India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రచార గడువు ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో పిఠాపురంలో రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ రోడ్‌షో చేపట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 మండలాలు, 2 మున్సిపాలిటీలు కవర్ అయ్యేలా ప్లాన్ చేశారు. భారీ బహిరంగ సభ సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఎల్లుండి పిఠాపురంలో ప్రచార ముగింపు సభ నిర్వహించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాచర్ల పట్టణంలో రేపు నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు నేరేటి వీరాస్వామి యాదవ్ కోరారు. గురువారం మాచర్లలో విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1989లో పసల పెంచలయ్య(కాంగ్రెస్) S.ప్రకాశం(TDP)పై పోటీ చేసి 1502 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో ఆయన అల్లుడు కిలివేటి సంజీవయ్య(వైసీపీ) పరసా వెంకటరత్నం(టీడీపీ)పై పోటీ చేసి 61,292 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో మామ అత్యల్ప మెజార్టీతో గెలవగా.. అల్లుడు అత్యధిక మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.
ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం నియోజవర్గంలో రేపటి సీఎం పర్యటన వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిగూడెం పట్టణానికి సీఎం జగన్ రావాల్సి ఉంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మంగళగిరి, నగరి ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమానికి హాజరు కావలసి ఉంది. దీంతో తాడేపల్లిగూడెం పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
చందనోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. వివిధ జిల్లాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. గురువారం సాయంత్రానికి భక్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇక్కడికి వస్తున్న భక్తులు అందరూ తెల్లవార్లు ఇక్కడే ఉండి ఉదయం అప్పన్న నిజరూప దర్శనం చేసుకుని తిరిగి వెళతారు.
చీపురుపల్లిలోని బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలని ఎద్దేవా చేశారు. సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం MLA, మేనల్లుడు శ్రీను జడ్పీ ఛైర్మన్, మరో తమ్ముడు బడ్డుకొండ నెల్లిమర్ల MLA, అతనికి చీపురుపల్లి, భార్య విశాఖ ఎంపీ అభ్యర్థి అన్నారు. ఉత్తరాంధ్రలో సమర్థులు లేరా అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చినందుకు ఉత్తరాంధ్రను దోచుకున్నా మాట్లాడట్లేదన్నారు.
సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో ఈనెల 10వ తేదీన జరిగే చందనోత్సవానికి (నిజరూప దర్శనం) ఏర్పాట్లు పూర్తి చేశారు. సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని దర్శించుకునేందుకు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీనికి తగ్గట్టుగా క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు మజ్జిగ, తాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.
పల్లెవెలుగు బస్సులో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులుకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్లు, కండక్టర్లు , ఇతర సిబ్బందిలో స్వీప్ యాక్టివిటీ, ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అనంతరం సత్తెనపల్లి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించి సంతోషం వ్యక్తపరిచారు. ప్లకార్డులతో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.
హైదరాబాద్ అమీర్‌పేట్ సమీపంలోని మధురానగర్ PS పరిధిలో దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NTR జిల్లా గంపలగూడెం వాసి రవి (45) HYDలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. స్థానిక ఇంజినీర్స్ కాలనీలో భార్య అశ్విని, 8 ఏళ్ల కూతురితో కలిసి ఉంటున్నాడు. ఇంట్లో రవి ఒంటరిగా ఉన్న సమయంలో ఓ అగంతుకుడు వచ్చి రవిని రాడ్‌తో కొట్టి హత్య చేశాడు. మృతదేహంపై పసుపు, కారం చల్లి వెళ్లాడు. కేసు నమోదైంది.
తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు తిరుపతి ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మీ వెల్లడించారు. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులన్నారు. iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 10.
Sorry, no posts matched your criteria.