Andhra Pradesh

News May 9, 2024

ఎన్నికల ఏర్పాట్ల బాధ్యత సెక్టార్ అధికారులదే: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఎన్నికల రోజున పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాట్లన్నీ పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. పోల్ డే మానేజ్మెంట్ సిస్టం ప్రకారంగా విధులన్ని నిర్వహించాలన్నారు. బుధవారం సెక్టార్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని పోలింగ్ స్టేషన్‌లలో ఎన్నికల సిబ్బందికి సరైన ఆహారం సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News May 9, 2024

కృష్ణా: పోస్టల్ బ్యాలెట్‌కు మరో అవకాశం

image

ఈ నెల 9వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఆర్ఓ కార్యాలయాల్లో పోలీస్ సిబ్బంది కోసం ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోని వారి కోసం ఈ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News May 8, 2024

VZM: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐ కళాశాలల్లో ప్రవేశాలకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ టీవీ గిరి బుధవారం ఓ ప్రకటనలో కోరారు. iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వెల్డర్, ప్లంబర్లకు 8వ తరగతి, మిగతా అన్ని ట్రేడ్ లకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

News May 8, 2024

నకరికల్లు: పిడుగుపాటుతో రైతు మృతి

image

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన తప్పట్ల పాపారావు అనే రైతు మంగళవారం కురిసిన అకాల వర్షానికి పిడుగుపడి మరణించినట్లు మృతుడి కుమారుడు తెలిపారు. మృతుడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తాడని, పొలం నుంచి వస్తుండగా పిడుగు పడి మరణించినట్లు వివరించారు. ఈ మేరకు నకరికల్లు పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

News May 8, 2024

ఎచ్చెర్ల: స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలిన

image

ఎచ్చెర్ల శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ బుధవారం పరిశీలించారు. జిల్లాలో గల పార్లమెంటు, శాసన సభ నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. ఈ పరిశీలనలో జెసి ఎం. నవీన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీమా ఉన్నారు.

News May 8, 2024

దివ్యాంగ యువతిపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష

image

దివ్యాంగురాలైన యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఏలూరులోని ఓ కాలనీకి చెందిన యువతిపై అదే కాలనీకి చెందిన వెంకటరమణ 2016 ఏప్రిల్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో బుధవారం మహిళా కోర్టు న్యాయమూర్తి రాజేశ్వరి ఆ నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని కోర్టు పీపీ డీవీ రామాంజనేయులు తెలిపారు.

News May 8, 2024

నంద్యాల జిల్లాలో ఓటింగ్ శాతం పెంచాలి: కలెక్టర్

image

18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం స్వీప్ యాక్టివిటీ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై టోపీలను ఆవిష్కరించారు. ఎన్నిక‌ల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని త‌మ‌కు న‌చ్చిన వారికి ఓటు వేసి జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచాల‌ని అన్నారు.

News May 8, 2024

అనారోగ్యంతో ఏఎస్సై మృతి

image

రంపచోడవరం నియోజకవర్గం చింతూరులో ఏఎస్సైగా పని చేస్తున్న ఎన్.కుశలన్నదొర అనారోగ్యంతో మృతి చెందారని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని రోజుల క్రితం విధి నిర్వహణలో ఉండగా… ఆయనకు ఫీట్స్ వచ్చి అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి కాకినాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. ఆయన స్వగ్రామం గంగవరం మండలం లొద్దిపాలెం అని తెలిపారు.

News May 8, 2024

అనంతపురం డీఐజీగా షేమషి నియామికం

image

అనంతపురం రేంజ్ నూతన డీఐజీగా షేమషిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం సాయంత్రంలోగా అనంతపురంలో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం డీఐజీగా పని చేసిన అమ్మిరెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

News May 8, 2024

పాలీసెట్‌లో విశాఖ విద్యార్థినికి 120/120

image

పాలీసెట్‌లో కొమ్మాది విద్యార్థిని పోతుల జ్ఞాన హర్షిత అద్భుత ప్రతిభ కనబరిచింది. బుధవారం పాలిసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో హర్షిత 120 మార్కులకు గాను 120 మార్కులు తెచ్చుకొని ఫస్ట్ ర్యాంక్ సాధించింది. చీడికాడ మండలం తూరువోలుకు చెందిన హర్షిత తండ్రి అప్పలనాయుడు టీచర్, తల్లి నీటిపారుదల శాఖలో అకౌంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు హర్షిత‌ను అభినందించారు.