India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసిన ఘటన ఉరవకొండ మండలంలో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. మండలంలోని పెద్దముష్టూరుకు చెందిన ఓబులేసు మద్యానికి బానిసవ్వడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం గొడవపడ్డారు. భర్త తాగి ఇబ్బందులు పెడుతుండటంతో తట్టుకోలేక గొడ్డలితో దాడిచేసింది. అతడిని ఉరవకొండకు అక్కడ నుంచి అనంతపురం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
హైదరాబాద్ రాజు మన కర్నూలు ఎంపీగా పని చేశారని మీకు తెలుసా? ఇది నిజమే. హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనమైంది. ఆ తర్వాత నిజాం చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(6వ నిజాం) 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 1962లో అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. రానున్న ఎన్నికల్లో కర్నూలులో ఎవరు ఎంపీగా గెలుస్తారని మీరు భావిస్తున్నారు?
చోడవరం నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, టీడీపీ అభ్యర్థి కేఎస్ఎంఎస్ రాజు నాలుగవసారి పోటీ పడనున్నారు. 2009,2014లో చోడవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు చేతిలో కరణం ధర్మశ్రీ ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన ధర్మ శ్రీ, టీడీపీ అభ్యర్థి రాజును ఓడించారు. 2024 లో మళ్లీ వీరిద్దరూ తలపడుతున్నారు. ఈసారి గెలుపు ఎవరిదో కామెంట్ చేయగలరు.
అనంతపురం వ్యాప్తంగా 14 నియోజకవర్గాలకుగాను 11 నియోజకవర్గాల MLA అభ్యర్థులను TDP అధిష్ఠానం ప్రకటించింది. వీరిలో ఐదుగురు మెుదటిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. వారు సవిత(పెనుకొండ), సునీల్ కుమార్(మడకశిర), సురేంద్రబాబు(కళ్యాణదుర్గం), యశోదాదేవి(కదిరి), పల్లె సింధూరారెడ్డి(పుట్టపర్తి)లు ఉన్నారు. వారిలోనూ ముగ్గురు మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో మెుదటిసారి ఎవరు ఎన్నికల బరిలో గెలుస్తారో కామెంట్.
కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఇన్‌ఛార్జ్ పోలంరెడ్డి దినేశ్ రెడ్డిని కాదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి చంద్రబాబు ఖరారు చేశారు. అలకబూనిన పోలంరెడ్డి కచ్చితంగా కోవూరు నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు. దీంతో టీడీపీ పెద్దలు స్పందించి పోలంరెడ్డిని నిన్న విజయవాడలో చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అధికారంలోకి రాగానే కార్పొరేషన్ ఛైర్మన్, పార్టీ పదవి, 2027లో MLC హామీ ఇస్తానని పోలంరెడ్డికి హమీ ఇచ్చినట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన సింహాచలం ఆలయంలో ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. ఇక నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వీఐపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రోటోకాల్ దర్శనాలు, అతిథి మర్యాదలు ఉండవు. ఎంతటి వారైనా సాధారణ భక్తులు లాగే స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే సిఫార్సు లేఖలూ చెల్లవని స్పష్టం చేశారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన ఓ యువకుడి ఉదంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో వెలుగు చూసింది. పట్టణంలోని బండ్లవంకకు చెందిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ హైదరాబాద్, బెంగళూరులో నివాసం ఏర్పరచుకున్నాడు. నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ముందుగా డిపాజిట్ రూపంలో రూ.10 కోట్లకు పైగా తీసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేశారు.
కొండెక్కిన కోడి ధరలు దిగివస్తున్నాయి. విజయవాడలో గత వారం క్రితం రోజుల క్రితం వరకు మార్కెట్‌లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో చికెన్ స్కిన్లెస్ కిలో రూ.200 నుంచి రూ.220 ధర పలుకుతోంది. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గింది. దీంతో నాన్‌వెజ్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమలులో ఉన్నందున, శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన పోలీసు స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక సోమవారం తెలియజేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతకాలం స్పందన కార్యక్రమం నిర్వహించబడదని ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన బెల్లంకొండ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది వివరాల మేరకు.. న్యూ చిట్యాల నుంచి వస్తున్న బైక్, బెల్లంకొండ నుంచి చిట్యాల వైపు వెళ్తున్న బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బైక్ పై ఉన్న మమత, గుణశేఖర్‌ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. మురళీకృష్ణ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.
Sorry, no posts matched your criteria.