Andhra Pradesh

News December 22, 2025

పోలీసుల అభ్యున్నతికి క్రమశిక్షణే పునాది: SP అజిత

image

పోలీసుల అభ్యున్నతికి క్రమశిక్షణే పునాది అని ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. సోమవారం ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం అయింది. దీనికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయని వాటిని అరికట్టాలంటే పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. చట్టాలపై అవగాహన అవసరమని, దేహధారుడ్యం, మనోనిబ్బరంపై దృష్టిసారించాలని ఆమె కోరారు.

News December 22, 2025

తూ.గో. ఎస్పీ నరసింహ కిషోర్‌కు DGP బ్రాంజ్ డిస్క్ అవార్డు

image

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ DGP బ్రాంజ్ డిస్క్ అవార్డును దక్కించుకున్నారు. డీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారుల సేవలను గుర్తించి సిల్వర్, బ్రోన్జ్ డిస్క్ అవార్డులను ప్రకటించారు. అందులో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ‌ కిషోర్, కడియం‌ ఎస్సై బి.నాగ దుర్గాప్రసాద్, సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీకి పోలీసు అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

News December 22, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

ఆమదాలవలస: అభివృద్ధికి విద్యుత్ రంగం కీలకం: ఎమ్మెల్యే కూన
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్ కు 37 అర్జీలు
కలెక్టర్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదుదారుల తాకిడి
బాల్య వివాహాలను అరికట్టాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: ఎమ్మెల్యే మామిడి
నందిగం: జాతీయ రహదారిపై తప్పిన పెనుప్రమాదం
పోలాకి: విద్యుత్ స్థంబాన్ని ఢీకొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు.

News December 22, 2025

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ‘ముస్తాబు’

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమం పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. వసతి గృహాలు, ముస్తబు కార్యక్రమ అమలుపై సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మిడ్ డే మీల్స్‌ను మండల ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని ఆయన సూచించారు. డీఈఓ రాజేంద్రప్రసాద్, సర్వ శిక్ష అభియాన్ పీవో వెంకట రమణ పాల్గొన్నారు.

News December 22, 2025

ప్రకాశం: బిడ్డ మోసానికి.. RDO న్యాయం

image

కన్న బిడ్డ మోసం చేస్తే.. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న ఆ తల్లికి న్యాయం చేశారు. ముండ్లమూరు మండలం కొమ్మవరంకు చెందిన రమాదేవికి ఒక కుమారుడు ఉన్నారు. కాగా రమాదేవి పేరుమీద ఉన్న 1.96 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె మృతి చెందినట్లు తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి వేరొకరికి ఆ భూమి విక్రయించాడు. రమాదేవి దీనిపై RDOకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఆర్డీవో విక్రయాన్ని రద్దుచేసి సహకరించిన అధికారులపై చర్యలకు ఆదేశించారు.

News December 22, 2025

ATP: అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.. చోరీ సొత్తు స్వాధీనం

image

బెలుగుప్ప పోలీసులు సోమవారం ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 34 గ్రాముల బంగారం, 15 తులాల వెండి, రూ.1.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ శివ వివరాల కమేరకు.. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఐదుగురు ముఠాగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. వీరు బెలుగుప్ప మండలంలో చోరీలు చేశారు. ముఠాలో ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

News December 22, 2025

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అమర్జహే బెగ్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన అమర్జహ బేగ్ మహమ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అందాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలాంబ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

News December 22, 2025

వక్ఫ్ భూముల్లో హద్దుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో వక్ఫ్ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి హద్దులు ఏర్పాటుకు వక్ఫ్ బోర్డు, సర్వే, రెవిన్యూ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ వక్ఫ్ భూములను నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం సర్వే జరిగేలా చూడాలన్నారు.

News December 22, 2025

చట్ట పరిధిలో ఫిర్యాదులను పరిష్కరించాలి: VZM SP

image

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి ప్రజల నుంచి 27 ఫిర్యాదులు అందాయి. భూతగాదాలు11, కుటుంబ కలహాలు 3, నగదు వ్యవహారాలు 2, మోసాలు1, ఇతర అంశాలు 10 ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదుల పూర్వాపరాలను పరిశీలించి, చట్ట పరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్బంగా ఆదేశించారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత పాల్గొన్నారు.

News December 22, 2025

VZM: వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

image

ఏపీఎస్పీ బెటాలియన్లకు ఎంపికైన 208 స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకొని, మారుతున్న నేరాలు మరియు శాంతిభద్రతల సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని డీఐజీ సూచించారు.