India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

క్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గంలో గుంటూరు చర్చిలు నడుస్తున్నాయి. AELC ఆధ్వర్యంలో విద్య, వైద్య సేవలు అందుతున్నాయి. 1842లో రెవరెండ్ హయ్యర్ స్థాపించిన సెయింట్ మ్యాథ్యూస్ ఈస్ట్ ప్యారిస్ చర్చికి 150ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అలాగే 1905లో వెస్ట్ ప్యారిస్ చర్చిని నిర్మించారు. నార్త్ ప్యారిస్ చర్చి 60ఏళ్లుగా సేవలందిస్తోంది. 1940లో ఏర్పాటైన గుంటూరు మేత్రాసనం ఆధ్వర్యంలో పాఠశాలలు, ఆసుపత్రులు నడుస్తున్నాయి.

విశాఖలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ‘నో హెల్మెట్ – నో ఫ్యూయల్’ (No Helmet – No Fuel) విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ కే.ప్రవీణ్ కుమార్ చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోస్తారని స్పష్టం చేశారు. వాహనదారుల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

నెల్లూరు జిల్లాలో చాలా ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ మిత్ర ద్వారా అన్ని సేవలు అందిస్తోంది. ప్రజలు 9552300009 నంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్‌లో హాయి అని పెడితే మీకు కావాల్సిన సేవలు చూపిస్తుంది. కొత్త రేషన్ కార్డులు, అందులో మార్పులు, చేర్పులకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. 73373 59375 నంబర్‌కు రైతులు కాల్ చేస్తే ధాన్యం కొనుగోలు వివరాలు సైతం తెలుసుకోవచ్చు.

బాపట్లలో జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో దుద్దుకూరుకు చెందిన మల్లిపూడి చందు, తాడిపూడికి చెందిన వేములూరు కార్తీక్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్థులు వీరిని ఘనంగా అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తామని యువకులు ధీమా వ్యక్తం చేశారు.

కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరు మైనార్టీ నేత జబిబుల్లాను పార్టీ అధిష్టానం నియమించింది. ప్రొద్దుటూరుకు చెందిన జబిబుల్లా టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైఎస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల స్థానిక టీడీపీ శ్రేణులు, మైనార్టీ నేతలు అభినందనలు తెలిపారు. తన నియామకానికి మద్దతునిచ్చిన, సహకరించిన స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి జబిబుల్లా కృతజ్ఞతలు తెలిపారు.

చిత్తూరు జిల్లాలో ఆదివారం 88.36% చిన్నారులకు పల్స్ పోలియో వేసినట్లు DIO హనుమంతురావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు 2,21,502 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి 142 రూట్లలో 212 వాహనాల ద్వారా పోలియో చుక్కలను పంపిణీ చేశారు. 1415 బూత్‌ల పరిధిలో 5,800 మంది సిబ్బందితో ఆదివారం 2,94,600 వ్యాక్సిన్ కిట్లు వినియోగించారు. జిల్లాలో ఆదివారం 1,84,648 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

మాజీ CM వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తణుకుకు చెందిన సూక్ష్మ కళాకారుడు భవిరి నాగేంద్రకుమార్ తన ప్రతిభ చాటుకున్నారు. 0.030 పాయింట్ల బంగారంతో బియ్యపు గింజపై జగన్ పేరును తీర్చిదిద్దారు. సుమారు మూడు గంటల సమయం వెచ్చించి దీనిని సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. నాగేంద్ర కుమార్ నైపుణ్యాన్ని స్థానికులు, వైసీపీ నేతలు మెచ్చుకున్నారు.

TDP కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా ఇప్పటివరకు కొనసాగిన శ్రీనివాసులరెడ్డిని తిరిగి కొనసాగించలేదు. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి.
➤ జిల్లాలో కడప నియోజకవర్గానికే పరిమితం కావడం
➤ ఇక్కడా నాయకుల సమన్వయంలో విఫలం
➤ ముక్కుసూటిగా ప్రవర్తించడం
➤ కడప ఎమ్మెల్యేపై వ్యతిరేకత
➤ పార్టీలో ఒకరికే పదవి అని లోకేశ్ చెప్పడం
➤ యువకులను ముందుకు తీసుకురావలన్న TDP ఆలోచన.

నెల్లూరు రూరల్ కొత్త LNTకి చెందిన యుగంధర్ రెడ్డి(21) గూడూరు నారాయణ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీనివాససత్రం బీచ్‌కు వెళ్లాడు. అలల తాకిడికి యుగంధర్ రెడ్డి కొట్టుకెళ్లి చనిపోయాడు. అలాగే నెల్లూరు సిటీకి చెందిన హర్షసాయి(19) ఒంగోలులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కొత్తపట్నం బీచ్‌కు వెళ్లాడు. అలల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి హర్షసాయి వెళ్లి చనిపోయాడు.

కడప జిల్లా వైసీపీలో వర్గపోరు కనిపిస్తోంది. నిన్న YS జగన్ పుట్టినరోజు వేడుకల్లో కూడా నేతలు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ఈ చర్చకు తావిస్తోంది. జమ్మలమడుగులో ఓ నేత ఏర్పాటు చేసిన విందులో ముందుగా రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. అప్పుడు అక్కడే ఉన్న సుధీర్ రెడ్డి… ఆయన వెళ్లాక అక్కడికి వెళ్లారు. ఇక బద్వేల్‌లో కూడా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, విశ్వనాథరెడ్డిలు కూడా వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.