Andhra Pradesh

News May 8, 2024

‘ఎన్నికలకు 48 గంటల ముందు మద్యం దుకాణాలు బంద్’

image

ఈనెల 13న ఎన్నికల జరుగుతున్న దృష్ట్యా పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. 11వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి నుంచి 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జూన్ 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా దుకాణాలను మూసి ఉంచాలని పేర్కొన్నారు.

News May 8, 2024

VZM: జిల్లా వ్యాప్తంగా 15.62 లక్షల మంది ఓటర్లు

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 15,62,921 మంది ఓటర్లు ఉన్నారు. ఏప్రిల్ 25వ తేదీ నాటికి ఎన్నికల అధికారులు తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం… జిల్లాలో 7,70,805 మంది పురుష ఓటర్లు ఉండగా… 7,92,038 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా మరో 78 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. వీళ్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొత్తం 1897 పోలింగ్ స్టేషన్లను అధికారులు సిద్ధం చేశారు.

News May 8, 2024

పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేసిన తిక్కారెడ్డి

image

కర్నూలు జిల్లాలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీస్ అధికారులపై ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ ఉమేష్ కుమార్‌కి కర్నూలు టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. జిల్లాలో వైసీపీ నాయకులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన కోరారు. కర్నూలు ఎంపీ సంజీవ కుమార్‌, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నంద్యాల నాగేంద్ర ఉన్నారు.

News May 8, 2024

10న కడపకు సీఎం జగన్.. ముమ్మరంగా ఏర్పాట్లు  

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 10న కడప వస్తున్నట్లు వైసీపీ కాంగ్రెస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్  కడపలో రోడ్ షో పాటు 7 రోడ్ల వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మేయర్ సురేశ్ బాబుతో కలిసి ఆయన ఏర్పాట్లు పరిశీలించారు.

News May 8, 2024

రాళ్ల దాడిలో పిన్నెల్లి సతీమణికి గాయాలు

image

వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో బుధవారం టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. పరస్పర దాడుల్లో ఇరు పార్టీలవారికి పిన్నెల్లి సతీమణి రమాకి గాయం కాగా, మాజీ MPP కారు ధ్వంసమైంది. ఇరు వర్గాలను చెదరగొడుతున్న సందర్భంలో ఎస్సై శ్రీహరికి కూడా గాయాలయ్యాయి.

News May 8, 2024

నంద్యాల: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

శ్రీశైలంలోని ఎస్టీ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న బొడ్డపాటి మల్లికార్జున అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ జి.ప్రసాద్ రావు బుధవారం తెలిపారు. సమాచారం మేరకు తనిఖీలు చేయగా మల్లికార్జున వద్ద నుంచి 105 గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఏఎస్ఐ గురవయ్య, సుంకన్న, రఘునాథుడు, బాలకృష్ణ, మహేశ్, శివ మహేంద్ర రెడ్డి ఉన్నారు.

News May 8, 2024

నెల్లూరు: భార్యపై భర్త కత్తితో దాడి

image

భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన మధు, భార్య శిరీషతో కలిసి బుతుకు తెరువు కోసం ఏడేళ్ల క్రితం వచ్చి మదనపల్లె పరిధిలోని నక్కలదిన్నెలో స్థిరపడ్డారు. చిప్పిలి మేస్త్రీ నాగరాజు కుమారుడు రఘు.. శిరీషతో ఉండగా అక్కడ మహిళలు రఘును పట్టుకున్నారు. విషయం తెలిసిన భర్త మధు ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడి చేశాడు.

News May 8, 2024

మదనపల్లె: భార్యపై భర్త కత్తితో దాడి

image

భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన మధు, భార్య శిరీషతో కలిసి బ్రతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం వచ్చి నక్కలదిన్నెలో స్థిరపడ్డారు. చిప్పిలి మేస్త్రీ నాగరాజు కుమారుడు రఘు.. శిరీషతో ఉండగా అక్కడ మహిళలు రఘును పట్టుకున్నారు. విషయం తెలిసిన భర్త మధు ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడి చేశాడు.

News May 8, 2024

కామినేని తరఫున సినీ హీరో వెంకటేష్ ప్రచారం

image

కైకలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తరఫున సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం సాయంత్రం కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కైకలూరు అభివృద్ధి చెందాలంటే కామినేని శ్రీనివాస్‌తోనే సాధ్యమని ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వెంకటేష్ కోరారు.

News May 8, 2024

SKLM: 46 మంది హోంగార్డులకు దక్కని ఓటు హక్కు

image

పాలకొండ సబ్ డివిజన్లో పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ 46 మంది హోంగార్డులకు ఓటు హక్కు కల్పించడం లేదని వాపోయారు. మూడు రోజుల నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ ఓటుపై ఎన్నికల అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల అధికారులు చొరవ తీసుకొని తమకు ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.