India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నారా చంద్రబాబు నేడు ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం అద్దంకి బస్టాండ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రికి ఉత్తర బైపాస్‌లోని బృందావనం కల్యాణ మండపంలో బస చేసి, శనివారం ఉదయం వెళ్తారు. దీంతో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు ఉండటంతో చంద్రబాబు పర్యటన జిల్లాలో ఆసక్తికరంగా ఉంది.
ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు ఈ నెల 11న 6pm నుంచి 14న సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి, ఏలూరు కలెక్టర్లు ఓ ప్రకటన విడుదల చేశారు. సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. జనం గుంపులు గుంపులుగా, అయిదుగురి కంటే ఎక్కువ మంది సమూహంగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరారు.
విశాఖలో నిర్వహించిన ప్రజాగళం పాదయాత్రలో పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు గురువారం రాత్రి విశాఖ పార్టీ కార్యాలయం వద్ద బస్సులో బస చేశారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు పార్టీ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి తెలిపారు. ఈ సమావేశానికి మీడియా ప్రతినిధులను ఆహ్వానించామన్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో ప్రలోభాలకు తెరలేచినట్లు తెలుస్తోంది. కొత్తపేటలో చీరలు, వెండి నాణేలు.. రాజమండ్రిలో ఓటుకు రూ.2,500.. కాకినాడ, పెద్దాపురం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తిలో రూ.2వేలు.. తుని, ముమ్మిడివరం, రామచంద్రపురం, రాజానగరం, పి.గన్నవరం, రాజోలులో రూ.1500.. జగ్గంపేటలో రూ.1000 చొప్పున ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో ఏకంగా రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పంచుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల నేపథ్యంలో అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 12, 13వ తేదీల్లో నిర్వహించే సంతలు బంద్ చేస్తున్నట్లు యార్డు అధికారి జయలక్ష్మి తెలిపారు. ఈ నెల 12న ఆదివారం పశువుల సంత, 13న చీనీ సంతలు నిర్వహించడం లేదని వెల్లడించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు, రైతులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ డిసిఎం సందీప్ తెలిపారు. విశాఖ-చెన్నై ఎగ్మోర్ స్పెషల్ ట్రైన్ ప్రతి సోమవారం విశాఖలో బయలుదేరి మరుసటి రోజు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుందన్నారు. ఈనెల13 నుంచి 24 వరకు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం చెన్నై ఎగ్మోర్ లో బయలుదేరి విశాఖ చేరుకుంటుందన్నారు.
కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్లలో 4 రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గురువారం ముగింసింది. పోలింగ్ సిబ్బంది, పోలీసులు, వయో వృద్ధులు, వికలాంగులు.. ఇలా అందరూ కలిపి 23,612 మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకోగా.. 20,733 (81.87శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ శుక్రవారం మంగళగిరికి రానున్నారు. ఉదయం 10:30 గంటలకు స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ ప్రదేశాన్ని ఎమ్మెల్యే ఆర్కే, పోలీస్ ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలం కోసం నిడమర్రు రోడ్డు, రైలుగేటు వద్ద గల స్థలాలను పరిశీలించారు.
బీసీ నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్యపై రాయితో దాడి చేశారు. శ్రీకాళహస్తి MLA మధుసూదన్ రెడ్డి, కృష్ణయ్య నిన్న రాత్రి ఏర్పేడులో రోడ్ షో నిర్వహించారు. ఈక్రమంలో ఎవరో విసిరిన రాయి ఎంపీ వీపునకు తగిలింది. అప్రమత్తమైన వైసీపీ కార్యకర్తలు ఎస్ఐ జిలానీకి ఫిర్యాదు చేశారు. తనపై బీసీలు దాడి చేయరని.. ఇది టీడీపీ కుట్రేనని ఎంపీ ఆరోపించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.
విశాఖ జిల్లాలో దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 16,821 మందికి పైగా దివ్యాంగ ఓటర్లు ఉంటే వీరిలో 547 మంది ఇంటి నుంచి ఓటు వేశారు. మిగిలిన 16,274 మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వేయనున్నారు. వీరి కోసం 100 వీల్ ఛైర్లు సిద్ధం చేశారు. వీరిలో 8వేల మంది అంధులు ఉన్నారు. వీరి కోసం బ్యాలెట్ పేపర్లు బ్రెయిలీ లిపిలో సిద్ధం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.