కొ
న్నారు. ఎన్నికలు జరిగే 13వ తేదీన ఉద్యోగ, కార్మికవర్గాలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి కార్మికులకు సెలవు ఇవ్వకుంటే జరిమానాతోపాటు శిక్షార్హులని పేర్కొన్నారు.

News May 10, 2024

ప.గో: ఈ MLA అభ్యర్థులిద్దరిది ఒకే ఊరు.. ఒకే పార్టీ

image

ఒకే ఊరికి చెందిన ఇద్దరు MLA అభ్యర్థులు ఒకే పార్టీ నుంచి వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. వారే శ్రీరంగనాథరాజు, పీవీఎల్ నరసింహరాజు. ప.గో జిల్లా ఉండి మండలం యండగండికి చెందిన వీరిద్దరూ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. శ్రీరంగనాథరాజు ఆచంట నుంచి.. పీవీఎల్ ఉండి నుంచి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరూ పోటీ చేయగా.. శ్రీరంగనాథరాజు పితాని సత్యనారాయణపై గెలిచారు. పీవీఎల్ మంతెన శివరామరాజుపై ఓడారు.

News May 10, 2024

వేసవికి ప్రత్యేక రైలు ఏర్పాటు

image

వేసవి సెలవులు దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కర్నూలు జిల్లా ప్రజలకు శుభవార్త చెప్పింది. ఆదోని మీదుగా సికింద్రాబాబ్-తిరుపతి(07489) ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 11వ తేదీ నుంచి రైలు అందుబాటులో ఉంటుందన్నారు. సికింద్రాబాద్‌లో రాత్రి 10:05 గంటలకు బయలుదేరి గద్వాల, రాయచూర్ మీదుగా ఆదోనికి రాత్రి 3:10 గంటలకు చేరుకుంటుందన్నారు.

News May 10, 2024

ప్రకాశం జిల్లాలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. జిల్లా మొత్తంలో ఒంగోలు ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉద్యోగులు 99.07% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉద్యోగులు అత్యధికంగా దర్శిలో 98.76% మంది ఓటేశారు. నియోజవర్గాల వారీగా చూస్తే సంతనూతలపాడు 97.52, ఒంగోలు 97.28, కొండపి 96.24, మార్కాపురం 90.89, గిద్దలూరు 94.64, కనిగిరి 93.80 శాతాలుగా నమోదయ్యాయి.

News May 10, 2024

ఫీజు అడిగితే ఫోన్ చేయండి: DEO

image

NLR: విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేటు స్కూళ్లలోని ఒకటో తరగతిలో 25 శాతం సీట్లకు ఉచిత అడ్మిషన్లు ఇప్పించినట్లు నెల్లూరు డీఈఓ రామారావు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో మొదటి విడతగా 893 మందికి అడ్మిషన్ ఇప్పించినట్లు వెల్లడించారు. వీరిని ఆయా స్కూళ్ల యాజమాన్యాలు తిరస్కరించినా, ఫీజులు అడిగినా 9493233813 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News May 10, 2024

రాజమండ్రి: మురుగు కాలవలో శిశువు మృతదేహం

image

అభం శుభం తెలియని శిశువు మృతదేహం మురుగు కాలువలో లభ్యం కావడం స్థానికులను కలచి వేసింది. రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆర్యాపురం ప్రధాన మురుగు కాలువలో మగ శిశువు మృతదేహం కనిపించడంతో పోలీసులు బయటకు తీయించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా బొడ్డుతాడు కూడా తీయని శిశువు మృతదేహాన్ని కాలువలో పడేశారని, దీనిపై విచారణ చేపట్టామని ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News May 10, 2024

కృష్ణా: 50% పైబడి ఓట్లు సాధించింది వీరే..

image

2019 ఎన్నికలలో ఉమ్మడి కృష్ణాలోని పలు స్థానాల్లో పోలైన ఓట్లలో 50% పైబడి ఓట్లు సాధించిన పలువురు నేతలు ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించారు. కొడాలి నాని (గుడివాడ)- 53.5% రక్షణనిధి (తిరువూరు)- 50.73%, ఎం.అప్పారావు(నూజివీడు)- 50.84%, కైలే అనిల్(పామర్రు)- 56.15%, మొండితోక జగన్(నందిగామ)- 51.32% ఓట్లు సాధించారు. కాగా, వీరిలో కొడాలికి జగన్ కేబినెట్‌గా పౌరసరఫరాల శాఖ మంత్రిగా చోటు దక్కింది.