India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 372 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్ట్‌తో పాటు మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామన్నారు. జిల్లాలో 68 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల పోలింగ్‌కు సమయం ముంచుకొస్తుండటంతో రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి తాయిలాలకు తెర లేపుతున్నారు. పగలు ప్రచారం చేసి రాత్రిళ్లు నగదు పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గాలను ఎంచుకొని వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. – మీ వద్ద జరుగుతోందా..?
ఎన్నికల దృష్ట్యా ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
జమ్మలమడుగు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆర్టీపీపీ కాలనీలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వంపైన నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసి అభివృద్ధిని అంతం చేసిందని విమర్శించారు. ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వని ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఏలూరు జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో కొవ్వూరు నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో సినీ నటుడు శివాజీ, హీరోయిన్ శ్రీ రాపాక పాల్గొన్నారు. గతంలో శ్రీ రాపాక గోపాలపురం నియోజకవర్గం నుంచి సీఎం జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా కూటమి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్ద గురువారం రాత్రి టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ముదివేడు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి కథనం.. ముదివేడు గ్రామం, సాయిబులపల్లెకు చెందిన మహబూబ్ బాషా(35), సొంత పనిపై ముదివేడు క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లగా టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితుణ్ని మదనపల్లెకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ తెలిపారు.
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు ట్రైన్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.12749 మచిలీపట్నం- బీదర్ (మే 9 నుంచి11), నం.12750 బీదర్- మచిలీపట్నం (మే 10 నుంచి12) ట్రైన్లకు ఒక స్లీపర్ కోచ్, ఒక థర్డ్ ఏసీ కోచ్ అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదనపు బోగీల ద్వారా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి బెర్తులు లభిస్తాయన్నారు.
ఉదయగిరిలో టీడీపీ తరఫున ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కోసం తను నమ్మిన సిద్ధాంతం కోసం ఉమ్మడి కూటమితో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యానన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారని, అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మండలంలోని తిప్పలకట్ట దగ్గర కృష్ణానదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం దొరికినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు కృష్ణానదిలో సుమారు 70ఏళ్ల వయస్సు ఉన్న మగ శవం వుండటంతో వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు దేహాన్ని పోలీస్ స్టేషన్‌లో తెలపాలని ఎస్సై వెల్లడించారు.
ఎన్నికలొచ్చాయంటే పోటీలో నిలిచే నాయకులంతా తమకే ఓటు వేసి గెలిపించాలంటూ ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కొందరు ఓటు వేయండని నగదు సైతం పంపిణీ చేస్తారు. అయితే ప.గో. నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామానికి చెందిన మొహమ్మద్ జాన్ అలైజా అనే యువకుడు ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అనే కరపత్రం ఇంటిగేటుకు అతికించాడు. నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకుడికి తమ కుటుంబం ఓటు వేస్తుందని చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.