India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి తాను, తన అనుచరులు సహకరించబోమని కొత్తపల్లె గ్రామపంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. మా కుటుంబంలో ఎమ్మెల్యే చిచ్చు పెట్టాలని చూస్తున్నాడని, ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇవ్వమని, ప్రచారం చేయమని స్పష్టం చేశారు. త్వరలో తన అనుచరులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం మేరకు నడుచుకుంటానని తెలిపారు.
చిత్తూరు జిల్లా పరిధిలో 33 మంది వాలంటీర్లను విధుల నుంచి తప్పించడం కలకలం రేపుతోంది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 18 మంది, పలమనేరు మున్సిపాల్టీలో 12 మంది, గుడిపాలలో ముగ్గురిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నెల్లూరు జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నేటి నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని డీఈఓ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలన్నారు. రోజూ ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
టెక్కలిలోని ఐదు గ్రామ సచివాలయాల సిబ్బందితోపాటు, మండలంలోని పలువురు గ్రామీణ ప్రాంత పంచాయతీ కార్యదర్శులకు ఆదివారం టెక్కలి ఎంపీడీఓ కె. విజయలక్ష్మి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టెక్కలి మేజర్ పంచాయతీతో పాటు గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలుకు సంబంధించిన విధులకు గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు హాజరుకాకపోవడంపై నోటీసులు జారీ చేశారు. ఇదే అంశాన్ని టెక్కలి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నివేదించారు.
నేటినుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రకటించింది. బస్సులో పరీక్షా కేంద్రానికి రాకపోకలు సాగించే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్ ప్రజా రవాణా అధికారి నర్రా శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు.
తూ.గో జిల్లా పరిధిలో 25 పరీక్షా కేంద్రాలలో APPSC గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్, నోడల్ అధికారి ఎన్.తేజ్ భరత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 8,258 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్-1కి ఉదయం 5,056 (61.23 %) మంది హాజరయ్యారని, 3,202 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పేపర్-2కి మధ్యాహ్నం
5,007 (60.63 %) మంది హాజరు కాగా.. 3, 251 మంది గైర్హాజరయ్యారన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా కలెక్టరేట్, డివిజన్, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి శనివారం నుంచి అమలులోకి వచ్చిందని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్పందన కార్యక్రమం జరగదని తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎస్.షన్మోహన్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అర్జీలు ఇవ్వడానికి ఎవ్వరూ జిల్లా కేంద్రానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.
జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. ఆదివారం ఉదయం గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు ఆరోగ్య రాణి, సునీతతో కలిసి పరిశీలించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా ఈనెల 16న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు 32 బెంచీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ నందు 1,971 కేసులను రాజీ చేశామన్నారు. అందులో 1,760 పెండింగ్ కేసులకు పరిష్కారం చూపామని చెప్పారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా 2,356 పెట్టీ కేసులను కూడా రాజీ చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.