Andhra Pradesh

News May 9, 2024

విశాఖ: కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా శశిథరూర్ ప్రచారం

image

ఏఐసీసీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ నగరంలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. శుక్రవారం ఆయన పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు విశాఖ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

News May 9, 2024

సంతమాగులూరు: అదుపుతప్పి మిర్చి లారీ బోల్తా

image

మండలంలోని పాత మగులూరు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు మిర్చి యార్డుకు మిరపకాయలు తీసుకొని వెళ్తున్న మినీ లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. అందులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే రహదారిపై మినీ ఆటో బోల్తాపడడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లారీని పక్కకు తీసి ట్రాఫిక్‌ని క్లియర్ చేశారు.

News May 9, 2024

కోడూరు: ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి

image

ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు భద్రావతి నగర్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మడి తొట్టి సుబ్బ నరసయ్య (27) ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం సాయంత్రం జడ్పీ హై స్కూల్ మిద్దె పైన పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకోవడంతో మంటలు అంటుకొని తట్టుకోలేక కిందకు దూకడంతో మృతి చెందారు. పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 9, 2024

విజయవాడ: దేవానందరెడ్డి సేవలు భేష్

image

రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల మూల్యాంకనంతోపాటు వేగవంతమైన ఫలితాలు విడుదలలో పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి పాత్ర ప్రశంసనీయమని ఉపాధ్యాయుడు వెంకటేశ్ అన్నారు. దేవానందరెడ్డి పరీక్షల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరీక్షల విభాగం మొత్తాన్ని ప్రక్షాళన చేశారన్నారు. సమస్యాత్మకమైన సెంటర్లపై దృష్టి పెట్టడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు.

News May 9, 2024

తాళ్ళపూడిలో నటుడు శివాజీ ప్రచారం

image

ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సినీనటుడు శివాజీ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన తాళ్ళపూడి మండలం గజ్జరంలో కొవ్వూరు కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి రాకపోతే ఇండియా మ్యాప్‌లో ఏపీ కనుమరుగవుతుందన్నారు.  

News May 9, 2024

ఉదయగిరి: రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్

image

ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాళ్లో విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్లతో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కే నాగమల్లేశ్వర్ రెడ్డి సమీక్షించారు. ఉదయగిరిలోని సెబ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 11వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు.

News May 9, 2024

గరుడబల్లి  రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం లభ్యం

image

విజయనగరం జీఆర్పీ పరిధిలో గజపతినగరం, గరుడబిల్లి రైల్వే ట్రాక్ మధ్యలో గుర్తు తెలియని మృతదేహం విజయనగరం రైల్వే పోలీసులు గురువారం గుర్తించారు. మృతుడు వయస్సు సుమారు 60 నుంచి 65 సంవత్సరములు ఉంటుందని వారు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 9, 2024

10న కడపలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సెలెక్షన్స్

image

కడప నగరంలోని రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానంలో 10వ తేదీ ఉదయం, సాయంత్రం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-3కి క్రికెట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఏసీఏ సౌత్ జోన్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ACA//APL player registration సైట్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.

News May 9, 2024

కృష్ణా: SSC పాసైన విద్యార్థులకు ముఖ్య గమనిక

image

2024- 25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 19 ఏకలవ్య రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల SSC పాసైన గిరిజన/ గిరిజనేతర అభ్యర్థులు ప్రవేశాలకై https://aptwgurukulam.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు తాడేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News May 9, 2024

పత్రికలలో ప్రకటనలకు అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

ఎన్నికల సందర్భంగాఈ నెల 12 ,13 రెండు రోజులు పత్రికలలో వేసే ప్రకటనలకు పోటీ చేసే అభ్యర్థులు రెండు రోజులు ముందుగా ఎంసీఎంసీ ధృువీకరణ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పత్రికల యాజమాన్యాలు కూడా ఎంసీఎంసీ ముందస్తు అనుమతి లేకుండా తమ పత్రికలలో రాజకీయ పార్టీల, అభ్యర్థుల ప్రకటనలు ప్రచురించరాదన్నారు.