Andhra Pradesh

News May 8, 2024

సీఎం జగన్ కళ్యాణదుర్గం రేపు పర్యటన షెడ్యూల్

image

సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. కర్నూలులో గురువారం మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 1గంటకు కళ్యాణదుర్గానికి చేరుకుంటారు. 1.10కి హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ స్థలికి చేరుకుంటారు. 1.30 నుంచి 2.15 వరకు బహిరంగసభ, అనంతరం 2.30కు అన్నమయ్య జిల్లా రాజంపేటకు వెళ్లనున్నారు.

News May 8, 2024

వ్యక్తిత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్: నందమూరి లక్ష్మీపార్వతి

image

వ్యక్తిత్వం, సొంత ఆలోచన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. లోకేశ్ ఒకటో తరగతి కూడా చదువుకోలేదు అని, చంద్రబాబు మేనేజ్ చేసి సర్టిఫికెట్లు తెప్పించారన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ ఒక క్యాన్సర్ గడ్డగా మారి చంద్రబాబుకు అమ్ముడుపోయారని, కులం ముసుగులో మేధావిగా చెప్పుకుంటూ పేదల పథకాలు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.

News May 8, 2024

మద్యం దుకాణాలు బంద్: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఈ నెల 13న ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈనెల 11న సాయంత్రం 7నుంచి 13 సాయంత్రం 7 వరకు పూర్తిగా మూసివేయాలన్నారు. అదే విధంగా జూన్ 4న కౌంటింగ్ రోజు కూడా దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశించారు.

News May 8, 2024

UPSCలో శ్రీకాకుళం జిల్లా యువకుడి సత్తా

image

UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో సింగూరు కృష్ణ చైతన్య ఆల్ ఇండియా 83వ ర్యాంక్ సాధించారు. కృష్ణ చైతన్య ప్రస్తుతం EPFO డిపార్ట్మెంట్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. కృష్ణ చైతన్య సొంత ఊరు సరుబుజ్జిలి మండలం కూనజమ్మన్నపేట. ఇతని తండ్రి సింగూరు రంగనాయకులు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి మీనాకుమారి గృహిణి. స్థానిక గ్రామస్థులు కృష్ణ చైతన్యకు అభినందనలు తెలిపారు.

News May 8, 2024

స్వీప్ కార్య‌క్ర‌మంలో భాగంగా బైక్ ర్యాలీ

image

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తీఒక్క‌రూ ఓటు వేసి, జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచాల‌ని జిల్లా ఎన్నిక‌ల సాధార‌ణ ప‌రిశీల‌కులు త‌లాత్ ప‌ర్వేజ్ ఇక్బాల్ రోహిల్లా పిలుపునిచ్చారు. స్వీప్ కార్య‌క్ర‌మంలో భాగంగా బుధ‌వారం విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించి, ఓటుహ‌క్కు వినియోగంపై అవగాహ‌న క‌ల్పించారు. క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ప‌రిశీల‌కులు స్వ‌యంగా మోటార్ సైకిల్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు.

News May 8, 2024

కృష్ణా: ‘ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి’

image

13వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు 12,13 తేదీల్లో ప్రింట్ మీడియాలో అభ్యర్థుల ప్రచార ప్రకటనలకు విధిగా MCMC కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలియజేశారు. అభ్యర్థులతోపాటు మీడియా యాజమాన్యాలు కూడా MCMC నుంచి అనుమతులు తీసుకోవాలని వెల్లడించారు.

News May 8, 2024

తిరుపతి: స్విమ్స్‌లో ఓపీ, ఓటీలకు సెలవు

image

రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరగుతున్న నేపథ్యంలో శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) సోమవారం 13వ తేదీన ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటించామని స్విమ్స్ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్‌వీ కుమార్ తెలిపారు. అయితే స్విమ్స్ అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

News May 8, 2024

VZM: చంద్రబాబు సభ ఏర్పాట్ల పరిశీలన

image

గురువారం చీపురుపల్లిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ స్థలం వద్ద జరుగుతున్న ఏర్పాట్లును విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున బుధవారం పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున వెంట కిమిడి సూరప నాయుడు, మొండి దివాకర్, తదితరులు పాల్గొన్నారు.

News May 8, 2024

10న రాజంపేటలో సినీ నటుడు నారా రోహిత్ రోడ్ షో

image

కూటమి అభ్యర్థుల తరఫున సినీ నటుడు నారా రోహిత్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాజంపేటలో రోడ్ షో నిర్వహించనున్నట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని రాజంపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యం కోరారు. ఏర్పాట్లను పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు

News May 8, 2024

రోడ్డు ప్రమాదం.. తండ్రి మృతి, కుమారుడికి గాయాలు

image

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బూరుగుపూడి నుంచి జగ్గంపేట వైపు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సడెన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి డివైడర్‌పై పడి, తలకు బలమైన గాయమవడంతో వ్యక్తి స్పాట్‌లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్వల్ప గాయాలైన కుమారుడిని హైవే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.