India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై జులై 7వ తేదీ లోపు నివేదిక అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కుప్పంలోని R&B గెస్ట్‌హౌస్‌లో సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులంతా సమన్వయంతో నివేదిక తయారు చేయాలన్నారు. ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని ఆదేశించారు.

మహిళ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిందని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అప్పు విషయంలో మహిళతో దుర్భాషలాడి ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన శివ నాగమణి, శ్రీనివాసరెడ్డిలకు కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.8వేల జరిమానా విధించిందని తెలిపారు.

జులై 1వ తేదీన నగరంలో ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించనున్నట్లు జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. జులై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి వార్డు సచివాలయాల వారిగా పింఛన్లు పంపిణీ జరుగుతుందన్నారు. పింఛనుదారులు తమ ఇంటి వద్దకు పింఛను అందించడానికి వచ్చే సచివాలయ కార్యదర్శులకు అందుబాటులో ఉండి సహకరించాలని కమిషనర్ కోరారు.

జూలై 1న ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. శనివారం బ్యాంకుల ద్వారా అధికారులు నగదు విత్ డ్రా చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 30న కోవెలకుంట్ల మండలంలో పర్యటించనున్నట్లు బీసీ రామనాథరెడ్డి తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గం చరిత్రలో తొలిసారి మంత్రి పదవిని దక్కించుకున్న బీసీ జనార్దన్ రెడ్డి, పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కోవెలకుంట్ల మండలానికి రానున్నారు. దీంతో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని విశాఖపట్నం రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బి.విజయభాస్కర్ సూచించారు. విజయనగరం డీఈఓ ఆఫీసులో విద్యాశాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి పాఠశాలలోనే భోజనం చేసేటట్లు ప్రోత్సహించాలన్నారు. భోజన నాణ్యతను పరిశీలించాలన్నారు. అకాడమిక్ విషయాలపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. డీఈవో ప్రేమకుమార్, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయిన కుంట ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుక్కి, మడివి గంగి జనజీవన స్రవంతిలో కలిశారని అల్లూరి జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా గురువారం తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీరు మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. అయితే మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గడం, పార్టీలో ఆదివాసేతర నాయకుల వివక్షత వల్ల లొంగిపోయారని తెలిపారు.

సోంపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ జై భీమ్ సిబ్బందితో కలిసి మందస మండలంలోని కొండలోగాం పంచాయతీలోని నాటుసారా తయారీని అరికట్టేందుకు గురువారం సాయంత్రం దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో బెల్లపు ఊటలను ధ్వంసం చేసినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అనంతరం గ్రామంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1900 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో జులై 1, 2 తేదీల్లో చేపట్టనున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్, డిఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, జిఎస్ డబ్ల్యుఓ ఏవో లక్ష్మీపతి, తదితర అధికారులు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ అంశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పి.కేశవ్‌తో కలిసి గురువారం చర్చించారు. ఈ వారంలో ప్రపంచ బ్యాంకు బృందం పోలవరం పర్యటన, నిర్వాసితుల సమస్యల నేపథ్యంలో చర్చలు సాగాయి. చర్చల్లో జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.