Andhra Pradesh

News May 10, 2024

కృష్ణా: 50% పైబడి ఓట్లు సాధించింది వీరే..

image

2019 ఎన్నికలలో ఉమ్మడి కృష్ణాలోని పలు స్థానాల్లో పోలైన ఓట్లలో 50% పైబడి ఓట్లు సాధించిన పలువురు నేతలు ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించారు. కొడాలి నాని (గుడివాడ)- 53.5% రక్షణనిధి (తిరువూరు)- 50.73%, ఎం.అప్పారావు(నూజివీడు)- 50.84%, కైలే అనిల్(పామర్రు)- 56.15%, మొండితోక జగన్(నందిగామ)- 51.32% ఓట్లు సాధించారు. కాగా, వీరిలో కొడాలికి జగన్ కేబినెట్‌గా పౌరసరఫరాల శాఖ మంత్రిగా చోటు దక్కింది.

News May 10, 2024

ప్రకాశ: పత్రికలకు, నాయకులకు కలెక్టర్ సూచనలు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈనెల 12, 13 తేదీల్లో పత్రికల్లో ప్రచురించే ప్రకటనలకు సంబంధించి పోటీలో ఉండే రాజకీయ అభ్యర్థులు రెండు రోజులు ముందుగానే ఎంసీఎంసీ ధ్రువీకరణ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. పత్రికల యాజమాన్యాలు కూడా ధ్రువీకరణ ముందస్తు అనుమతి లేకుండా అభ్యర్థుల ప్రకటనలను ప్రచురించకూడదని సూచించారు.

News May 10, 2024

తూ.గో: ఎన్నికలు, సెలవులు.. ఫుల్ రద్దీ

image

ఒక వైపు ఎన్నికలు.. మరొక వైపు సెలవులు కావడంతో ఆర్టీసీతో పాటు రైల్వేలలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఉమ్మడి తూ.గో జిల్లాకు చెందిన వేల మంది హైదరాబాదులో ఉపాధి పొందుతున్నారు. అక్కడి నుంచి స్వస్థలాలకు వచ్చేందుకు రైల్వేతో పాటు ఆర్టీసీలోనూ టిక్కెట్లు దొరకని పరిస్థితి. ఈ నెల 11, 12, 13 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండనుంది. HYD నుంచి రాజమహేంద్రవరానికి నిత్యం 4 సర్వీసులు నడుస్తుండగా.. మరో 3 ఏర్పాటు చేశారు.

News May 10, 2024

ఎస్కేయూ దూరవిద్య ఫలితాల విడుదల

image

అనంతపురం రూరల్ మండలంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు గురువారం ఉపకులపతి హుస్సేన్ రెడ్డి విడుదల చేశారు. బీఏలో 159 మందికి గాను 104 మంది ఉత్తీర్ణులయ్యారు. బీకాంలో 22 మందికి గాను 13 మంది, బీబీఏ, బీకాం కంప్యూటర్స్‌లో 150 మందికి గాను 98 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

News May 10, 2024

జమ్మలమడుగు: షాపులో యువకుడు ఆత్మహత్య

image

జమ్మలమడుగులో మహబూబ్ బాష (20) అనే వ్యక్తి షాపులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. దేవగుడి గ్రామానికి చెందిన మహబూబ్ బాష కాపు వీధిలోని ఓ షాపులో కుట్టు మిషన్‌ మెకానిజంలో శిక్షణ పొందుతున్న షాపులో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.

News May 10, 2024

పిఠాపురంలో పవన్ రోడ్ షో.. రూట్‌మ్యాప్ ఇలా

image

పిఠాపురం నియోజకవర్గంలో నేడు పవన్ రోడ్ షో ఇలా సాగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు చిత్రాడ-జగ్గయ్యచెరువు, పాదగయ, పశువుల సంత, గొల్లప్రోలు పట్టణం, చేబ్రోలు గెస్ట్‌హౌస్ వరకు రోడ్ షో సాగనుంది. సాయంత్రం ఏకే మల్లవరం, కోనపాపపేట, మూలపేట, అమీనాబాద్, ఉప్పాడ జంక్షన్, ఎస్‌ఈజెడ్ కాలనీ, కొత్తపల్లి, యండపల్లి, కొండెవరం, పిఠాపురం బంగారమ్మ రావిచెట్టు కూడలి వరకు ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.

News May 10, 2024

అమరావతి కోసమే పశ్చిమ సీటు త్యాగం చేశాం: పవన్

image

రాజధాని అమరావతి మనుగడ కోసమే విజయవాడ పశ్చిమ సీటు బీజేపీకి త్యాగం చేశానని గురువారం జరిగిన రోడ్ షోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అంశంపై పవన్ మాట్లాడుతూ.. తొలుత పశ్చిమ సీటు జనసేనకు ఖాయమైందని, బీజేపీ అగ్రనేతలు అమరావతిలో తమ ప్రాధాన్యం కోసం ఈ స్థానం అడగడం వల్ల ఇచ్చానన్నారు. పశ్చిమ స్థానం బీజేపీకి ఇచ్చినప్పుడు.. అమరావతి, రాష్ట్ర భవిష్యత్ కాపాడాలని బీజేపీ అగ్రనేతలను కోరానన్నారు.

News May 10, 2024

11వ తేదీ సాయంత్రం ప్రచారం సమాప్తం

image

11వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ సృజన పేర్కొన్నారు. ఆ తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదని, ప్రచారం చేసినా, ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాకు సంబంధం లేని ఇతర జిల్లాల ఓటర్లు వెంటనే జిల్లా నుంచి వెళ్లిపోవాలన్నారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తామన్నారు.

News May 10, 2024

గుంటూరు: దోశలో ఇనుప బోల్ట్

image

గుంటూరులోని ఓ హోటల్లో దోశలో ఇనుప బోల్ట్ రావడంతో ఓ వ్యక్తి నిర్ఘాంతపోయాడు. గురువారం ఓ వ్యక్తి మిత్రులతో కలిసి కొరిటెపాడులోని ఓ హోటల్‌కు వెళ్లారు. దోశ ఆర్డర్ చేసి తింటుండగా అందులో ఇనుప బోల్ట్ వచ్చింది. ఈ విషయం హోటల్ నిర్వాహకులను అడిగితే పట్టించుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై ఆహార భద్రత నియంత్రణ శాఖ అధికారులకు వినియోగదారుడు ఫిర్యాదు చేశారు.

News May 10, 2024

వీరఘట్టంలో హైపర్ ఆది ఎన్నికల ప్రచారం

image

స్థానిక నియోజకవర్గ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు మద్దతుగా జబర్దస్త్‌ నటుడు హైపర్‌ ఆది పట్టణంలో గురువారం ప్రచారం నిర్వహించారు. తొలుత స్థానిక కోటదుర్గమ్మ ఆలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 7 సార్లు కరెంటు ఛార్జీలు, 3 సార్లు బస్సు ఛార్జీలు పెరిగాయన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని కోరారు.