Andhra Pradesh

News June 28, 2024

పెన్షన్ల పంపిణీకి పక్కా ఏర్పాట్లు: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో 2,44,302 మంది లబ్ధిదారులకు జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ పీ.ప్రశాంతి వెల్లడించారు. పెన్షన్లకు సంబంధించి జిల్లాలో 9,552 క్లస్టర్లను ఉద్యోగులతో మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. పెన్షనర్లకు మంజూరైన రూ.165.13 కోట్ల నగదును ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

News June 28, 2024

పింఛన్ల పంపిణీకి పటిష్ట చర్యలు: కలెక్టర్

image

పింఛన్ల పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. పింఛన్లకు కేటాయించిన సొమ్మును శనివారం బ్యాంకుల నుంచి డ్రా చేస్తామని తెలిపారు. సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ పింఛన్ల పంపిణీపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ పాల్గొన్నారు. లబ్ధిదారుల హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను చేపట్టామని, శుక్రవారానికి పూర్తవుతుందని తెలిపారు.

News June 28, 2024

శ్రీకాకుళం: పీజీ సెట్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల హవా

image

రాష్ట్రస్థాయిలో జరిగిన పీజీ సెట్ పరీక్షలో ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ డా.ఎన్ ఎస్ ఎన్ స్వామి శుక్రవారం తెలిపారు. హిస్టరీ విభాగంలో జే నవీన్‌‌‌కు 19వ ర్యాంకు, వాణిజ్య శాస్త్ర విభాగంలో కే రసజ్ఞకు 24వ ర్యాంకు, రాజనీతి శాస్త్రంలో బి సంతోష్ కు 99వ ర్యాంకు వచ్చాయన్నారు. వారికి అభినందనలు తెలుపుతూ ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చేరాలని కోరారు.

News June 28, 2024

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష

image

మచిలీపట్నం నుంచి బదిలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్ చంద్రయ్యకు హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అకారణంగా విధుల నుంచి సస్పెండ్ చేసిన ఆర్ఓ వెంకటేశ్‌ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.2వేలు జరిమానా విధించింది.

News June 28, 2024

కృష్ణా: బీటెక్ అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా వర్శిటీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. నిర్ణీత పని దినాలు ఉండేలా క్యాలెండర్ తయారు చేసినట్లు వర్శిటీ పేర్కొంది. 2025 జనవరి, జూన్ నెలల్లో ఫస్టియర్ విద్యార్థులకు ఒకటి, రెండవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయంది. క్యాలెండర్ పూర్తి వివరాలకు కృష్ణా వర్శిటీ https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News June 28, 2024

విశాఖ రానున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు 

image

స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయ్యన్నపాత్రుడు తొలిసారిగా 29న విశాఖ వస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.15 గంటలకు హోటల్ దసపల్లాకు వెళ్లి సందర్శకులను కలుస్తారు. అక్కడే లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు అనకాపల్లి నూకాంబికను దర్శించుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

News June 28, 2024

VZM: ‘భూ సేకరణకు త్వరలో నోటిఫికేషన్’

image

విజయనగరం జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ప్రధానంగా జాతీయ రహదారుల నిర్మాణంపై చర్చ జరిగింది. పెదమానాపురం వద్ద గ్రామ కంఠానికి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని ఆర్డీవో సూర్యకళ కలెక్టర్ అంబేడ్క‌ర్‌కు వివరించగా… వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన ఆదేశించారు.

News June 28, 2024

ఒంగోలు: ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు

image

ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ఐటిఐ కళాశాల స్కిల్ హబ్ సెంటర్‌లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ యాదవ్ తెలిపారు. ఆసక్తిగల యువకులు వచ్చే నెల 4వతేదీలోగా ఐటిఐ కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, సోలార్ ప్యానల్ టెక్నీషియన్ కోర్సులకు శిక్షణ అందిస్తామన్నారు.

News June 28, 2024

విశాఖ పోలీస్ కమిషనర్‌కు బదిలీ

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్‌కు బదిలీ అయింది. ఆయనను సీఐడీ అడిషనల్ డీజీపీగా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సీపీ పోలీస్ కమిషనర్‌గా శాంతి భద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చీని ప్రభుత్వం నియమించింది. ఇటీవల విశాఖ కలెక్టర్‌గా పని చేసిన మల్లికార్జునను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

News June 28, 2024

మంత్రి వాసంశెట్టి సుభాష్ అసహనం

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌లను మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతులు, భోజన నాణ్యత, శానిటేషన్ తదితర అంశాలను పరిశీలించారు. వివిధ రికార్డులను తనిఖీ చేసి సిబ్బందిని వివరాలు అడిగారు. సరైన ప్రమాణాలు పాటించడం లేదని గ్రహించి సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే తీరు మార్చుకోవాలని ఆదేశించారు.