Andhra Pradesh

News June 28, 2024

భీమవరం: RTC బస్సు ఢీకొని బీటెక్ స్టూడెంట్‌ మృతి

image

భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన కోయ రాజేంద్రరామ్(20) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రామ్ భీమవరం నుంచి తుందుర్రు వెళ్తుండగా.. తాడేరు వద్ద ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడి తమ్ముడికి తీవ్ర గాయాలు కావడంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై భీమరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 28, 2024

ప్రత్తిపాడు: సమాచార హక్కు కార్యకర్తపై కత్తులతో దాడి

image

ఇళ్ల కూల్చివేత విషయంలో సమాచార హక్కు కార్యకర్త, టీడీపీకి చెందిన కమ్మ శివప్రసాద్‌పై ఇద్దరు కలిసి కత్తులతో దాడి చేసిన ఘటన ప్రత్తిపాడులో గురువారం చోటుచేసుకుంది. తాగునీటి చెరువు ఆక్రమణకు గురైందంటూ పదేళ్ల క్రితం శివప్రసాద్ గొట్టిపాడుకు చెందిన ఓ వ్యక్తిపై లోకయుక్తలో ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలోని ఇళ్ల కూల్చివేతకు ఆదేశాలు రావడంతో దీనికి కారణం శివప్రసాద్ అంటూ కత్తులతో దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 28, 2024

ఫోన్ తీశాడని ఆరోపణలు.. గడ్డి మందు తాగిన బీటెక్ స్టూడెంట్

image

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో బీటెక్ విద్యార్థి గడ్డి మందు తాగాడు. SI పవన్ వివరాల ప్రకారం.. శివగంగాధర్ అనే యువకుడు చేబ్రోలులోని కాలేజ్‌లో బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నాడు. కాలేజ్‌లో ఫోన్ పోగా.. శివ తీశాడని ఆరోపిస్తూ ఇంటికి పంపేశారు. అలాగే ఎస్సైనంటూ సీనియర్లు శివను కొట్టారని, అందుకే ఆత్మహత్యాయత్నం చేశాడని అతడి మామ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News June 28, 2024

మచిలీపట్నం వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతోందని మచిలీపట్నంలో నిర్మిస్తున్న YCP కార్యాలయానికి బుధవారం నోటీసులిచ్చారు. YCP జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో కొత్త భవనం వద్దకు వెళ్లి అక్కడున్న సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. 1000 చదరపు గజాల విస్తీర్ణం దాటిన భవనాలకు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలని, అలా జరగనందునే నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు.

News June 28, 2024

కడప: ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

image

బి.కోడూరు మండలంలోని రాజుపాలెం దళితవాడకు చెందిన మున్నెల్లి అనూష గురువారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. పోరుమామిళ్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఆమె వేసవి సెలవుల్లో వనిపెంటలోని పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక అబ్బాయితో పరిచయం పెంచుకుంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.

News June 28, 2024

చిత్తూరు జడ్పీ పూర్వ సీఈవోపై వేటు

image

చిత్తూరు జడ్పీ సీఈవోగా గతంలో పని చేసిన ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. బైరెడ్డిపల్లె ఎంపీడీవోగా ఉన్న ఆయనకు సీఈవోగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన అనేక అక్రమాలు చేశారని టీడీపీ నేతలు నరసింహులు, గీర్వాణి ఆరోపించారు. ఈక్రమంలో విచారణ చేపట్టిన అధికారులు అక్రమాలు నిజమేనని నిర్ధారించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ పంచాయతీ రాజ్ కమిషనర్ కన్నబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

News June 28, 2024

ప్రకాశం: సస్పెండ్ అయిన ఉద్యోగులు మళ్లీ విధుల్లోకి

image

పోస్టల్ బ్యాలెట్‌లకు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలోచ్చిన ముగ్గురు టీచర్లతో పాటు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందున వేటుపడిన మరో టీచర్‌ను మళ్లీ వీధుల్లోకి తీసుకున్నట్లు డీఈఓ సుభద్ర వెల్లడించారు. దర్శి, ముండ్లమూరు మండలాల్లో పనిచేసే ముగ్గరు టీచర్లు , సింగరాయకొండలోని పాకాల జడ్పీలో పనిచేస్తున్న టీచర్‌ను విధుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. వారిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని ఆమె తెలిపారు.

News June 28, 2024

కర్నూలు జిల్లాలోని అటవీ భూములపై డిప్యూటీ సీఎం ఆరా

image

కర్నూలు జిల్లాలోని అటవీ భూములపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కర్నూలు డి.ఎఫ్.ఓ. శ్యామల, నంద్యాల డి.ఎఫ్.ఓ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి సుబ్బరాయుడు ఇందుకు వివరాలను డిప్యూటీ సీఎంకు తెలియజేశారు.

News June 28, 2024

నేడు తోటపల్లి ప్రాజెక్టు నీరు విడుదల

image

గరుగుబిల్లి మండలంలో ఉన్న తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు నుంచి సాగునీటిని గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేడు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మంత్రి సంధ్యారాణి సాగునీటిని విడుదల చేయనున్నారు. సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇతర అధికారులు పాల్గొనున్నారు.

News June 28, 2024

ప్రకాశం: నూతన చట్టాలపై అవగాహన అవసరం: ఎస్పీ

image

జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నూతన చట్టాల పట్ల పోలీసులందరికీ అవగాహన ఉండాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు.