India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలో YS కుటుంబాన్ని మెజారిటీ ప్రజలు అభిమానిస్తారనేది కాదనలేని సత్యం. అలాంటి కుటుంబంలో రాజకీయ విభేదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. వైఎస్సార్ వారసులు వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ఇది ఎంత వరకు వెలుతుందని అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంట్లో సమస్యలను బయటపెట్టుకోవడంతో ప్రత్యర్థులకు చులకనగా కనిపించడం తప్ప మరొకటి లేదని ప్రజలు బహిరంగంగానే అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఉంటుందని నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. నెల్లూరులోని కమాండ్ కంట్రోలు సెంటర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గురువారం విశాఖ నగరానికి వస్తున్నారు. విశాఖ దక్షిణ ఉత్తర నియోజకవర్గాలకు సంబంధించి సీతంపేట జంక్షన్‌లో జరిగే సభలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జి తెలిపారు. సాయంత్రం 6:30 గంటలకు సభ ప్రారంభం అవుతుందన్నారు. మొదట పేర్కొన్నట్లుగా రోడ్ షో ఉండదన్నారు. రాత్రికి చంద్రబాబు పార్టీ కార్యాలయ ఆవరణలో బస్సులో బస చేస్తారని వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు గుంటూరు జిల్లాకు ఎలక్షన్ కమిషన్ 9 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులను కేటాయించింది. వారితో జిల్లా ఎస్పీ తుషార్ బుధవారం పోలీస్ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి తెలుసుకొని ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. ఏఎస్పి షెల్ కె, మనోజ్ హెగ్డే పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో సినీ హీరో నారా రోహిత్ పర్యటించనున్నట్లు మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. రొళ్ల మండల కేంద్రంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి ఎంఎస్ రాజు, ఎంపీ అభ్యర్థి పార్థసారథికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు.
పాలీసెట్ ఫలితాల్లో మామిడికుదురు మండలం మాకనపాలెం గ్రామానికి చెందిన కవలలు భూపతి శ్రీ నిశాంత్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని సోదరుడు భూపతి శ్రీనిహాంత్ రెండో ర్యాంకు సాధించాడు. నిశాంత్ రాష్ట్ర స్థాయిలో 71, నిహాంత్ 87వ ర్యాంకు సాధించారు. ఇద్దరికీ సమానంగా 117 మార్కులు వచ్చాయి. పదో తరగతి పరీక్షల్లో ఇద్దరు తెలుగు, మాథ్స్, సోషల్ సబ్జెక్టులో 100 మార్కులు రావడం విశేషం.
సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరగనున్న సింహాద్రి అప్పన్న చందనోత్సవం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత సింహగిరి పైకి భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. రూ.300, రూ.1000, రూ.1500 టికెట్లు తీసుకున్నవారికి దర్శన సమయాల స్లాట్లు కేటాయించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో ఈసారి ప్రోటోకాల్ దర్శనాలు లేవు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలుకు రానున్నారు. ఉదయం 10.15 గంటలకు విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. 10.35 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. 10.55 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానం సమీపంలోని వైఎస్ఆర్ సర్కిర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని స్రసంగిస్తారు. 11.50 గంటలకు సభ ముగించుకుని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బయలుదేరుతారు.
ప్రధాని మోదీ విజయవాడలో నిర్వహించిన రోడ్ షో సూపర్ సక్సెస్ అయిందని TDP తెలిపింది. ఇది నవ్యాంధ్ర నవశకానికి నాంది అని ట్వీట్ చేసింది. మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షోకు ప్రజలు భారీగా హాజరై బ్రహ్మరథం పట్టారని తెలిపింది. పీవీఆర్ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముగ్గురూ ముచ్చటిస్తూ కనిపించారు. పలుమార్లు మోదీ, చంద్రబాబు, పవన్ మధ్య నవ్వులు పూశాయి.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 11వ తేదీన కడపకు రానున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. 11వ తేదీ ఉదయం కడపలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలతో పాటు పాల్గొననున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.