India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు జగన్ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తుందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజనీతో కలిసి గురువారం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. జగన్ పాలనకు ప్రజలు మరోసారి మద్దతు తెలిపాలని సూచించారు.
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి నిజరూప దర్శనం ఏడాదిలో ఒక్కరోజే లభిస్తుంది. నిజరూపంలో స్వామిని దర్శించుకునేందుకు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం వేకువజామున వెండి బొరుగులతో స్వామిపై ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప భరితుడిని చేస్తారన్నారు. తర్వాత పరిమిత సంఖ్యలో మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించి మిగిలిన వారికి నీలాద్రి గుమ్మం నుంచి లఘు దర్శనం కల్పిస్తారు.
టీడీపీతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పల నాయుడు, నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి లోకం మాధవి అన్నారు. గురువారం నెల్లిమర్ల పట్టణంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. నెల్లిమర్ల అసెంబ్లీ NDA ఉమ్మడి కూటమి అభ్యర్థి మాధవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కళ్యాణదుర్గం రానున్నారు. ముందుగా కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సభాస్థలికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం రాజంపేట బయలుదేరి వెళ్తారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాల్లో బుధవారం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళిపై జిల్లా ఎలక్షన్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ ఆధ్వర్యంలో పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
విశాఖలో అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రచారాలకు సినీ గ్లామర్ తోడవుతుంది. అనకాపల్లి BJP ఎంపీ అభ్యర్థి CM రమేశ్, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్లకి చిరంజీవి ఇప్పటికే మద్ధతివ్వగా.. NDA అభ్యర్థుల తరఫున జానీమాస్టర్, జబర్దస్త్, బుల్లితెర నటులు ప్రచారం చేస్తున్నారు. అటు వైసీపీ తరఫున భీమిలిలో అవంతి, నర్సీపట్నంలో గణేశ్‌కు మద్ధతుగా యాంకర్ శ్యామలా, హీరో సాయిరాం శంకర్ ప్రచారం చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 11న రెండో శనివారం, 12న ఆదివారం, ఎన్నికలు కారణంగా 13న సోమవారం సెలవులు కావడంతో ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారంతా తిరిగి స్వగ్రామాలకు చేరుతున్నారు. ఉమ్మడి జిల్లావాసులు హైదరాబాద్‌కి ఎక్కువగా రాకపోకలు సాగించే గోదావరి, ఫలక్‌నుమా, గౌతమి ఎక్స్‌ప్రెస్‌ల్లో 400కు పైగా వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి.
2024 అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారం మరింత ఉద్ధృతం చేశాయి. గ్రామాల్లో ప్రచారానికి వచ్చి ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఆయా పార్టీల మేనిఫేస్టోల గురించి నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. పోలింగ్ రోజు ఓటు ఎవరికి వేస్తారో అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఓటర్లు చివరకు ఏ పార్టీకి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.
ఎండలు, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు వర్షాలతో చల్లబడ్డారు. బుధవారం నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవగా.. కర్నూలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. అవుకు మండలంలో 102.మి.మీ, చాగలమర్రి 76.4, శిరివెళ్ల 72, గడివేముల 65.2, బండి ఆత్మకూరు 64.2, వెలుగోడు 52.2, పాణ్యం 51.4, గూడూరు 39.6, తుగ్గలి 36, పత్తికొండ 15.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 13,854 మంది
తపాలా బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా 13,177 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ మేరకు సౌలభ్య కేంద్రాల్లో సోమ, మంగళవారాల్లో 12,773 మంది ఓటు వేశారన్నారు. అలాగే బుధవారం మరో 404 మంది ఆర్వో కార్యాలయాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.