India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రకాశం జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శిగా జరుగుమల్లి జడ్పీ పాఠశాల హెచ్ఎం ఎం.శ్రీనివాసరావును నియమిస్తూ డీఈవో సుభద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆస్థానంలో ఉన్న ఉప్పలపాడు పాఠశాల హెచ్ఎం వెంకట్రావును రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో జరిగే అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలు తన అధీనంలో ఉంటాయని తెలిపారు.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి నెల్లూరు జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా, అతని తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడనే అంశంపై పల్నాడులో చర్చ జరుగుతోంది. మాచర్ల రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వెంకట్రామిరెడ్డి మే 22 నుంచి పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడితో పాటు పిన్నెల్లి అనుచరుడు కిశోర్ జాడ కూడా కొద్ది రోజులుగా తెలియలేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

నెల్లూరు జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నెల్లూరు నగర ట్రాఫిక్ డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు గత ఏడాది మొత్తం 883 ప్రమాదాలు జరగగా ..998మంది క్షతగాత్రులయ్యారు, 408మంది మృతి చెందారు. వీటిలో ఎక్కువగా తలకు బలమైన గాయాలు కావడం వల్లే మృతి చెందినట్లు నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనదారులు పూర్తి స్థాయిలో హెల్మెట్ ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

అనంతపురం జిల్లాలో పింఛన్ పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 2,89,508 మందికి జులై 1న పింఛన్ అందజేయనున్నారు. పెంచిన ప్రకారం జులై నెలకు రూ.126.81 కోట్లు, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రూ.వెయ్యి అదనం కోసం రూ.70.62 కోట్లు కలిపి మొత్తంగా రూ.197.44 కోట్లు అందజేయనున్నారు. సచివాలయం సిబ్బంది జులై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీని ప్రారంభిస్తారు.

ప్రజలు ఇంటితో పాటు, పరిసరాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ సుహాసిని ప్రకటనలో తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ముందస్తుగా తీసుకునే చర్యల గురించి వివరిస్తున్నామన్నారు. బయట ఆహారాలు తినకుండా, ఇంట్లో తయారు చేసిన వేడి వేడి ఆహారం తీసుకుంటే మంచిదన్నారు.

నంద్యాల జిల్లాలో చిరుత చిక్కింది. శిరివెళ్ల మండలం పచ్చర్ల టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బోనులోకి చిరుతపులి వెళ్లింది. దీంతో కొద్ది రోజులుగా భయాందోళనకు గురైన పచ్చర్ల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుత పులిని సుదూర అటవీ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుత దాడిలో పచ్చర్లకు చెందిన మాజీ ఉప సర్పంచి షేక్ మెహరూన్‌బీ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ నెల 30 నుంచి విశాఖపట్నంలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి క్వాడిట్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే విజయనగరం జిల్లా జట్టు ఎంపిక నిర్వహించారు. గురువారం విజ్జీ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో అండర్- 12, అండర్- 13, అండర్- 14 విభాగాల్లో బాల బాలికలను ఎంపిక చేశారు. జిల్లాలోని 8 మండలాల నుంచి 50 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.

విశాఖ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 29వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా న్యాయమూర్తి ఎ.గిరిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు, సివిల్, బౌన్స్, బ్యాంకింగ్, మోటర్ ప్రమాదాల నష్టపరిహారం కేసులు జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో డెవలప్మెంట్ ఆఫ్ నానో ఎన్క్యాప్సిలేషన్ నాచురల్ ఆంటీ మైక్రో బయాల్స్ ఫర్ ఫుడ్ ప్రిజర్వేషన్ నందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొఫెసర్ ఉమామహేశ్వరి పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్‌ను చూడాలని సూచించారు.

మరమ్మతుల నిర్వహణ కోసం కొండాయపాళెం రైల్వేగేటును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జులై 3వ తేదీ వరకు ఆ మార్గంలో రాకపోకలు జరగవని సూచించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొని ..అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.