India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గడువును ఈ నెల 9 వరకు పొడిగించినట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బుధవారం తెలిపారు. ఉద్యోగులు వారి ఓటు హక్కును కోల్పోరాదనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ గడువును పొడిగించిందన్నారు. బాపట్ల జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలలో గురువారం కూడా ఫెసిలిటేషన్ కేంద్రాలు కొనసాగుతాయన్నారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
సార్వత్రిక ఎన్నికలు-2024 లో బాగంగా ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ స్టేషన్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల పరిశీలకులు, కేంద్ర బలగాలు ,పోలీస్ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం చీరాల పోలేరమ్మ గుడి వద్ద నుంచి స్థానిక గడియార స్తంభం సెంటర్ వరకు ఉదయం 10 గంటలకు 2కె రన్ కార్యక్రమం జరగనుంది. దీనిని తెలుగు ప్రొఫెషనల్ వింగ్ (టీపీడబ్ల్యు) నిర్వహిస్తోందని, అందులో తాను పాల్గొంటున్నట్లు సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ బుధవారం తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని, అందుకు అందరినీ జాగృతం చేసేందుకు 2కే రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు గురువారం చివరి అవకాశాన్ని కల్పిస్తున్నామని.. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. గడిచిన నాలుగు రోజులుగా జిల్లాలో 41,225 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఇంకా ఓటు హక్కు వినియోగించుకొని ఉద్యోగులకు ఈరోజు అవకాశం ఉందని స్పష్టం చేశారు.
పీలేరు నియోజకవర్గం కలికిరిలో ప్రధాని మోదీ సభకు వెళ్లి వస్తున్న ఓ వ్యక్తి చనిపోయాడు. కేవీపల్లె మండలం తిమ్మాపురానికి చెందిన షేక్ జాఫర్(40), అప్జల్, వారాధి, షఫీ ఆటోలో మోదీ సభకు వెళ్లారు. తిరిగి వస్తూ సభలో ఐరన్ పైపులకు ఏర్పాటు చేసిన జెండాలు తీసుకున్నారు. వాటిని ఆటోకు కట్టారు. సభా ప్రాంగణ సమీపంలో అందులోని ఓ జెండా కరెంట్ వైర్లకు తగిలింది. జాఫర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన వారికి గాయాలయ్యాయి.
సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరగనున్న అప్పన్న బాబు చందనోత్సవం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత సింహగిరి పైకి భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. రూ.300, రూ.1000, రూ.1500 టికెట్లు తీసుకున్నవారికి దర్శన సమయాల స్లాట్లు కేటాయించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో ఈసారి ప్రోటోకాల్ దర్శనాలు లేవు.
సినీనటుడు శ్రీకాంత్ కారులో వస్తుండగా మర్రిపాలెం టోల్‌గేట్ వద్ద ఆయన కారును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. ఆయన పూరి నుంచి హైదరాబాద్ వెళుతుండగా నిబంధనల ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి షేక్ బాబూరావు ఇతర సిబ్బంది ఆపి తనిఖీ చేశారు. అన్నీ సక్రమంగా ఉండడంతో విడిచిపెట్టేశారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తాను కారులో వస్తున్నానని శ్రీకాంత్ తెలిపారు.
సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ ఈ ఏడాది చందనోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా ఏ.మల్లికార్జున పేర్కొన్నారు. అంతరాలయ దర్శనాలు ఉండవని తేల్చిచెప్పారు. ఎలాంటి రాజకీయపరమైన ప్రోటోకాల్ కూడా ఉండబోదని స్పష్టం చేశారు. పోలీసు కమిషనర్ డా ఏ రవిశంకర్‌తో కలిసి స్థానిక కలెక్టరేట్ వీసీ హాలులో బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి బుధవారం జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ వకుల్ జిందాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందురోజు వరకు ప్రతి గ్రామాల్లో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని తెలిపారు. హోటల్స్, లాడ్జిలను తనిఖీ చేస్తూ అనుమానితులు ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలని ఉమ్మడి ప.గో జిల్లా ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం గోపాలపురం అసెంబ్లీకి చెందిన పలువురి ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తారుమారు కాగా.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు తెలిపామన్నారు. 15 నిమిషాల వ్యవధిలో ఆ ఉద్యోగులు ఓట్లు వినియోగించుకునేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు.
Sorry, no posts matched your criteria.