India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎచ్చర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద పోలింగ్ అనంతరం ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రి భద్రపరుస్తున్న స్ట్రాంగ్ రూములను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక బుధవారం పరిశీలించారు. ఈవీఎంలు ఇతర సామగ్రి తీసుకువచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా.. చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేర నియంత్రణ చర్యలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జి, డార్మిటరీలను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాడ్జీల్లో ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించి, బస చేసినవారి వివరాలను తెలుసుకున్నారు. కొత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలు ఆరా తీశారు. లాడ్జి నిర్వాహకులు సక్రమంగా రిజిస్టర్ నిర్వహించాలని పోలీసులు సూచించారు.
రాజంపేట పాత బస్టాండ్ లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభ జరగనున్నది. ఈ సభకు జన సమీకరణ కోసం పార్టీ శ్రేణులు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత మొట్టమొదటి సారి జగన్ రాజంపేటకు రానున్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ రాజంపేటలో ప్రచారం చేసి వెళ్లారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని 1983లో విశాఖ-2 నియోజకవర్గ TDP అభ్యర్థిగా పోటీ చేసిన ఈ.వాసుదేవరావు తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పల్లా సింహాచలంపై 47,916 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత 47,883 ఓట్ల భారీ మెజారిటీని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు 2019లో గెలిచారు. 1985లో పాడేరు నుంచి TDP అభ్యర్థిగా పోటీ చేసిన కొట్టగుళ్లి చిట్టినాయుడు 113 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.
గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి చెందిన ఘటన సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. రోజూలాగే అందరితో కలిసి కరువు పనికి వెళ్లిన నర్ర సుజాత (53) గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలింది. సుజాత మృతి చెందడంతో పాకల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల అనంతరం ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకువచ్చే వాహనాలకు ఏటువంటి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక, పోలీసు అధికారులుకు దిశానిర్దేశం చేశారు. బుధవారం జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక, ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాల వద్ద పోలింగ్ అనంతరం ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని రిసీవ్ చేసుకున్న రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించారు.
ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయి గ్రామస్థులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ గ్రామంలో మద్యం, నగదు పంపిణీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. స్వచ్ఛందంగా అందరం ఓటేస్తామని చెబుతున్నారు. ఈ మేరకు ప్రతి ఇంటి ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘రాజ్యాంగాన్ని మార్చాలని భావించే పార్టీ అభ్యర్థులు, ఓట్లు కొనాలనుకునేవారు మా ఇంటికి రానవసరం లేదు’ అని బ్యానర్లపై రాశారు.
రానున్న రెండు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. వచ్చే 5 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 41.6 నుంచి 43.7 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 28.6 నుంచి 29.7 డిగ్రీలుగా నమోదయ్యే సూచన ఉందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుపాం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నట్లు టీడీపీ నియోజకవర్గ నాయకులు తెలిపారు. ఉదయం 9 గంటలకు సాయిబాబా గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వచ్చి రావాడ జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం చీపురుపల్లిలో జరిగే రోడ్ షోలో పాల్గొనున్నారు.
ఈనెల 9న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కర్నూలుకు రానున్నట్లు జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ తెలిపారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో వైసీపీ నాయకుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్, రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డితో కలిసి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. 9న వైఎస్సార్ సర్కిల్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.