Andhra Pradesh

News May 9, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్ 

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC) నుంచి ఖుర్దా రోడ్(KUR) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 10న నం.07129, మే 11న నం.07131 మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని అన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరుతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.  

News May 9, 2024

తూ.గో.: పిడుగులు పడతాయి జాగ్రత్త

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం రాష్ట్ర విపత్తుల నివారణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ, బిక్కవోలు, రాజమండ్రి ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు మెసే‌జ్‌లు పంపింది. 

News May 9, 2024

కురుపాంలో దోచే డబ్బులు తాడేపల్లికి: చంద్రబాబు

image

జగన్ మందు బాబుల రక్తం తాగాలనుకున్నాడని కురుపాం సభలో చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలో రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయ్యిందని ఆరోపించారు. నాసిరకం మందు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారని విమర్శించారు. కురుపాం కిల్లీ కొట్టులో ఉన్న ఆన్‌లైన్ పేమెంట్.. మందుషాపులో ఎందుకు లేదని ప్రశ్నించారు. కురుపాంలో దోచే డబ్బులు తాడేపల్లికి పంపిస్తున్నారని విమర్శించారు.

News May 9, 2024

ప.గో.: రేపు చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 10వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు ఉండి జంక్షన్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు చింతలపూడి పట్టణంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారని నాయకులు తెలిపారు.

News May 9, 2024

విశాఖలో ఓటు వేస్తే.. హెయిర్ కట్ ఫ్రీ

image

దేశ తలరాతను మార్చే ఓటు విలువను తెలియజేస్తూ కంచరపాలెంకు చెందిన ఓ సెలూన్ షాపు వినూత్న కార్యక్రమం చేపట్టింది. కంచరపాలెంకు చెందిన ఓ షాపు యజమాని ఓటేసే వారకి ఉచితంగా హెయిర్ కట్ చేస్తామని ప్రకటించారు. ఓటుకు ఉన్న ప్రాముఖ్యత తెలియచేయాలనే ఉద్దేశంతో తన బృందంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

News May 9, 2024

శ్రీకాకుళం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

పోలింగ్ ముందు 48 గంటల నుంచి ఎన్నిక ముగిసే వరకు ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. ఐదుగురికి మించి ఒకే చోట గుమికూడరాదన్నారు. సరిహద్దు చెక్ పోస్టులను మరింత పటిష్ఠం చేసి ఇతర నియోజకవర్గ వాహనాలు ప్రవేశించకుండా డబ్బు, మద్యం, కానుకలు వంటివి అక్రమ రవాణా జరగకుండా ముమ్మర తనిఖీ చేయాలన్నారు.

News May 9, 2024

ఏలూరు: సైబర్ మోసం.. రూ.53 వేలు పోగొట్టుకున్న నర్సు

image

పెదపాడు మండలం వట్లూరుPHCలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న పావనికి ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. ‘ముంబయి నుంచి మాట్లాడుతున్నామని.. సైబర్‌క్రైం పోలీసులమని చెప్పాడు. మీపై కేసులు ఉన్నాయని అరెస్ట్ చేసేందుకు వస్తున్నామన్నాడు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బుపంపించాలని’ ఖాతా నంబర్ మెసేజ్ చేశాడు. భయంతో పావని రూ.53 వేలు పంపించింది. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించగా ఆమె ఖాతాను హోల్డ్ చేయించి కేసు నమోదుచేశారు.

News May 9, 2024

చిత్తూరు: ఎన్నికల విధులపై అవగాహన

image

చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్‌లో ట్రైనీ ఐపీఎస్‌లకు ఎస్పీ మణికంఠ, ప్రొబెషనరీ డీఎస్పీ పావన్ కుమార్ ఎన్నికల విధులపై గురువారం అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ గురించి వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పారు. వాహనాల తనిఖీ, నగదు రవాణా అరికట్టడం, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ అంశాలను వివరించారు.

News May 9, 2024

జి. కొండూరులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

మండలంలోని చెరువు మాధవరం రైల్వే ట్రాక్ వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 55 వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు జి.కొండూరు పోలీస్ స్టేషన్‌లో తెలియచేయాలని కోరారు. అనంతరం మృతదేహాన్ని జి. కొండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

News May 9, 2024

కళ్యాణదుర్గం సిద్ధమా?: సీఎం జగన్

image

సీఎం జగన్ కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు. కళ్యాణదుర్గం సిద్ధమా? అని ప్రజలను పలకరించగానే కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ‘మధ్యాహ్నం 2 గంటలు కావొస్తోంది. ఎండలు చూస్తే తీవ్రంగా ఉన్నాయి. అయినా ఏ ఒక్కరూ ఖాతరు చేయలేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలను పంచిపెడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకు, నా ప్రతి సోదరుడికి రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నా’అని జగన్ అన్నారు.