India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన రెండేళ్ల రెండు నెలల కాలం తన సర్వీస్‌లో మరుపురాని ఘట్టం అని IAS డా.మాధవీలత అన్నారు. జిల్లా నుంచి రిలీవ్ అయిన ఆమెకు గురువారం స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో అధికారులు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఎస్పీ జగదీష్, జేసీ తేజ్ భరత్, సబ్‌కలెక్ట ర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, సిబ్బంది తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.

ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్‌ను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో లోక్‌సభ ఎంపీలతో ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్‌కు వేమిరెడ్డి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. పలు అంశాలపై చర్చించారు.

జులై 1న పెన్షనర్ల ఇంటి వద్దే సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ తెలిపారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి పింఛన్ల పంపిణీపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెంచిన పెన్షన్, 3 నెలల ఎరియర్స్‌తో కలిపి పంపిణీ చేయాలని చెప్పారు. జిల్లాలో పెన్షన్‌ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జులై 1న ఇంటి వద్దే ఫించన్ నగదు అందజేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని డీఆర్డీఏ, మెప్మా పీడీలు, ఐసీడీఎస్, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.

జిల్లాలోని హైస్కూలు అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన సీనియార్టీ జాబితా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఈ జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఎంఈవోలు, ఉప విద్యాధికారులను సంప్రదించాలన్నారు. ఏమైనా లోపాలుంటే ఆధారాలతో ఈనెల 29వ తేదీలోపు సమర్పించాలని ఆమె కోరారు.

జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలను జులై 7న ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 13 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జులై 7న స్వామి వారి తొలి దర్శనం, 9న అగ్నిగుండం ఏర్పాటు, 12న ఐదవ సరిగెత్తు, 14న చిన్న సరిగెత్తు, 16న పెద్ద సరిగెత్తు, 17న అగ్నిగుండం ప్రవేశం, 19న స్వామి వారి చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. నిమ్మనపల్లె మండలం దివిటివారిపల్లెకు చెందిన రామాంజులు(27) ఊరికి సమీపంలోని బోరు వద్ద ఓ మహిళతో ఉన్నాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మహిళను దారుణంగా నరికి చంపారు. తర్వాత రామాంజులుపై దాడి చేశారు. అతను తీవ్రంగా గాయపడటంతో మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. మహిళ ముఖం గుర్తుపట్టలేనంతగా నరకడంతో ఆమె ఎవరనేది తెలియరాలేదు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి నిర్వహించిన వీడియో కార్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. నూరు శాతం పంపిణీ తొలిరోజే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెన్షన్ పంపిణీలో పాల్గొనాలని చెప్పారు.

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఆగస్టు 13, 14, 16, 17 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్‌సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జూలై 4 నుంచి అక్టోబర్ 10వరకు ప్రతి మంగళవారం, నం.05951 SMVB- NTSK రైలును జూలై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.