India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గురువారం కూడా అవకాశం కల్పించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ బుధవారం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం బుధవారంతో ముగిసిందన్నారు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు ఏవైనా కారణాల వల్ల ఓటు వేయకపోతే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
జిల్లాలో మే 13వ తేదీన సజావుగా ఎన్నికలు నిర్వహించేలా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన బుధవారం తెలిపారు. పోలింగ్ స్టేషన్‌లలో నిర్దేశించిన కనీస మౌలిక వసతుల ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల నియామకం, తగినంత పోలీసు బలగాలను నియమించిన అంశాలపై సమావేశాన్ని నిర్వహించారు.
అనంతపురం రేంజ్ నూతన డీఐజీగా షేమషిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం సాయంత్రంలోగా అనంతపురంలో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం డీఐజీగా పని చేసిన అమ్మిరెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజాకు మద్దతుగా తన ఆడపడుచు ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ కూటమి మేనేఫెస్టోలో పేర్కొన్న అంశాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు మే 12వ తేదిన వారికి కేటాయించిన నియోజకవర్గాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా రవాణా సదుపాయం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి, ఎన్నికల కమీషన్ సూచనలను శత శాతం తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలానీ సమూన్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సెక్టోరియల్ సమావేశంలో మాట్లాడారు. సెక్టోరియల్ అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం 72 గంటలు ప్రొటోకాల్ చాలా కీలకమన్నారు.
ఎన్నికల్లో గెలవలేక మాజీ మంత్రి నారాయణ 1200 మంది రౌడీలను దించారని, వారితో పాటు అదనంగా హైదరాబాద్ విజయవాడ నారాయణ సిబ్బంది మొత్తం నెల్లూరులో మోహరింప చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు విజయ్ సాయి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున అన్నారు ఎన్నికల సన్నద్ధత సమావేశంలో భాగంగా ఆయన బుధవారం కలెక్టరేట్ సమావేశంలో ఆర్వోలతో సమావేశం అయ్యారు. సెక్టోరల్, రూట్ అధికారులతో సమన్వయం వహించాలని పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించాలని, ఈవీఎంల తరలింపు అంశాలపై సూచనలు చేశారు.
తిరుపతి జిల్లాలోని 7-అసెంబ్లీ స్థానాలలో, ఇతర జిల్లా ఓటర్ల కొరకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు 9మే మధ్యాహ్నం వరకు నిర్వహించబడునని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మే 9వ తేదీన మధ్యాహ్నం వరకు తిరుపతి SVU క్యాంపస్ హైస్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోగలరని కలెక్టర్ తెలిపారు.
పల్నాడు జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నవారు ఈ నెల 9న నర్సరావుపేటలో ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అనివార్య కారణాల చేత ఓటు వేయని ఉద్యోగులకు నరసరావుపేట SSN కాలేజీలో గల ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించామన్నారు. ఫామ్ 12 సమర్పించి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.